సంచలన విషయాలు వెల్లడించిన ఆర్బీఐ! గ్రామీణ ప్రాంతాల నుంచి - ఇక ఇండియాకు తిరుగులేదు!

Header Banner

సంచలన విషయాలు వెల్లడించిన ఆర్బీఐ! గ్రామీణ ప్రాంతాల నుంచి - ఇక ఇండియాకు తిరుగులేదు!

  Fri Nov 22, 2024 09:00        Business

గృహాలు, గృహాలకు సేవలందిస్తున్న లాభాపేక్షలేని సంస్థలు (చర్చిలు, మతపరమైన సంఘాలు, స్పోర్ట్స్ క్లబ్‌లు, ట్రేడ్ యూనియన్‌లు, రాజకీయ పార్టీలు) కొనుగోలు చేసిన వస్తువులు, సేవలతో డొమెస్టిక్‌ డిమాండ్‌ పెరిగింది. దీంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలమైన సంకేతాలు చూపుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నవంబర్‌లో విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ ద ఎకానమీ’ (State of the Economy) ఆర్టికల్‌లో ఈ వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం పండుగ సీజన్‌లో వ్యయాలు పెరిగాయి. అలానే వ్యవసాయ రంగం కోలుకుంటోంది. ఇవి 2024-25 రెండో త్రైమాసికంలో మందగమనం తర్వాత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడానికి సహాయపడుతున్నాయి.

గృహాల వినియోగంతో వృద్ధి..
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్ర, ఇతరులు రచించిన ఈ ఆర్టికల్.. గృహాల వినియోగం ఇప్పుడు ఆర్థిక కార్యకలాపాలకు కీలకమైన భాగంగా ఉందని హైలైట్ చేసింది. మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, పండుగల సమయంలో ప్రజలు చేసిన ఖర్చులు మూడో త్రైమాసికంలో ఆర్థిక వేగాన్ని గణనీయంగా పెంచాయని తెలిపింది. ఆర్థిక అభివృద్ధికి దోహదపడిన అంశాలుగా కింది వాటిని పేర్కొంది.

ఇ-కామర్స్ వృద్ధి: మాల్స్‌కి వెళ్లి చేసిన కొనుగోళ్లు తక్కువగా ఉన్నప్పటికీ, ఈ-కామర్స్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది. యువ తరాలను లక్ష్యంగా చేసుకుని వినూత్న మార్కెటింగ్‌తో ఈ-కామర్స్ విజృంభిస్తోంది.

గ్రామీణ డిమాండ్: పండుగల సీజన్‌లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన డిమాండ్‌ ఈ-కామర్స్ అభివృద్ధిలో కీలకమైంది. ఖరీఫ్ సీజన్‌లో దిగుబడులు పెరగడం, రబీ సీజన్‌లో పంటలు బాగ పండుతాయనే ఆశావాదం కొనుగోళ్లను పెంచింది.

 

ఇంకా చదవండి: ఐఎస్బీకి రామోజీ సంస్థ రూ.30 కోట్లు విరాళం.. 430 సీట్ల అంతర్జాతీయ స్థాయి!

 

లగ్జరీ మార్కెట్: లగ్జరీ కార్లు, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సహా ప్రీమియం ప్రొడక్టులు దీపావళి సమయంలో భారీగా అమ్ముడుపోయాయి. ఇది వినియోగంలో ప్రీమియమైజేషన్ ట్రెండ్‌ని ప్రతిబింబిస్తుంది.

పట్టణీకరణ, రిటైల్ వృద్ధి..
భారతదేశ పట్టణ జనాభా 2025 నాటికి రెట్టింపు అవుతుందని ఆర్‌బీఐ భావిస్తోంది. జనాభాలో సగం మంది నగరాల్లో నివసిస్తున్నారని అంచనా వేసింది. ఈ పట్టణ విస్తరణ రిటైల్ డిమాండ్‌కు ఆజ్యం పోస్తోంది, కొత్త వృద్ధి అవకాశాలు సృష్టిస్తోంది. రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో త్రైమాసికంలో ఎక్కువ విక్రయాలు జరిగినట్లు రిటైలర్లు ఇప్పటికే నివేదించారు.

 

ఇంకా చదవండి: రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్! ₹1.87 కోట్ల పెట్టుబడి.. లక్ష 6వేల ఉద్యోగాలు! ప్రభుత్వం తో కుదిరిన ఒప్పందం!

 

కొనసాగనున్న ద్రవ్యోల్బణం ఒత్తిడి..
ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నప్పుడు, ద్రవ్యోల్బణం ప్రధాన ఆందోళనగా మారింది. ఎందుకంటే, వినియోగదారుల ధరల సూచి (CPI) సెప్టెంబర్‌లో 5.5% నుంచి అక్టోబర్‌లో 14 నెలల గరిష్ట స్థాయి 6.21%కి పెరిగింది. ఆహార ధరలు పెరుగుతుండటంతో ప్రాసెస్డ్ ఫుడ్స్‌ ఎక్కువగా ఇళ్లలోకి చేరుతున్నాయి. జీవన వ్యయాన్ని పెంచుతున్నాయి. అంతర్లీన ద్రవ్యోల్బణం (ఆహారం, ఎనర్జీ మినహా) కూడా అధిక స్థాయికి చేరుకుంది. విస్తృత ధరల ఒత్తిళ్ల గురించి ఆందోళనలను పెంచుతోంది. ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రాకపోతే పట్టణ డిమాండ్, కార్పొరేట్ ఆదాయాలు, పెట్టుబడిని దెబ్బతీస్తుందని, చివరికి పరిశ్రమలు, ఎగుమతులపై ప్రభావం చూపుతుందని ఆర్‌బీఐ కథనం హెచ్చరించింది.

కార్పొరేట్ వ్యూహాలు, సవాళ్లు..
FMCG,
ఆటోమొబైల్స్ వంటి రంగాల్లోని కంపెనీలు డిమాండ్‌ను పునరుద్ధరించడానికి అడ్వర్టైజింగ్‌ పెంచుతున్నాయి. డైరెక్ట్-టు-కన్స్యూమర్ (D2C) బ్రాండ్‌లు క్విక్‌-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా తమ ఉనికిని విస్తరిస్తున్నాయి. 2029-30 నాటికి $5 బిలియన్ నుంచి $30 బిలియన్లకు మార్కెట్‌ పెరుగుతుందని అంచనా. ఏది ఏమైనప్పటికీ, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు అమ్మకపు ధరలకు ప్రవహించడం ప్రారంభించాయి. ఆయా బిజినెసలకు ఎదురయ్యే సవాళ్లు, వినియోగదారు వ్యయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.

 ఒత్తిడిలో ఫైనాన్షియల్‌ మార్కెట్లు..
యూఎస్‌ డాలర్ బలపడటం, ఫారిన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ తరలిపోవడం వంటి కారకాల వల్ల భారతదేశ ఆర్థిక మార్కెట్లు ప్రభావితమయ్యాయి. ఈక్విటీలు పతనమవుతున్నాయి. అయినా బలమైన స్థూల ఆర్థిక మూలాధారాలను పేర్కొంటూ, మిడ్‌-టర్మ్‌లో భారత్‌ ఆర్థిక పరిస్థితి సానుకూలంగానే ఉంటుందని ఆర్‌బీఐ ఆశాజనకంగా ఉంది.

 మిడ్‌ టర్మ్‌పై అంచనాలు..
భారతదేశ వృద్ధి సామర్థ్యాన్ని పూర్తిగా అన్‌లాక్ చేయడానికి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాల్సిన అవసరాన్ని ఆర్‌బీఐ కథనం నొక్కి చెప్పింది. ద్రవ్యోల్బణం తగ్గితే, గృహ బడ్జెట్లపై ఒత్తిడి ఉండదు. పట్టణ ప్రజల వినియోగానికి సపోర్ట్‌ చేస్తుంది, కార్పొరేట్ పెట్టుబడులను బలోపేతం చేస్తుంది. ప్రజల వినియోగం పుంజుకోవడం గ్రామీణ, పట్టణ డిమాండ్ పెరగడంతో, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పాజిటివ్ ట్రెండ్‌లో ఉంది. రాబోయే నెలల్లో స్థిరమైన వృద్ధిని కొనసాగించడానికి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం చాలా కీలకం.
 

ఇంకా చదవండి: ఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదు! ఇక ఊచలు లెక్కపెట్టాల్సిందే!

 

శుభవార్త: మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న కూటమి సర్కార్! లక్షల మందికి ఊరట.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

ఈరోజు(21-11-2024) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!

 

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రాజధాని అమరావతి, పోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివి! ఎత్తుకు పై ఎత్తు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!

 

నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రూ.లక్షా 80 వేల జీతంతో సొంత జిల్లాలో ఉద్యోగం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్ పొందండి! అస్సలు మిస్ అవ్వదు!

 

మంత్రివర్గం పలు బిల్లులకు గ్రీన్ సిగ్నల్! ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ!

 

టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!

 

ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!

 

మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారా? కొత్త విధానం - మంత్రి కీలక వ్యాఖ్యలు!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!

 

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!

 

గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss

 

వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?

 

వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Modi #AndhraPradesh #APPolitics #NaraLOkesh #Chandrababu #ModiMeeting #Anakapalli