సీఎం చంద్రబాబుకు అర్జీలు ఇచ్చేందుకు మంగళగిరికి పోటెత్తిన ప్రజలు! రాజధాని, అన్న క్యాంటీన్లకు విరాళాలు!

Header Banner

సీఎం చంద్రబాబుకు అర్జీలు ఇచ్చేందుకు మంగళగిరికి పోటెత్తిన ప్రజలు! రాజధాని, అన్న క్యాంటీన్లకు విరాళాలు!

  Sat Aug 03, 2024 21:05        Politics

నేడు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం చంద్రబాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో అర్జీ దారుల నుండి వినతులు స్వీకరించారు. సీఎం స్వయంగా అర్జీలు స్వీకరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుండి పెద్దఎత్తున్న ప్రజలు తరలివచ్చి సీఎంకు అర్జీలను అందించారు. మూడు గంటలకు పైగా నిలబడే ఉన్న చంద్రబాబు వేల మంది నుంచి వినతిపత్రాలు అందుకుని, వారి సాధకబాధకాలు విన్నారు. అర్జీదారులు సీఎం ముందు నేరుగా తమ గోడును చెప్పుకుని సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అర్జీదారులకు చంద్రబాబు భరోసా కల్పిస్తూ వినతులన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  రెవెన్యూ సమస్యపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని...  రెవెన్యూ సమస్యలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి మండలం ప్రతి ఊరిలో భూ కుంభకోణం బయట పడుతోందన్నారు. రీసర్వే అస్తవ్యస్తంగా చేసి రికార్డులను తారుమారు చేసి ప్రజలు సమస్యల్లోకి నెట్టారన్నారు.

 

 

ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక కార్యాచరణ చేపడతామన్నారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేయడం వలనే నేడు భూ సమస్యలతో బాధితులు పెద్ద ఎత్తున అర్జీలు తీసుకుని కేంద్ర కార్యాలయని వస్తున్నారని తెలిపారు. మదనపల్లె ఘటనే రెవెన్యూ శాఖ నిర్వీర్యానికి ఉదాహరణ అన్నారు. అన్ని వ్యవస్థలను 100 రోజుల్లో గాడిలో పెడతామన్నారు. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసి భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమస్యలను విభాగాల వారీగా విభజించి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. వినతులు ఇచ్చేందుకు రాష్ట్ర నలుమూలల నుండి మంగళగిరి కేంద్ర కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా జిల్లాలు, నియోజకవర్గాల్లోనే వినతులు తీసుకునేలా చర్యలు చేపడతామని అర్జీదారులకు సీఎం భరోసా ఇచ్చారు. వీటితో పాటు పలువురు ఉద్యోగాల కోసం అర్జీలు ఇవ్వగా, వైసీపీ హయాంలో తమ పింఛన్ లు తొలగించారంటూ వృద్ధులు వినతిపత్రాలు తీసుకు వచ్చారు. పెద్ద ఎత్తున దివ్యాంగులు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరికొందరు నామినేటెడ్ పదవులు ఆశిస్తూ వినతులు ఇచ్చారు. అన్నింటినీ పరిశీలిస్తామని చంద్రబాబు, పల్లా శ్రీనివాసరావు తెలిపారు.

ఇంకా చదవండి: రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు! వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలు - సైకో ప్రభుత్వంలో అనుభవించిన టార్చర్!


రాజధాని, అన్న క్యాంటీన్లకు విరాళాలు  

ఇవాళ విన్నపాలతో పాటు విరాళాలు కూడా వచ్చాయి. అమరావతి రాజధాని, అన్న క్యాంటీన్లకు పలువురు విరాళాలు అందించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి దాతలు చెక్కులు అందించారు. కంకిపాడుకు చెందిన రైతు ఎన్.ప్రభాకర్ రావు రూ.10 లక్షలు, విజయవాడకు చెందిన జి.వీ.మాణిక్యమ్మ అనే వృద్ధురాలు తన చేతికున్న బంగారు గాజులను రాజధాని నిర్మాణం కోసం విరాళంగా అందించారు. భగవద్గీత గ్రూపు తరఫున నిర్మల అనే వృద్ధురాలు రూ.3.42 లక్షలను విరాళంగా అందించారు. చంద్రగిరి నియోజకవర్గం, పెరుమాళ్లపల్లికి చెందిన జీవన్ కుమార్ అనే దివ్యాంగుడు రూ.25 వేలు, చిత్తూరుకు చెందిన వల్లేరు వెంకటేశ్‌ నాయుడు లక్ష రూపాయలను రాజధానికి విరాళంగా అందించారు. విజయవాడ అయ్యప్పనగర్ కు చెందిన పర్చూరి రాజబాబయ్య, కమల కుమారి అనే వృద్ధులు అన్న క్యాంటీన్ కు రూ.2 లక్షలు విరాళంగా అందించారు. వీరందరికీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.

