పోలింగ్ లో దాడులపై చంద్రబాబు ఆందోళన! పోలీసులకే రక్షణ లేదు! ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి! టీడీపీ అభ్యర్థులపైనే దాడులు!

Header Banner

పోలింగ్ లో దాడులపై చంద్రబాబు ఆందోళన! పోలీసులకే రక్షణ లేదు! ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి! టీడీపీ అభ్యర్థులపైనే దాడులు!

  Mon May 13, 2024 19:28        Politics

నేడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఉత్సాహంగా ఓటు వేయడం శుభపరిణామం. సాయంత్రం ఆరు గంటల లోపు పోలింగ్ కేంద్రం వద్ద క్యూ లైన్ లో ఉండే ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఓటు వేయండి. ప్రజాస్వామ్యం కోసం.. మన రాష్ట్ర భవిష్యత్ కోసం ఓటేయండి అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.

 

మరోవైపు.. ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న పోలింగ్ లో హింసను తీవ్రంగా ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజలు స్వేచ్చగా ఓటు వేసే పరిస్థితి లేకుండా.. ప్రణాళికాబద్దంగా వైసీపీ కుట్రలు అమలు చేస్తోంది. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ హింసను కట్టడి చేయడంలో స్థానిక పోలీసు అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రతిపక్షాల ఫిర్యాదులపై అధికారులు వేగంగా స్పందించకపోవడం సరికాదు. మాచర్లలో శాంతి భద్రతలను కాపాడి.. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా  ఓటు వేసే పరిస్థితి కల్పించాలి తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై వెంటనే దృష్టిపెట్టాలి ఆయన కోరారు.

 

ఇంకా చదవండి: పార్టీ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని కార్యకర్తలకు పాదాభివందనం! రాష్ట్ర ప్రజల తెగువకు స్పందిస్తూ... లోకేష్

 

ఇంకోవైపు.. తెనాలిలో పోలింగ్ కేంద్రంలో ఓటరుపై వైసీపీ ఎమ్మెల్యే దాడి చేయడం వైసీపీ ఫ్రస్ట్రేషన్ కు నిదర్శనం. ఓటమి ఖాయమవడంతో వైసీపీ ఎమ్మెల్యేలు విచక్షణ కోల్పోయి ప్రజలపై దాడులు చేస్తున్నారు. ఈ దాడులతో ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని.. తిరుగుబాటును అణచివేయలేరు. ఐదేళ్ల ప్రభుత్వ దాష్టీకాలపై నేడు ఓటు రూపంలో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.

 

ఇంకా చదవండి: ఏపీలో ముమ్మరంగా పోలింగ్! మధ్యాహ్నం 3 గంటల వరకు 55.49 శాతం ఓటింగ్! జిల్లా సరాసరి మొత్తం పోలింగ్ శాతం!

 

 

ఈరోజు పోలింగ్‍లో కనీసం పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయింది. తాడిపత్రిలో ఎస్పీ వాహనం పైనే దాడి చేయడం, టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డి పై దాడికి దిగడం వైసీపీ హింసా రాజకీయాలకు పరాకాష్ట. జగన్ ఐదేళ్లుగా  పెంచి పోషించిన రౌడీ మూకలు.. నేడు తమ దాడుల ద్వారా ప్రజల్లో భయం పుట్టించి పోలింగ్ శాతాన్ని తగ్గించడం ద్వారా లబ్ధి పొందే కుట్ర చేస్తున్నారు. వైసీపీ కుట్రను ప్రజలే తిప్పికొట్టాలి.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరూ నిర్భయంగా తరలివచ్చి ఓటు వేయాలి. అత్యధిక ఓటు శాతంతో  వైసీపీ హింసా రాజకీయానికి ముగింపు పలకాలి అని చంద్రబాబు కోరారు.

 

వైసీపీ ఓటమి భయంతో దాడులకు తెగబడుతోంది. అరాచకాలను నమ్ముకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఓటేసేలా చర్యలు తీసుకోవాలి. ప్రజల తిరుగుబాటుతో వైకాపా నేతలు ఫ్రస్టేషన్‍లో ఉన్నారు. మహిళా ఓటర్లు, మహిళా నేతలపై దాడులు దుర్మార్గం. కూటమి నేతలు, మీడియా, పోలీసులపైనా దాడులు. మాచర్లలో బ్రహ్మారెడ్డిపై వైసీపీ రౌడీలు దాడి చేశారు. నరసరావుపేటలో కృష్ణదేవరాయలపై దాడిచేసి కార్లు ధ్వంసం చేశారు. తాడిపత్రిలో టీడీపీ నేతలపై పెద్దారెడ్డి, ఆయన కుమారుడు దాడి చేశారు. గుంటూరులో రోశయ్య మహిళలను కారుతో తొక్కించేందుకు యత్నించారు. చీరాలలో యం.యం.కొండయ్యపై దాడికి పాల్పడ్డారు. శ్రీకాకుళంలో గొండు శంకర్‍పై పోలింగ్ బూత్ వద్దే దాడి చేశారు. తిరువూరులో కేశినేని చిన్ని బృందంపై దాడి చేసి, కార్లు ధ్వంసం అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

 

 

ఈ రోజు చారిత్రాత్మక దినం గా నిలిచిపోతుంది. ఓట్ వేసేందుకు ప్రజలు చూపుతున్న ఉత్సాహం స్ఫూర్తిని నింపుతోంది. చాలా ప్రాంతాల్లో చివరి వరకూ క్యూ లైన్లో ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరాను పరిశీలించి లైట్లు ఏర్పాటు చేయాలి. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరాపై ఈసీ శ్రద్ద తీసుకోవాలి అని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

 తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: టెక్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! వలసదారుల కోసం గ్రీన్ కార్డ్ అప్లికేషన్‌లను నిలిపివేసిన అమెజాన్, గూగుల్!

 

ఎన్నారై టిడిపి కువైట్ ఆధ్వర్యంలో వినూత్న ప్రచారం! భారతదేశం లోని వారికి ఫోన్ కాల్ ద్వారా! తెలుగుదేశానికి ఓటు మిస్ కాకుండా!

 

గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!

 

కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!

 

మీకోసం గుడ్ న్యూస్! ఇప్పుడు మిస్ అయితే ఇక అంతే! స్మార్ట్‌ఫోన్‌లపై రూ.4000 తగ్గింపు! నేటి నుంచి 10 రోజులపాటు Poco May sale..

 

రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!

 

జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!

 

రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!

 

ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #TDP #AndhraPradesh #APPolitics #APNews #Chandrababu #ChandrababuTalk #Election2024