ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! ఒక్కో కుటుంబానికి రూ.3 వేలు!

Header Banner

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! ఒక్కో కుటుంబానికి రూ.3 వేలు!

  Fri Aug 02, 2024 11:53        Politics

ఏపీలో నూతనంగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు నిర్ణయించుకుంది. వరదలతో ఇళ్లు విడిచి పునరావాస కేంద్రాలకు చేరిన కుటుంబాలకు రూ.3 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని గురువారమే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గత ప్రభుత్వం వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు రూ.2 వేల చొప్పున మాత్రమే అందించింది. ప్రస్తుతం కొలువుదీరిన కూటమి ప్రభుత్వం మరో వెయ్యి రూపాయలను అదనంగా పెంచి రూ.3 వేలను ఒక్కో కుటుంబానికి అందించనున్నట్లు వెల్లడించింది. వీటితో పాటు ఇతర సరుకులను కూడా వరద బాధితులకు అందించనున్నట్లు సమాచారం.

 

ఇంకా చదవండిరాష్ట్రంలో 16 లక్షల కోట్ల పెట్టుబడులు! ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రియల్ పార్క్స్ - నూతన పాలసీలు! ఎన్నో ఉద్యోగ అవకాశాలు!

 

ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, పామోలిన్, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల పంపిణీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రత్యేక ఆర్థిక సాయం, నిత్యావసరాల సరఫరాకు రూ.15.29 కోట్ల విడుదలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. నెల్లూరు, కర్నూల్, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 14 పట్టణాల్లో తాగునీటి సరఫరాకు రూ.14.84 కోట్లు విడుదల చేసింది. భారీ వర్షాలు, వరద ప్రభావిత 8 జిల్లాల్లో ఆహారం, పాలు తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య చర్యలు, వైద్య సేవల కోసం మరో రూ.26.50 కోట్లు మంజూరు చేసింది. ఈ నిర్ణయం పై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

  

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైజాగ్ లో ఎకరాలలో అద్భుతమైన మాల్ నిర్మాణం! నగరానికి మణిపూస కానున్న కట్టడాలు! ప్రభుత్వం తరపు నుండి!

 

అమరావతి ప్రజలకు గుడ్ న్యూస్! ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక ప్రాజెక్టు ప్రతిపాదనం! ఇక ఆ ప్రాంతాల వారికి పండగే - ఆకాశాన్ని అంటనున్న స్థలాల రేట్లు!

     

ఏపీలో వాలంటీర్లకు శుభవార్త! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

 

కుప్పంలో వైసీపీకి భారీ షాక్! టిడిపి లోకి 15 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు!

 

సాక్షి కథనాలపై సైకో ఆగ్రహం! వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టిన వార్తలు!

 

జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి! విజన్ లేని వ్యక్తి వల్ల రాష్ట్రం అధోగతి! ప్రభుత్వంపై అబద్ధపు బురద చల్లుతున్న సైకో!

   

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP