ఏపీకి మరో శుభవార్త.. ₹75 వేల కోట్ల పెట్టుబడి! కంపెనీ పేరు ఇప్పుడే చెప్పలేము! ఆ ప్రాంత వాసులకి ఇక పండగే పండుగ!

Header Banner

ఏపీకి మరో శుభవార్త.. ₹75 వేల కోట్ల పెట్టుబడి! కంపెనీ పేరు ఇప్పుడే చెప్పలేము! ఆ ప్రాంత వాసులకి ఇక పండగే పండుగ!

  Wed Jul 31, 2024 20:40        Politics

సీఎం చంద్రబాబు నేడు (బుధవారం) పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ కూడా పాల్గొన్నారు. సమీక్ష ముగిసిన అనంతరం టీజీ భరత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి బీపీసీఎల్ తో పాటు మరో రూ.75వేల కోట్ల పెట్టుబడి రాబోతోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆ కంపెనీ పేరేంటో చెప్పాలని మీడియా ప్రతినిధులు కోరగా మంత్రి ఆసక్తికర సమాధానం చెప్పారు. 'నేను ఇప్పుడే చెబితే పక్కనే ఉన్న తమిళనాడు వాళ్లు వలేసి పట్టుకెళ్లిపోతారు. అందుకే పేరు చెప్పదలుచుకోలేదు. అది కన్ఫర్మ్ అయిన తర్వాత చెబుతా' అని భరత్ జవాబిచ్చారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

దేశంలోనే ఉత్తమ పారిశ్రామిక విధానం తీసుకురావాలని నేడు జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉత్తమ MSME, క్లస్టర్ విధానాలు అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో నాలుగు ఇండస్ట్రియల్ క్లస్టర్లు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని టీజీ భరత్ వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో కృష్ణపట్నం, ఏపీ బల్క్ డ్రగ్ పార్క్, ఓర్వకల్లు, కొప్పర్తిలో 4 ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఉన్నాయని వివరించారు. కొత్తగా కుప్పం, లేపాక్షి, దొనకొండ, మూలపేటలో క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
633 
మంది భారతీయ విద్యార్థులు మృతి! కారణాలు వింటే..! వారి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి!

 

మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం! వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు!

 

జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేతదానికి కారణం అదేనా!

 

 నిరుద్యోగులకు శుభవార్త.! అర్హతలుదరఖాస్తు చివరి తేదీ ఇదే!

 

గన్నవరం నుంచి దేశంలోని పలుచోట్లకు విమానాలు! కేశినేని చిన్ని వినతికి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP #TGBharath