కాంటినెంటల్ కాఫీ పరిశ్రమ కార్మికులతో లోకేష్! అధిక ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు..

Header Banner

కాంటినెంటల్ కాఫీ పరిశ్రమ కార్మికులతో లోకేష్! అధిక ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు..

  Mon Apr 22, 2024 22:43        Politics

దుగ్గిరాల: ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇంకెన్నాళ్లు పక్క రాష్ట్రాలకు వెళ్లి బతుకుతాం, మన రాష్ట్రంలోనే పరిశ్రమలు ఏర్పాటుచేసి మనబిడ్డలకు స్థానికంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని నారా లోకేష్ పేర్కొన్నారు. దుగ్గిరాల మండలం మంచికలపూడిలోని కాంటినెంటల్ కాఫీ పరిశ్రమ ప్రతినిధులతో యువనేత మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం అక్కడి కార్మికులను ఉద్దేశించి లోకేష్ మాట్లాడుతూ... పరిశ్రమల ఏర్పాటు విషయంలో మెరుగైన పాలసీ తీసుకువస్తాం. ఒక్క పరిశ్రమ వస్తే అనుబంధంగా అనేక పరిశ్రమలు వస్తాయి. అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమను తీసుకువస్తే.. దానికి అనుబంధంగా వందలాది పరిశ్రమలు వచ్చాయి. దీంతో పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. నేడు ఒక్క కియా పరిశ్రమ వల్లే అనంతపురం ప్రజల తలసరి ఆదాయం రూ.30వేలు పెరిగింది.  పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన ఎకో సిస్టమ్ ఏర్పాటుచేస్తాం. మంగళగిరిలో లక్ష మందికి ఉద్యోగాలు కల్పించాలన్నదే మా లక్ష్యం.

 

ఇంకా చదవండి: పెద్దిరెడ్డిపై కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! జగన్‍ను సీబీఐ కోర్టు అరెస్ట్ చేస్తే..

 

అందుకు అనుగుణంగా పనిచేస్తాం. పరిశ్రమల ఏర్పాటు ద్వారానే పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇందుకోసం రెడ్ కార్పెట్ వేసి ఆయా పరిశ్రమలను ఆహ్వానించాలి. దుగ్గిరాలకు కాంటినెంటల్ కాఫీ పరిశ్రమ వచ్చి 30 సంవత్సరాలు దాటింది. ఆ తర్వాత ఈ ప్రాంతానికి ఒక్క పరిశ్రమ రాలేదు. ఇప్పుడు మన పిల్లల భవిష్యత్ కోసం రాష్ట్రానికి పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. మంగళగిరి రూపురేఖలు మార్చడానికే నేను వచ్చా. జగన్ అమరావతి పనులు కొనసాగించి ఉంటే.. యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించి ఉండేవి. ఆనాడు హైదరాబాద్ లో చంద్రబాబునాయుడు హైటెక్ సిటీ నిర్మించినప్పుడు కంప్యూటర్లు అన్నం పెడతాయా అని హేళన చేశారు. నేడు 15 లక్షల మంది ఆ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే అమరావతిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గ్రామాల్లో సమస్యలను కూడా పరిష్కరించాలి. ఆయా గ్రామాల్లో రోడ్లు, డ్రైయిన్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. పన్నుల భారంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరు మన రాష్ట్రాన్ని, మన నియోజకవర్గాన్ని, మన పార్లమెంట్ ను అభివృద్ధి చేస్తారో ఆలోచించి రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించాలని యువనేత లోకేష్ కోరారు. రానున్న 5ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది మా సంకల్పం, ఇందుకు కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ ప్రతినిధులు కూడా తమ సంస్థను విస్తరించి, అదనపు ఉద్యోగాల కల్పనకు కృషిచేయాలని కోరారు. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఎక్కువ ఉద్యోగాలిచ్చే సంస్థలకు ప్రోత్సాహకాలు, అవసరమైన అన్ని సహాయ, సహకారాలు రాబోయే ప్రజాప్రభుత్వంలో తాము అందిస్తామని లోకేష్ చెప్పారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నాకు ప్రాణ హాని ఉంది ఎన్నారై యాష్! ప్రచారానికి 10,000 మంది ఎన్నారై టిడిపి సభ్యుల భద్రత చూడాలి! ఈసీ కు రిప్రజెంటేషన్ సమర్పణ..

 

శృంగవరపుకోట ప్రజాగళంసభలో చంద్రబాబు ప్రసంగం! జగన్ బచ్చా అనుకున్నాను.. ఉత్తరాంధ్రలో రూ.40 వేల కోట్ల విలువైన..

 

హైదరాబాద్ US కాన్సులేట్ లో రికార్డు స్థాయిలో దరఖాస్తులు! సూపర్ సాటర్డే! 1500 మందికి వీసా ఇంటర్వ్యూలు!

 

యూఏఈ: కలుషితమైన నీరుతో నివాసుల ఆందోళన! తాగునీటి కొరత! పచ్చగా మారిన నీరు!

 

సింగపూర్: భారతదేశపు మసాల పౌడర్ బ్యాన్! కెమికల్స్ మోతాదుకు మించి! హెచ్చరించిన ప్రభుత్వం!

 

ఒమన్: సమ్మర్ షెడ్యూల్ విడుదల చేసిన సలామ్ ఎయిర్! కొత్త గమ్యస్థానాలు! జూన్ నుండి అందుబాటులో!

 

ఖతార్: ఆలస్యంగా వచ్చిందని ఫ్లైట్ ఎక్కడానికి అనుమతి ఇవ్వని ఉద్యోగి! భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది! అసలు కథ ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #NaraLOkesh #AndhraPradesh #LokeshMeeting #JObs #APJobs