పోలవరంలో తొలి మలి దశ లేదు! ప్రాజెక్టు పూర్తి చేయడమే! కేంద్రానికి తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు!

Header Banner

పోలవరంలో తొలి మలి దశ లేదు! ప్రాజెక్టు పూర్తి చేయడమే! కేంద్రానికి తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు!

  Sat Jul 27, 2024 20:49        Politics

ఢిల్లీ: ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. పోలవరం ప్రాజెక్టు గురించి ప్రధానంగా చర్చ సాగింది. సమావేశం అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుపై నిధుల ఖర్చుకు ఇన్వెస్ట్ మెంట్ బోర్డు ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఇన్వెస్ట్ మెంట్ బోర్డు అంశం కేంద్ర క్యాబినెట్ ముందుకు వెళ్లాల్సి ఉందని వివరించారు. పోలవరంలో తొలి దశ లేదు, మలి దశ లేదు... ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యం అని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. త్వరగా నిర్ణయం తీసుకోకపోతే మరో సీజన్ కూడా కోల్పోతామని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని నిర్ణయించామని, దీనిపై రాష్ట్ర క్యాబినెట్ లో చర్చించామని వెల్లడించారు. డయాఫ్రం వాల్ నిర్మించాలన్న రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తాలూకు నోట్ ను కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కు అందించినట్టు చంద్రబాబు తెలిపారు. వరద తగ్గాక పనుల ప్రారంభిస్తే, ప్రాజెక్టు ఓ కొలిక్కి రావడానికి మరో రెండేళ్లు పడుతుందని అన్నారు. వైసీపీ పాలనలో అప్పులు పెరిగాయని, అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని మండిపడ్డారు. విభజన చట్టంలోని అంశాలు అమలు చేయాలని కేంద్రాన్ని కోరానని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలు ఇవ్వాలని కోరామని తెలిపారు. స్వచ్ఛ భారత్, జల జీవన్ మిషన్ కార్యక్రమాల్లో ఏపీ వెనుకబడి ఉందని అన్నారు. ఈ రెండు పథకాల అమలులో ఏపీ చివరి నుంచి మూడో స్థానంలో ఉండడం బాధాకరమని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో కేంద్రం నిధులను దారిమళ్లించారని ఆరోపించారు.

 

ఇంకా చదవండి: స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెడుతున్నారా? అయితే ఇది మీ కోసం! తెలుసుకోపోతే ఇక మీ పని అంతే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెడుతున్నారా? అయితే ఇది మీ కోసం! తెలుసుకోపోతే ఇక మీ పని అంతే!

 

తస్మాత్ జాగ్రత్త! మెసేజ్ ఓపెన్ చేయగానే అకౌంటులో డబ్బులు మాయం!

 

జంగారెడ్డిగూడెంలో నాటుసారా మృతులపై విచారణ! లిక్కర్ పాలసీపై మండిపడ్డ మంత్రి రవీంద్ర!

 

ప్రతిపక్ష నేత హోదా పిటిషన్‌పై విచారణ! హైకోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది!

 

జగన్ ఢిల్లీలో స్థిరపడేందుకు షెల్టర్ అవసరం! కూటమిలో చేరడం అనివార్యం- యనమల రామకృష్ణుడు!

 

అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియాపై మండిపడ్డ మంత్రి లోకేష్! ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాం!

 

నేను నోరు విప్పితే జగన్ జైలుకే! బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

 

గూగుల్ కు పోటీగా కొత్త సెర్చ్ ఇంజిన్ వస్తోంది! అది ఏంటో తెలుసా!

 

జగన్ ఢిల్లీలో స్థిరపడేందుకు షెల్టర్ అవసరం! కూటమిలో చేరడం అనివార్యం- యనమల రామకృష్ణుడు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APpolitics #APNews #Chandrababu