 

ఇంకా చదవండి: చంద్రబాబు పండుగ కానుక అదరహో! ఉచితంగా 3 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు అప్పటి నుంచే? ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. ఇక పండగే! వైసీపీ హయాంలో పౌరసరఫరాలశాఖ అస్తవ్యస్తం!

 

మందుబాబులకు గుడ్ న్యూస్! భారీగా మద్యం ధరలు తగ్గింపు.. ఎప్పటి నుంచంటే?

 

నిరుద్యోగులకు చక్కని ఉద్యోగ అవకాశం! గుంటూరులో 100% జాబ్ గ్యారంటీతో ట్రైనింగ్ ప్రోగ్రామ్! 15 నుండి 25 వేల జీతంతో!

 

గన్నవరం గుండా వల్లభనేని వంశీ అరెస్ట్! కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్న తెలుగు తమ్ముళ్లు! లైన్ లో ఉన్న మరి కొంతమంది వైసిపి గుండాలు!

 

11 సీట్లే వచ్చినా మారని సైకో తీరు! ఆయన ఇంటిపై ఉమ్మేసి వెళ్లిన వైసీపీ కార్యకర్త! ఇంత దారుణమా అని అంటున్న సోషల్ మీడియా!

 

సంచలన ట్వీట్.. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరిన లోకేష్! వారిపై తీవ్రస్థాయిలో మండిపాటు! శభాష్ అని పొగుడుతూ సోషల్ మీడియాలో!

 

రూ.3 లక్షల 50 వేల జీతంతో ఉద్యోగం! మిస్ అవ్వొద్దు, ఈ నెల 3న జాబ్ మేళా! ఆ వివరాలు మీకోసం!

 

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు! స్పందించిన పవన్ కల్యాణ్! దశాబ్దాల నుంచి కొనసాగతున్న అంశంపై!

 

రాష్ట్రంలో 16 లక్షల కోట్ల పెట్టుబడులు! 4 ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రియల్ పార్క్స్ - 5 నూతన పాలసీలు! ఎన్నో ఉద్యోగ అవకాశాలు!

 

పాత ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోలేదు! అక్రమంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలుసా?

 

వైజాగ్ లో 5 ఎకరాలలో అద్భుతమైన మాల్ నిర్మాణం! నగరానికి మణిపూస కానున్న కట్టడాలు! ప్రభుత్వం తరపు నుండి!

 

అమరావతి ప్రజలకు గుడ్ న్యూస్! ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక ప్రాజెక్టు ప్రతిపాదనం! ఇక ఆ ప్రాంతాల వారికి పండగే - ఆకాశాన్ని అంటనున్న స్థలాల రేట్లు!

 

వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్! అమరావతి, పోలవరం తరువాత, అంత ముఖ్యమైనది! అసలు ఏంటీ ప్రాజెక్ట్? ఎందుకు ఇంత ప్రాముఖ్యత?

 

ఎన్నారై లకు గుడ్ న్యూస్! గ్రీన్ కార్డు పొందేందుకు గొప్ప అవకాశం ఇచ్చిన అమెరికా! ఆ వివరాలు - లాస్ట్ డేట్ మీకోసం!

 

జూబెర్ వీడియోలో మెహరున్నీసా ఆచూకీ! నారా లోకేష్ సహాయంతో సౌదీ అధికారులతో చర్చలు!

 

కుప్పం వైసీపీ కార్యాలయం మూసివేత! MLA భరత్ కనబడకపోవడం పార్టీకి పెద్ద దెబ్బ!

 

ఏపీలో మరోసారి ఎన్నికలు! ఆ మూడు జిల్లాల్లో కోడ్ అమలులోకి! పోలింగ్ ఎప్పుడంటే!

 

ఏపీలో వాలంటీర్లకు శుభవార్త! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

 

కుప్పంలో వైసీపీకి భారీ షాక్! టిడిపి లోకి 15 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు!

 

సాక్షి కథనాలపై సైకో ఆగ్రహం! వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టిన వార్తలు!

 

జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి! విజన్ లేని వ్యక్తి వల్ల రాష్ట్రం అధోగతి! ప్రభుత్వంపై అబద్ధపు బురద చల్లుతున్న సైకో!

 

పిన్నెల్లికి బిగ్ షాక్! బెయిల్ పిటీషన్ కొట్టివేత!

 

ఏపీకి మరో రూ.75వేల కోట్ల పెట్టుబడి! కంపెనీ పేరు ఇప్పుడే చెప్పను! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #TDP #TDP-JanaSena-BJPAlliance #AndhraPradesh