అతడు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే! జగన్ పై హోంమంత్రి అనిత వ్యాఖ్యలు!

Header Banner

అతడు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే! జగన్ పై హోంమంత్రి అనిత వ్యాఖ్యలు!

  Fri Aug 23, 2024 19:39        Politics

అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇవాళ పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర హోంమంత్రి అనిత తప్పుబట్టారు. జగన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఫార్మా ఘటన పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగితే తాను వెంటనే కోటి పరిహారం అందేలా చేశానని జగన్ చెప్పారు. ఇప్పుడు అచ్యుతాపురం బాధితులకు పరిహారం ఇవ్వకపోతే తాను వచ్చి ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు హోమంత్రి అనిత బదులిచ్చారు. బాధితులకు సాయం అందిందో, లేదో జగన్ నిర్ధారించుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగితే, జగన్ వచ్చాడని... కానీ ఎయిర్ పోర్టుకు వచ్చి, కంపెనీ యజమానులను అక్కడికే పిలిపించుకుని పరిహారం అక్కడ పెట్టేసి వెళ్లిపోయారని అనిత ఆరోపించారు. గత ఐదేళ్ల కాలంలో 120 మంది చనిపోయారని, వారు చనిపోయినప్పుడు జగన్ వచ్చి కూర్చోలేదే అని వ్యాఖ్యానించారు.

 

ఇంకా చదవండి: టీడీపీలో చేరిన 16 మంది కౌన్సిలర్లు! 'సైకిల్' ఖాతాలో మాచర్ల మున్సిపాలిటీ!

 

ఘటన జరిగి 24 గంటలు గడవకముందే చంద్రబాబు క్షతగాత్రులను పరామర్శించారని వెల్లడించారు. ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించి, అధికారులతో సమీక్షించి, ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. ఎక్కువగా దెబ్బలు తగిలిన వారికి రూ.50 లక్షలు, ఓ మోస్తరు గాయాలైనవారికి రూ.25 లక్షలు ప్రకటించారని వెల్లడించారు. ఈ డబ్బును 24 గంటల్లోపు ఇవ్వాలని ఆదేశించిన తర్వాతే చంద్రబాబు ఇక్కడ్నించి వెళ్లారని అనిత వివరించారు. తప్పుడు ప్రచారాలు చేయడం జగన్ కు అలవాటేనని, నాడు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు జగన్ ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసని అనిత అన్నారు. ఏదో వచ్చాం, బురద చల్లాం అనే రీతిలో జగన్ పర్యటన ఉందని విమర్శించారు. అక్కడ జరిగిన ఘటనకు, ఇతను మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన కుదరడంలేదన్నారు. అందుకే జగన్ మాటలను భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని... "హీ ఈజ్ జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే" అంటూ అనిత తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. కళ్లుండీ కొంతమంది చూడలేరు, చెవులుండీ కొందరు వినలేరు... ఈ రెండింటికీ సంబంధించిన బాపతే పులివెందుల ఎమ్మెల్యే అంటూ ఎద్దేవా చేశారు.


ఇంకా చదవండి: విజయవాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ! సుజనా చౌదరి సీటులో టీడీపీకి గుడ్ న్యూస్!

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పవన్ కళ్యాణ్ కొత్త ట్రెండ్! ఇది ఎవ్వరూ ఊహించి ఉండరు, ఈ నెల 24న పిఠాపురంలో భారీగా!

 

విద్యార్థులకు అదిరే గుడ్ న్యూస్! ప్రతి నెలా రూ.1,000 అకౌంట్లలోకి! వెంటనే అప్లై చేసుకోండిలా!

 

పర్యాటకులకు శ్రీలంక గుడ్ న్యూస్! భారత్ సహా 35 దేశాలకు వీసా లేకుండా!

 

గత ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం! 13,326 పంచాయతీల్లో కొత్త మార్పుల వెలుగులు!

 దేశాన్ని అదానీ, అంబానీలకు అప్పగించిన మోదీ? రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!

 

టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి!

 

ఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!

 

మా రాష్ట్రానికి చంద్రబాబు బ్రాండ్ అంబాజిడర్, ఆయనే మాకు హీరో, మంత్రి భరత్! కరోనా వైరస్ మహమ్మారి తాండవం!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!

 

కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌! వెలుగులోకి మ‌రో సంచ‌ల‌న విష‌యం!

 

అందుకే నేను ఎక్కువగా తమిళంలో నటించడం లేదు! సంగీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్!

 

తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్! అకౌంట్లలో రూ.15 వేలు!

 

ఇంకా ఏం చేస్తే ఇలాంటి సంఘటనల్ని ఆపగలం? కోల్‌క‌తా హ‌త్యాచార ఘ‌ట‌న‌పై విజ‌య‌శాంతి ట్వీట్‌!

అధ్యక్షుడిగా గెలిస్తే మస్క్ కు కేబినెట్ లో చోటిస్తా! ట్రంప్ ఇచ్చిన బంపర్ ఆఫర్!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!

 

ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్‌వాడీ, సచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!

 

18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు గుడ్ న్యూస్! గొప్ప అవకాశం.. ఇప్పుడు మిస్ చేసుకుంటే ఇక అంతే!

 

విజయ్ సాయి రెడ్డి కుటుంబ సభ్యులు ఘోర పరాజయం! టిడిపి ఎంపీ ఏకగ్రీవంగా ఎన్నిక! సెప్టెంబర్ 8న అధికారికంగా!

 

కేశినేని చిన్నికి కీలక పదవి! వచ్చే నెల 8న అధికారిక ప్రకటన!

 

అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?

 

రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్! మరో కీలక మార్పు! ఇక ఆ సమస్యకు చెక్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples