దేశంలో అతి తక్కువ కాలుష్యం గల నగరాలు ఇవే! అవేంటో చూసేయండి!

Header Banner

దేశంలో అతి తక్కువ కాలుష్యం గల నగరాలు ఇవే! అవేంటో చూసేయండి!

  Thu Nov 21, 2024 11:48        India

దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రస్తుతం గాలి నాణ్యత తీవ్రంగా పడిపోతోంది. రోజురోజుకూ తీవ్ర ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొంటున్న వేళ.. ప్రభుత్వాలు అప్రమత్తమై చర్యలు చేపడుతున్నాయి. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తీవ్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి.. దేశంలో తక్కువ కాలుష్యం నమోదవుతున్న నగరాల జాబితాను విడుదల చేసింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో గాలి కాలుష్యం తీవ్రంగా నమోదవుతున్న సమయంలో పలు నగరాలు మాత్రం స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్నాయి. 

 

దేశంలోని 9 నగరాల్లో గాలి నాణ్యత బాగుందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. ఇందులో 7 నగరాల్లో గాలి నాణ్యత బాగుందని.. మరో రెండు నగరాల్లో సంతృప్తికరంగా ఉందని పేర్కొంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సమాచారం ప్రకారం.. దేశంలోనే అతి తక్కువ కాలుష్య నగరాల జాబితాలో మిజోరాం రాజధాని ఐజ్వాల్‌ తొలి స్థానంలో నిలిచింది. ఐజ్వాల్‌లో గాలి నాణ్యత సూచీ 26 వద్ద నమోదైనట్లు వెల్లడించింది. దీంతో ఐజ్వాల్ వాసులు స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ.. ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటున్నారని తెలిపింది.

 

ఇంకా చదవండిఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఐజ్వాల్‌ తర్వాత సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్ ఏక్యూఐ 35.. మేఘాలయా రాజధాని షిల్లాంగ్‌ ఏక్యూఐ 36 నమోదైనట్లు పేర్కొంది. అస్సాంలోని గువాహటిలో 40 ఏక్యూఐ.. కర్ణాటకలోని చామరాజనగర్‌ 41 ఏక్యూఐ, కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో 42 ఏక్యూఐ, కేరళలోని త్రిస్సూర్‌లో 43 ఏక్యూఐ నమోదైనట్లు తెలిపింది. గాలి నాణ్యత సూచీ-ఏక్యూఐ 50 కంటే తక్కువ ఉంటే దాన్ని మంచి కేటగిరీ అని భావిస్తారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని నహర్లగన్‌లో 51 ఏక్యూఐ, అస్సాం నాగాన్‌ నగరంలో ఏక్యూఐ లెవల్స్‌ 53తో సంతృప్తికరంగా ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఇక ఏక్యూఐ 50 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరంగా ఉన్నట్లు చెబుతారు.

 

ఇక మరోవైపు.. దేశంలోని పలు నగరాల్లో ఏక్యూఐ భారీగా సూచిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో తొలి స్థానంలో ఢిల్లీ నిలవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఢిల్లీ గాలి నాణ్యత సూచీ 500 దాటడం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బుధవారం ఉదయం ఢిల్లీ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 422 నమోదైంది. మంగళవారం నాడు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 500 దాటింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఈరోజు(21-11-2024) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!

 

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రాజధాని అమరావతిపోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివి! ఎత్తుకు పై ఎత్తు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!

 

నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #India #PurestCities #Pollution #Delhi #AirPolltion