ఖతార్: అందమైన అతి పెద్ద గాలిపటాల ఫెస్టివల్! ఇంకా కొద్ది రోజులు మాత్రమే! రికార్డు స్థాయిలో
Sun Jan 28, 2024 13:42 Gulf News, Qatarదోహా: 10 రోజుల విజిట్ ఖతార్ కైట్ ఫెస్టివల్ గురువారం జనవరి 25, 2024 న ప్రారంభమైంది. పాత దోహా పోర్ట్ లోని గ్రాండ్ క్రూజ్ టెర్మినల్ అందమైన కాన్వాస్ గా మారింది. ఆక్టోపస్ ల నుండి సింహాల వరకు, అందరి ఊహలను ఆకర్షిస్తూ రూపొందిన విచిత్రమైన కైట్స్ ఆకట్టుకున్నాయి. ఫిబ్రవరి 3 వరకు సాగే ఈ ఫెస్టివల్ వీక్ డేస్ లో మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, వీకెండ్ లో (శుక్రవారం, శనివారం) ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు జరుగుతుంది. గత సంవత్సరం మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్ పార్క్ లో ఈ ఫెస్టివల్ జరిగింది. ఈ సంవత్సరం ఓల్డ్ దోహా పోర్ట్ లో జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుండి 60 మందికి పైగా పాల్గొన్నారు. ఫెస్టివల్ లో కుటుంబాలు మరియు పిల్లలు ఎక్కువ సంఖ్య లో పాల్గొన్నారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఫుడ్ కోర్టు లు, బండ్ల వద్ద భారీ రంగురంగుల గాలిపటాలు, అంతర్జాతీయ వంటకాలను సందర్శకులు ఆస్వాదించారు. పిల్లల కోసం పెయింట్ చేయడం నేర్పించే వర్క్ షాప్లు, గాలిపటాల తయారీని నేర్పించే వర్క షాప్ లను ఏర్పాటు చేశారు. అయితే, ఈ వర్క్ షాప్ లో పిల్లలకు 1,000 ఉచిత గాలిపటాలను కూడా అందించనున్నారు. నమోదు చేసుకోవడానికి, http://vqikf.comని సందర్శించాలని నిర్వాహకులు తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
#AndhraPravasi #Qatar #QatarNews #Gulf #GulfNews #GulfCountries #GulfUpdates #QatarUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.