ఏపీ ప్రజలకు తీపికబురు చెప్పిన కేంద్ర! రాజధానికి బడ్జెట్ ఎంతంటే!

Header Banner

ఏపీ ప్రజలకు తీపికబురు చెప్పిన కేంద్ర! రాజధానికి బడ్జెట్ ఎంతంటే!

  Tue Jul 23, 2024 13:51        అమరావతి - The Capital

ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర బడ్జెట్ లో రూ. 15 వేలు కోట్లు కేటాయించడంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీ అర్థం చేసుకున్నారన్నారు. ఏపీకి కేంద్రం అండగా నిలబడుతోందని చెప్పారు. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం ఏపీని నాశనం చేశారని ఆరోపించారు. ఐదేళ్ల పాటు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉందని, 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేశారే తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఏపీకి కాంగ్రెస్ ఏం చేసిందో అందరికీ తెలుసని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ ద్వారా ఏపీకి జరిగిన నష్టాన్ని మోడీ ప్రభుత్వం పూడ్చే ప్రయత్నం చేస్తోందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఏపీలోని వెనుకబడిన జిల్లాలకు కూడా ఆర్థిక సాయం అందిస్తున్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రానికి ఒక్కొక్కటిగా నిధులు విడుదలవుతున్నాయన్నారు. కేంద్ర బడ్జెట్ ను తాను స్వాగతిస్తున్నానని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికాలో స్విమ్మింగ్‌ పూల్‌లో పడి తెలుగు స్టూడెంట్ మృతి! అతడి స్నేహితుడితో పాటు..

 

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం! రెగ్యులర్‌గా అసెంబ్లీకి రానున్న జగన్! సైకో అధికార దుర్వినియోగం, RRR పరామర్శ!

 

వైసీపీకి మరో ఎదురుదెబ్బ! మాజీ ఎమ్మెల్యే రాజీనామా!

 

కుప్పంలో కౌంట్ డౌన్ - వైసీపీ కీలకనేత అందర్! చంద్రబాబుతో పెట్టుకుంటే అంతే!

 

బీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు! అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల!

 

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! 58 ఏళ్ల తర్వాత ఆ నిషేదాన్ని ఎత్తివేసిన కేంద్రం!

 

తహసీల్దారుల బదిలీ ప్రక్రియపై సీరియస్ హెచ్చరికలు జారీ! ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ వార్తలపై స్పందించిన CCLA!

   

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #Amaravathi #TheCapital