వైసీపీకి మరో షాక్ - అరకు ఎంపీకి హైకోర్టు నోటీసులు! దానికి కారణం అదేనా!

Header Banner

వైసీపీకి మరో షాక్ - అరకు ఎంపీకి హైకోర్టు నోటీసులు! దానికి కారణం అదేనా!

  Tue Aug 13, 2024 16:57        Politics

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత విపక్ష వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి క్షేత్రస్దాయిలో ఉన్న నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా కూటమివైపు చూస్తుంటే.. మరోవైపు ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారికి సైతం సమస్యలు తప్పడం లేదు. ఇదే క్రమంలో అరకు వైసీపీ ఎంపీ గుమ్మ తనూజారాణికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమె ఎన్నికను సవాల్ చేస్తూ బీజేపీ ఎంపీ అభ్యర్ధి కొత్తపల్లి గీత దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నోటీసులు ఇచ్చింది. గత లోక్ సభ ఎన్నికల్లో అరకు లోక్ సభ సీటు నుంచి వైసీపీ అభ్యర్దిగా గుమ్మ తనూజారాణి తొలిసారి బరిలోకి దిగారు. అలాగే మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఆమెకు ప్రత్యర్ధిగా బరిలోకి దిగారు. అయితే ఈ ఎన్నికల్లో తనూజారాణి 50580 ఓట్ల తేడాతో కొత్తపల్లి గీతను ఓడించారు.

 

ఇంకా చదవండి: శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! ఇక వారికి పండగే పండగ!

 

అయితే ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అసలు తనూజారాణి ఎన్నికల అఫిడవిట్ లోనే తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కొత్తపల్లి గీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తనూజారాణితో పాటు ఎన్నికల అధికారులకూ నోటీసులు పంపింది. గుమ్మ తనూజారాణి ఎన్నికల అఫిడవిట్ లో వాస్తవాలు చెప్పలేదని, దీనిపై తాను రిటర్నింగ్ అధికారిని ఆశ్రయించినా న్యాయం జరగలేదని ఆరోపిస్తూ కొత్తపల్లి గీత హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఎన్నికల అధికారులకూ, ఈ ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు ఇతర అభ్యర్ధులకు సైతం హైకోర్టులో నోటీసులు పంపింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ఆలోపు సమాధానం ఇవ్వాలని వీరిని ఆదేశించింది. అరకు ఎంపీగా తొలిసారి ఎన్నికైన తనూజారాణి తరహాలోనే గతంలో కొత్తపల్లి గీత కూడా మొదటిసారి ఎన్నికైనప్పుడు పలు వివాదాలు ఎదుర్కొన్నారు.

ఇంకా చదవండి: విద్యార్థులకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.80 వేలు! మరో వైపు తల్లికి వందనం స్కీమ్ అమలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సీఎం సంచలన నిర్ణయం.. సచివాలయ వ్యవస్థ పేరు మార్పు! కొత్త పేరు ఇదే! దానికి కారణం అదేనా?

 

దువ్వాడ కేసులో బిగ్ ట్విస్ట్! సూసైడ్‌కు చేసుకున్న మాధురి? అసలు ఏమి జరిగింది అంటే!

 

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరే శుభవార్త! భారీ తగ్గింపు! ఆ వివరాలు మీకోసం!

 

రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన వారికి భారీ శుభవార్త! ఉచితంగానే.. ప్రభుత్వ బ్యాంక్ మతిపోయే ఆఫర్!

 

కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు? కేసినో సహా రెండు కేసుల్లో! మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై!

 

బాల నటిగా ఎంట్రీ.. వ్యభిచారం కేసులో అరెస్ట్! ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే!

 

రైతులకు గుడ్ న్యూస్! ఈ పథకంలో రిజిస్టర్ అయితే రూ. 6 వేలు నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి! ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అంటే!

 

ఇల్లు లేని వారికి శుభవార్త! కీలక ప్రకటన చేసిన కేంద్రం! ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథక ప్రయోజనాలు!

 

మందుబాబులకు గుడ్ న్యూస్! ఏపీలో భారీగా మద్యం ధరలు తగ్గింపు! కొత్త రేట్లు ఇవే?

 

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! కోడలి చేతిలో పార్టీ బాధ్యతలు?

 

బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! కొత్త ట్రాఫిక్ రూల్స్! భారీ ఫైన్ - జైలుకు పోయే పరిస్థితి!

 

ఏపీలో మహిళలకు చంద్రన్న ప్రభుత్వం శుభవార్త! ఉచిత ప్రయాణానికి ముహూర్తం ఖరారు! ఇప్పటికే చాలా జిల్లాల్లో..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #YCP #Jagan #MLa