మీ శరీరంలో అణువణువు పిరికితనమే! అసెంబ్లీకి వెళ్లి పోరాడడం మీకు చేతకాదు! అలాంటి ద్వేషం మాకు లేదు - జగన్ పై షర్మిల ఫైర్!

Header Banner

మీ శరీరంలో అణువణువు పిరికితనమే! అసెంబ్లీకి వెళ్లి పోరాడడం మీకు చేతకాదు! అలాంటి ద్వేషం మాకు లేదు - జగన్ పై షర్మిల ఫైర్!

  Mon Jul 29, 2024 17:01        Politics

జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయాలని తాను చెబితే...  అది చంద్రబాబుకు కొమ్ముకాసినట్టు మీకు అనిపిస్తోందా? అంటూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి... అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే... మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది... అద్దంలో ఇప్పుడు కూడా మీకు చంద్రబాబే కనిపిస్తున్నట్టుంది అంటూ షర్మిల ఎద్దేవా చేశారు. "సోషల్ మీడియాలో నన్ను అవమానించేంత ద్వేషం మీకుంది... అలాంటి ద్వేషం మాకు లేదు. కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉంది. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా? తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకుంది. అది అధికార పార్టీనా, లేక ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదు. జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు కాబట్టే తప్పు అని చెప్పాం. చట్ట సభను గౌరవించకపోవడం తప్పు కాబట్టే రాజీనామా చేయాలని అన్నాం. వైఎస్సార్ విగ్రహాలు కూల్చివేస్తే స్వయంగా అక్కడికి వచ్చి ధర్నా చేస్తానని అధికార పార్టీ వర్గాలను హెచ్చరించింది నేనే.

 

ఇంకా చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.! అర్హతలు, దరఖాస్తు చివరి తేదీ ఇదే!

 

మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఇవాళ వైఎస్సార్ కు ఇంత అవమానం జరిగి ఉండేది కాదు. వైసీపీలో వైఎస్సార్ ను, విజయమ్మను అవమానించినవారే పెద్దవాళ్లుగా చెలామణీ అవుతున్నారు కదా. YSRCPలో YSRని ఎప్పుడో వెళ్లగొట్టారు... ఇప్పుడు ఉన్నది కేవలం Y అంటే వైవీ సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే. వైఎస్సార్ లాగా అసెంబ్లీలో పోరాడడం మీకు చేతకాదులే... మీకు మీడియా పాయింటే ఎక్కువ. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం శరీరంలో అణువణువు పిరికితనం పెట్టుకున్న మీరు బీజేపీతో అక్రమసంబంధం పెట్టుకున్నారు. వైఎస్సార్ ను వ్యతిరేకించిన బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు... మీ అహంకారమే మీ పతనానికి కారణం" అంటూ షర్మిల నిప్పులు చెరిగారు. 'చంద్రబాబు ఏజెంటుగా రాజకీయాలు చేసేవారికి, ప్రజల తరఫున ప్రతిక్షణం ఆలోచించేవారికి తేడా ఉంటుంది షర్మిల గారూ' అంటూ వైసీపీ చేసిన ట్వీట్ కు షర్మిల పైవిధంగా స్పందించారు.

 

ఇంకా చదవండి: సిగ్గు సిగ్గు! ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారు! జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి - షర్మిల ఫైర్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికాలో దేశబహిష్కరణ ముప్పు.. ప్రమాదంలో లక్షలాది భారతీయులు! ఆలోపు గ్రీన్ కార్డు దక్కితే చట్టబద్ధంగా..

 

ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం! అసలు ఏం జరిగిందంటే!

 

వైసీపీ మళ్ళీ వస్తుందో రాదో కానీ మనవాళ్లే వచ్చేవరకు నిద్రపోయేలా లేరుగా! రాజకీయం అంటే ఏంటీ సార్? సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలులో కీలక పరిణామం! సీఏం చంద్రబాబు తుది నిర్ణయం!

 

11మంది బలం సరిపోలేదా అంటూ - జగన్ వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల కౌంటర్! క్రైస్తవులను ఊచకోత గురి చేసినా..

 

రెడ్ బుక్ అంటే చాలు.. వైసీపీ నేతలకు భయం! రాష్ట్రంపై అసత్య ప్రచారం! టీడీపీ ఎంపీ ఫైర్!

 

రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన ఘనుడు! అబ్దుల్ కలాం వర్థంతి సందర్భంగా! మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఘన నివాళులు!

 

పారిస్ ఒలింపిక్స్‌లో అరకు కాఫీ ఘుమఘుమలు!​ అతిథులను అలరించనున్న మన్యం పంట!

 

ఆగస్టులో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవలు! ఆ వివరాలు మీకోసం!

 

ప్రతిపక్ష నేత హోదా పిటిషన్‌పై విచారణ! హైకోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది!

 

జగన్ ఢిల్లీలో స్థిరపడేందుకు షెల్టర్ అవసరం! కూటమిలో చేరడం అనివార్యం- యనమల రామకృష్ణుడు!

 

అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియాపై మండిపడ్డ మంత్రి లోకేష్! ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాం!

 

నేను నోరు విప్పితే జగన్ జైలుకే! బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #YSSharmila #Viveka #JaganMosum #AndhraPradesh #APPolitics #Cases