ఏ క్షణమైనా బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసే ఛాన్స్! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

Header Banner

ఏ క్షణమైనా బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసే ఛాన్స్! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

  Tue Jul 30, 2024 20:37        Politics

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ పోకిరి సినిమాలో ఫేమస్ డైలాగ్ అయిన 'ఎప్పుడు వచ్చామా అన్నది కాదన్నయా.. బుల్లెట్ దిగిందా లేదా' అనే డైలాగ్ తో బీఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు కురిపించారు. మంగళవారం అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో మంత్రి కోమటిరెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎప్పడొచ్చామా అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యమని.. అలాగే రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్ అని అన్నారు. మేము దింపిన బుల్లెట్ కేసీఆర్కి దిగిందని.. దీంతో ఆయన సీఎం సీటు పోయిందని సెటైర్ వేశారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

 

రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో ప్రతిపక్ష నాయకుడు కుడా అంతేనని ఆయన సభకు హాజరుకాకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించనట్టేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. 83 ఏండ్ల ఖర్గే, ఆరోగ్యం బాగాలేకపోయినా సోనియా పార్లమెంటుకు హాజరవుతున్నారు. కేసీఆర్ కు ఏమైంది.. సభకు ఎందుకు హాజరవ్వడం లేదని ప్రశ్నించారు. సభకు రాకపోతే కేసీఆర్ రాజకీయాలు వదులుకున్నట్లేనని హాట్ కామెంట్స్ చేశారు. దేశంలో అర్ధరాత్రి వరకు సభ నడిపింది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ధీమా వ్యక్తం చేశారు.

 

ఇంకా చదవండి633 మంది భారతీయ విద్యార్థులు మృతి! కారణాలు వింటే..! వారి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి! 

 

రేవంత్ ఆధ్వర్యంలో మేము ఎన్నికలకు వెళ్లి అధికారంలోకి వచ్చామని, సభలో మీకు మేము చాలు అంటున్న కేటీఆర్, హరీష్ ఎన్నికల్లో రేవంత్ ని ఎందుకు ఓడించలేదని నిలదీశారు. హరీష్ రావు, కేటీఆర్ కి బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం లేదన్నారు. కేసీఆర్ వైఖరి చూస్తుంటే ఏ క్షణమైనా బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసేటట్టు ఉన్నాడని అనుమానం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇంటర్నల్ పాలిటిక్స్ ఉన్నాయని.. అందుకే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్ళాడని క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే మరి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం! వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు!

 

జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేత? దానికి కారణం అదేనా!

 

 నిరుద్యోగులకు శుభవార్త.! అర్హతలు, దరఖాస్తు చివరి తేదీ ఇదే!

 

గన్నవరం నుంచి దేశంలోని పలుచోట్లకు విమానాలు! కేశినేని చిన్ని వినతికి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి!

  

అమెరికాలో దేశబహిష్కరణ ముప్పు.. ప్రమాదంలో లక్షలాది భారతీయులు! ఆలోపు గ్రీన్ కార్డు దక్కితే చట్టబద్ధంగా..

 

ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం! అసలు ఏం జరిగిందంటే!

             

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #AndhraPradesh #Telangana #CBN #AP #TG #KCR #KTR #Congress #BRS #RevanthReddy