కుప్పంలో కౌంట్ డౌన్ - వైసీపీ కీలకనేత అందర్! చంద్రబాబుతో పెట్టుకుంటే అంతే!
Mon Jul 22, 2024 16:51 Politicsఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం పాత కేసులు తోడటానికి సిద్దం అయ్యింది. గతంలో నమోదు అయిన కేసులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గంలోని కుప్పం పోలీసులు వైసీపీకి చెందిన నాయకుడిని అదుపులోకి తీసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీకి చెందిన నాయకులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులను నోటికి వచ్చినట్లు దూషించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మూడు పార్టీలకు చెందిన నాయులు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా అప్పటి వైసీపీ ప్రభుత్వం ఒత్తిడితో వైసీపీకి చెందిన నాయకుల మీద కేసులు నమోదు చెయ్యలేదని ఆరోపణలు ఉన్నాయి.
ఇంకా చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! 58 ఏళ్ల తర్వాత ఆ నిషేదాన్ని ఎత్తివేసిన కేంద్రం!
అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం కుప్పంలో కూడా వైసీపీ నాయకుల మీద కొన్ని కేసులు నమోదు అయ్యాయి. కుప్పంలో వైసీపీ నాయకుడు నాగార్జున యాదవ్ మీద ఓ కేసు నమోదు అయ్యింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 50 రోజులు అవుతున్నా వైసీపీ నాయకుడు నాగార్జున యాదవ్ ను పోలీసులు అరెస్టు చెయ్యలేదు. ఆదివారం అర్దరాత్రి వైసీపీ నాయకుడు నాగార్జున యాదవ్ ను కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుప్పంలో నమోదు అయిన ఓ కేసుకు సంబంధించి నాగార్జున యాదవ్ ను విచారించడానికి అతన్ని కుప్పం పోలీస్ స్టేషన్ కు తరలించారు. వైసీపీ నాయకుడు నాగార్జున యాదవ్ కు 41ఏ నోటీసులు జారీ చేసి తరువాత చర్యలు తీసుకోవాలని కుప్పం పోలీసులు డిసైడ్ అయ్యారని తెలిసింది. గతంలో సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద నాగార్జన యాదవ్ అనేక ఆరోపణలు చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇంకా చదవండి: ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే ఆ పథకాలకు నో ఎంట్రీ! కార్డు లేనివారికి, ఏపీలో ప్రత్యేక డ్రైవ్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సినీనటి పై పోలీసు కేసు! అసలు ఆమె ఏమి చేసిందంటే?
శవ రాజకీయాలు చేయడం జగన్ పద్ధతి! 151 నుంచి 11 స్థానాలకు పడిపోయిన సైకో!
ఒమన్: భారత ఎంబసీ నిద్రపోతుందా? పార్కుల్లో, బీచుల్లో నివాసం ఉంటున్న తెలుగు ఆడవాళ్లను పట్టించుకోదా...
సౌదీలో మరో తెలుగు వ్యక్తి అనుభవిస్తున్న నరకం! స్పందించిన మంత్రి లోకేష్!
రొట్టెల పండుగ నేపథ్యంలో భక్తులకు శుభవార్త! రూ.5 కోట్లు మంజూరు చేసిన సీఎం!
రాత్రి పడుకునే ముందు ఈ పనిచేస్తే ఆరోగ్యమస్తు! అరే చిన్న చిట్కా చేస్తే పోలా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Kuppam #AmmavariJatara #AndhraPradesh #APNews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.