రూ. 20 లక్షలు ఇచ్చి ఉద్యోగంలో చేరండి! జొమాటో సీఈఓ వింత జాబ్ ఆఫర్!
Thu Nov 21, 2024 11:29 Indiaప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ వింత జాబ్ ఆఫర్ చేశారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ పొజిషన్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పిన దీపిందర్ అందుకు మొదటి ఏడాదికి జీతం చెల్లించనని చెప్పారు. అంతేకాకుండా ఉద్యోగం కోసం వచ్చే అభ్యర్థే తిరిగి కంపెనీకి ఫీజు రూపంలో రూ. 20 లక్షలు ఇవ్వాలని షరతు విధించడం గమనార్హం. దీనికి సంబంధించి ఎక్స్ లో పోస్ట్ చేసిన దీపిందర్ గోయల్.. ఈ ఉద్యోగానికి అప్లై చేసే వ్యక్తి గురుగ్రామ్ లో ఉన్న జొమాటొ హెడ్ ఆఫీస్ లో పనిచేయాలి. కొత్తగా నేర్చుకునేందుకు, జీవితంలో ఎదిగేందుకు సంకల్పం ఉన్నవారు దరఖాస్తు చేసుకొవచ్చని ట్వీట్ చేశారు.
ఇంకా చదవండి: ఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ ఉద్యోగానికి అనుభవం అక్కరలేదని, వినూత్నంగా ఆలోచించేవారు ఇందుకు అర్హులని స్పష్టం చేశారు. అలాగే, ఈ ఉద్యోగంలో ఎంపికైన తర్వాత జొమాటోతో పాటు బ్లింక్ ఇట్, జొమాటో ఫీడింగ్ ఇండియా ఎన్టీఓ, హైపర్ ప్యూర్ కంపెనీల కోసం పనిచేయాలి. మొదటి ఏడాదికి వారికి ఎటువంటి జీతం ఉండదని, అభ్యర్థే రూ. 20 లక్షలు ఫీడింగ్ ఇండియాకు విరాళమివ్వాలని పేర్కొన్నారు. ఒకవేళ ఉద్యోగి అడిగితే జొమాటో కూడా ఎన్జీఓకు రూ. 50 లక్షలు డొనెట్ చేస్తుందన్నారు. అయితే, రెండో ఏడాది నుంచి రూ.50 లక్షల కంటే ఎక్కువ జీతం ఇస్తామని దీపిందర్ గోయల్ చెప్పడం విశేషం. ఇదే సమయంలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసేవారు సాధారణ రెజ్యుమే ఇవ్వొద్దని, 200 పదాల్లో తమ అర్హత గురించి తెలియజేయాలన్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!
శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!
నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhrraPravasi #India #Gurugram #Zomato #JobOffer
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.