తాళి కట్టిన ఆలిని వదిలి ఆమెతో ఉంటున్న వైసీపీ ఎమ్మెల్సీ! రచ్చకెక్కిన దువ్వాడ శ్రీనివాస్ కాపురం!

Header Banner

తాళి కట్టిన ఆలిని వదిలి ఆమెతో ఉంటున్న వైసీపీ ఎమ్మెల్సీ! రచ్చకెక్కిన దువ్వాడ శ్రీనివాస్ కాపురం!

  Sat Aug 10, 2024 07:40        Politics

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కాపురం బజారున పడింది. మొదటి భార్య వాణి ని కాదని మరో మహిళ దివ్వెల మాధురి తో సహజీవనం చేస్తున్నాడు. ఈవ్యవహారం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు కూతుళ్లు ఉన్నప్పటికి భార్య, పిల్లల దగ్గర ఉండకుండా దివ్వెల మాధురితో కలిసి జీవిస్తున్నాడని స్వయంగా కూతుళ్లు హైందవి, నవీన తండ్రిని కలిసి నిలదీయాలని ప్రయత్నించారు. అయితే పోలీసులు అనుమతించకపోవడంతో విషయాన్ని మీడియాకు తెలియజేశారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. దువ్వాడ శ్రీనివాస్ తో ఇకపై కలిసి ఉండనని భార్య వాణి తెగేసి చెబితే .. రెండో భార్య దివ్వెల మాధురి మాత్రం ఇంత జరిగిన తర్వాత ఆయనతోనే ఉంటానంటోంది. దువ్వాడ శ్రీనివాస్ వల్ల తాను డబ్బు, పేరు రెండు పోగొట్టుకున్నానని వాణి తెలిపింది.టెక్కలి వదిలి వెళ్లాలని హెచ్చరించింది. దివ్వెల మాధురి వాణి తనను మోసం చేసిందని కౌంటర్ అటాక్ చేసింది.అయితే భార్య, పిల్లల్ని కాదని వేరే కాపురం పెట్టిన దువ్వాడ శ్రీనివాస్ పై విమర్శలు వెల్లువెత్తాయి. మరి పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఉత్తరాంధ్ర టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కాపురంలో కలహాలు క్లైమాక్స్ కు చేరాయి. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, కుమార్తెలు హైందవీ, నవీనతో కలిసి కాకుండా మరో మహిళ దివ్వెల మాధురితో కొంతకాలంగా కలిసి ఉంటున్నాడు.

 

ఇంకా చదవండి: పవన్ విజ్ఞప్తితో ఏపీకి నిధులిచ్చిన మోడీ! అదనంగా రూ.2812.98 కోట్ల - ఇక వారికి పండగే పండగ!

 

ఈ ఇల్లీగల్ ఎఫైర్ పబ్లిక్ కావడంతో ఎమ్మెల్సీ కూతుళ్లు తమ తండ్రిని తమకు కాకుండా దూరం చేస్తోందని.. అతడ్ని కలిసి మాట్లాడేందుకు వెళ్లారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ భద్రత సిబ్బంది అనుమతించకపోవడంతో.. మీడియా ద్వారా విషయాన్ని బయటపెట్టారు. తన భర్త దువ్వాడ శ్రీనివాస్‌తో ఉండాలని కోరుకోవడం లేదని దువ్వాడ వాణి స్పష్టం చేశారు. ఆయన వల్ల తన కుటుంబం పరువు పోతుందని అన్నారు. దువ్వాడ శ్రీనివాస్‌ టెక్కలి వదిలివెళ్లాలని డిమాండ్‌ చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌ వల్ల తనకేమీ ఆస్తులు రాలేదని స్పష్టం చేశారు. చొక్కా లుంగీతో వచ్చిన శ్రీనివాస్‌కు ఎలాంటి ఆస్తులు లేవని వెల్లడించారు. ఆయన రాజకీయాలతో తామే ఎక్కువగా నష్టపోయామని తెలిపారు. దివ్వెల మాధురి ఏ హక్కుతో తమ ఇంట్లో ఉంటోందని దువ్వాడ శ్రీనివాస్ కూతుళ్లు ప్రశ్నించారు.గత ఏడాది నుంచి తమను పట్టించుకోవడం లేదని..తమ కాల్స్ రిసీవ్ చేసుకోవడం లేదని..కలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ భార్య, పిల్లలు చేస్తున్న ఆరోపణలకు దివ్వెల మాధురి కౌంటర్ ఇచ్చారు. తమది ఇల్లీగల్ అఫైర్ కాదని తెలిపింది. ఇంత వరకు వచ్చింది కాబట్టి ఇకపై ఆయనతోనే కలిసి ఉంటానని తెగేసి చెప్పింది వైసీపీ ఎమ్మెల్సీ రెండో భార్య. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి మధ్య కలహాలు రాజకీయంగా మొదలైనవేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముందుగా టెక్కలి సీటు శ్రీనివాస్ కు కాదని ..అతని భార్య వాణికి ఇద్దామని వైసీపీ భావించింది. చివరి క్షణంలో శ్రీనివాస్ కు టికెట్ ఇచ్చారు. కారణమయ్యింది వైసీపీ ఏ అని కొంతమంది పార్టీ నేతలు చెబుతున్నారు. ఎక్కడి దాక వెళుతుందో వేచి చూడాల్సిందే.

 

ఇంకా చదవండి: ఎమ్మెల్సీ ఎన్నిక వేళ వైసీపీకి మరో షాకిచ్చిన గంటా! త్వరలో జరిగేది ఇదే! ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కుప్పం, పుంగనూరులో ఆ పనులు చెయ్యండి! ఎంతైనా పర్వాలేదు, చంద్రబాబు ఆర్డర్!

 

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! ఒక్కొక్కరికి రూ.5 లక్షలు!

 

విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, లక్షల రూపాయలు! విజయవాడలో స్కూల్ సంచలనం!

 

జగన్ పై కేసులు పెట్టాలని మంత్రి డిమాండ్! సైకో ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు!

 

మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన సీఎం చంద్రబాబు! వైరల్ వీడియో!

 

ఈ సమస్యలు ఉన్నవారు టమాటాలు తినకూడదా! వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

వైసీపీకి ఊహించని షాక్! మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా!

 

ఏపీలో ఆగస్టు 15న జెండా ఎగరేసే మంత్రులు వీరే! చంద్రబాబు, పవన్ ఎక్కడంటే?

 

పవన్ విజ్ఞప్తితో ఏపీకి నిధులిచ్చిన మోడీ! అదనంగా రూ.2812.98 కోట్ల - ఇక వారికి పండగే పండగ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Andhrapradesh #YCPMLC #Wife #DuvvadaSrinivas #IllicitRelationship