11మంది బలం సరిపోలేదా అంటూ - జగన్ వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల కౌంటర్! క్రైస్తవులను ఊచకోత గురి చేసినా..

Header Banner

11మంది బలం సరిపోలేదా అంటూ - జగన్ వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల కౌంటర్! క్రైస్తవులను ఊచకోత గురి చేసినా..

  Sun Jul 28, 2024 09:39        Politics

వైఎస్సార్‌సీపీ ఢిల్లీలో చేసిన ధర్నాకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడంపై ఏపీ మాజీ మఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌ ఎందుకు మద్దతు తెలియజేయాలంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షర్మిల ప్రశ్నించారు. 'కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న జగన్ గారు.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి?. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..?' అంటూ ప్రశ్నించారు. '5 ఏళ్లు బీజేపీతో అక్రమ సంబందం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి.. ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు.. ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం. క్రిష్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసినా.. నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా?

 

పోలవరంలో తొలి మలి దశ లేదు! ప్రాజెక్టు పూర్తి చేయడమే! కేంద్రానికి తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు!

 

YSR వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకే జై కొట్టారు కదా? మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి వచ్చిందా సంఘీభావం?. మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్పా.. రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. సిద్దం అన్న వాళ్లకు 11మంది బలం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు?' అని ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ శుక్రవారం ప్రెస్‌మీట్‌లో.. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన ధర్నాకు మద్దతు ఇవ్వకపోవడంపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న హింసను తెలుసుకోవాలనే విపక్ష పార్టీలను ఆహ్వానించామన్నారు జగన్. అయితే ఇందులో కొన్ని పార్టీల నుంచి నేతలు వచ్చి మద్దతు తెలిపారని.. అందులో కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో వారినే అడగాలి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తెచ్చి తమ ధర్నాకు రాకుండా అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. తమకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో గొడవలే ప్రశ్నిస్తారా అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన షర్మిల.. వైఎస్ జగన్‌కు కౌంటరిచ్చారు.

 

ఇంకా చదవండి: వైసీపీకి మరో ఎదురు దెబ్బ! చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రెడ్ బుక్ అంటే చాలు.. వైసీపీ నేతలకు భయం! రాష్ట్రంపై అసత్య ప్రచారం! టీడీపీ ఎంపీ ఫైర్!

 

రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన ఘనుడు! అబ్దుల్ కలాం వర్థంతి సందర్భంగా! మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఘన నివాళులు!

 

పారిస్ ఒలింపిక్స్‌లో అరకు కాఫీ ఘుమఘుమలు!​ అతిథులను అలరించనున్న మన్యం పంట!

 

ఆగస్టులో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవలు! ఆ వివరాలు మీకోసం!

 

ప్రతిపక్ష నేత హోదా పిటిషన్‌పై విచారణ! హైకోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది!

 

జగన్ ఢిల్లీలో స్థిరపడేందుకు షెల్టర్ అవసరం! కూటమిలో చేరడం అనివార్యం- యనమల రామకృష్ణుడు!

 

అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియాపై మండిపడ్డ మంత్రి లోకేష్! ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాం!

 

నేను నోరు విప్పితే జగన్ జైలుకే! బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

 

గూగుల్ కు పోటీగా కొత్త సెర్చ్ ఇంజిన్ వస్తోంది! అది ఏంటో తెలుసా!

 

జగన్ ఢిల్లీలో స్థిరపడేందుకు షెల్టర్ అవసరం! కూటమిలో చేరడం అనివార్యం- యనమల రామకృష్ణుడు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APpolitics #APNews #YSSharmila #Jagan