ఎన్డీయే కూటమి మేనిఫెస్టో విడుదల! కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగం! ఫలితాలకు ముందే జగన్ అస్త్ర సన్యాసం!

Header Banner

ఎన్డీయే కూటమి మేనిఫెస్టో విడుదల! కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగం! ఫలితాలకు ముందే జగన్ అస్త్ర సన్యాసం!

  Tue Apr 30, 2024 16:51        Politics

తెలుగు జాతి పూర్వ వైభవం రావాలనే ఆకాంక్షతో ముందుకు వచ్చాము. కేంద్రం సహకారం రాష్ట్రానికి మెండుగా ఉంటుంది. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తాము.  సూపర్ సిక్స్ పథకాలతో ముందుకు వచ్చాము. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో కూటమిగా జట్టుకట్టాము. 10 శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తాము. మెగా డీఎస్సీ మీదే తొలి సంతకం పెడతాను. సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తాము. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500 -18 నుంచి 59 వయస్సు మహిళలకు ఆడబిడ్డ నిధి వర్తింపు.. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం ఏర్పాటు చేస్తాం. ఎంతమంది పిల్లలున్నా అందరికీ ‘తల్లికి వందనం’ అందిస్తాము. రైతులకు ఏడాదికి రూ.20 వేలు పెట్టబడి సాయం చేస్తాము. ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్‌ ఏర్పాటు చేస్తాం. దీపం పథకం కింద ఏటా 3 సిలిందర్లు ఉచితంగా ఇస్తాము.  డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తాము. పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తాము.

 

 

ఇంకా చదవండి: నరేంద్రకుమార్: మురళీకృష్ణ షాడో మంత్రిగా అంబటి! విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి..

 

యువతకు 20 లక్షల ఉద్యోగాలు మరియు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు భృతి ఇస్తాము. మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం చేసేలా ఏర్పాటు చేస్తాం. సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తాం. బోటు మరమ్మతులకు ఆర్థికసాయం.. డ్వాక్రా సంఘాలకు రూ.15 లక్షల రుణాలు. ఆర్యవైశ్య కార్పొరేషన్‍కు నిధులు కేటాయింపు. చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు.. ఎంఎస్‍ఎఈ, అంకుర సంస్థలకు రూ.10 లక్షల రాయితీ అందిస్తాం. ఎయిడెడ్ కాలేజీలకు ఫీజ్ రియింబర్స్ మెంట్ పునరుద్ధరణ. ఇళ్ళు లేనివారందరికీ టిడ్కో ఇళ్లు.. పెంచిన పింఛన్ ఏప్రిల్ నుంచి అమలు చేస్తాము. రూ.4 వేలు పెన్షన్ ఏప్రిల్ నుంచి అమలు చేస్తాం దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తాము. పూర్తి దివ్యాంగులకు రూ.10 వేల పెన్షన్ అందిస్తాం.. బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు పెడతాము. బీసీ డిక్లరేషన్, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్. బీసీ కార్పొరేషన్లు ఆర్థికంగ బలోపేతం చేస్తాం. బీసీల స్వయం ఉపాధి కోసం ఏడాదికి రూ.10 వేల కోట్లు.. ఆధునిక పనిముట్లతో ఆదరణ పథకం అమలు చేస్తాం. పవర్ లూమ్, హ్యాండ్ లూమ్‍లకు కొంతమేర ఉచిత విద్యుత్. వైసీపీ ప్రభుత్వ హయాంలో దారుణ హత్యకు గురైన చంద్రయ్య, జెల్లయ్య యాదవ్, అమర్నాథ్ గౌడ్ కేసులు రీ ఓపెన్ చేస్తాం -బాధ్యులైన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. ఆడపిల్లల విద్యా కలలకు రెక్కలు పథకం కింద వడ్డీ లేని రుణాలిస్తాం. అన్న క్యాంటీన్లు, పండుగ కానుకలు ఇస్తాం. ఉద్యోగులు చాలా నష్టపోయారు. ఉపాధ్యాయులను మద్యం షాపుల దగ్గర నిలబెట్టారు. ఉద్యోగులకు వచ్చే బెనిఫిట్స్ ఏం ఇవ్వడం లేదు - ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుతాం..  వలంటీర్లకు రూ.10 వేలు జీతం - విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణం - పీఆర్సీ ప్రకటిస్తాం.. ఆలోగా ఇంటీరిమ్ రిలీఫ్ ఇస్తాం. సీపీఎస్ రద్దు సమస్యపై కసరత్తు చేసి పరిష్కరిస్తాం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు.. అది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటిపై సమీక్ష చేస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం -పట్టాదారు పాస్ పుస్తకంపై జగన్ బొమ్మ ఏంటి? పోర్టులు, క్వారీలు, సెజ్‍లు చేతులు మారాయి - ఉచిత ఇసుక విధానం తెస్తాం.. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా ఏర్పాటు. అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు.. ప్రతి మండలంలో జనరిక్ మందుల దుకాణాలు.. అన్న క్యాంటీన్లు, పండుగ కానుకలు ఇస్తాం. పీ-4 నమునాలో మహిళల ఆర్థిక బలోపేతానికి చర్యలు. అంగన్‍వాడీ కార్యకర్తలకు సుప్రీం కోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ. ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంపు మేరకు చర్యలు. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పన. ఉద్యోగులు, పింఛనర్లకు ఒకటో తేదీన జీతాలు.. ఫలితాలకు ముందే జగన్ అస్త్ర సన్యాసం చేశారు. ప్రజలు మంచి భవిష్యత్తు కోరుకుంటున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

NRI ల ద్వారా 10,25,000 కోట్ల విదేశీ మారకం భారత్ కు! 88 లక్షల గల్ఫ్ కార్మికుల సంక్షేమం ఎక్కడ? గల్ఫ్ జేఏసీ సూటి ప్రశ్నలు!

 

సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!

 

తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!

 

యాత్రా తరంగిణి 18: అగస్త్య మహర్షి సందర్శించిన మోపిదేవి క్షేత్రం! అక్కడ జరిగే ప్రత్యేక పూజలు, పురస్కారాలు!

 

తస్మా జాగ్రత్త! మీ పిల్లలకి నెస్లే ఫుడ్స్‌ పెడుతున్నారా? అయితే ఇప్పుడే అప్రమత్తం అవ్వండి.. భారత్‌లో నెస్లే నిబంధనల ఉల్లంఘన!

 

అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్.. ఎప్పుడు మొదలవుతుందంటే.. ఈసారి అమెజాన్ లో సమ్మర్ సేల్ అదిరిపోయింది గురు..

 

సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandhrababu #Meeting #BJP #Janasena #Pawankalayan #AndhraPradesh #APPolitics