రఘురామ టార్చర్ కేసులో జగన్ కు పిలుపు? అప్పట్లో సీఐడీ కస్టడీలో..

Header Banner

రఘురామ టార్చర్ కేసులో జగన్ కు పిలుపు? అప్పట్లో సీఐడీ కస్టడీలో..

  Sat Aug 31, 2024 08:00        Politics

ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజుపై రాజద్రోహం కేసు నమోదు చేసిన తర్వాత సీఐడీ కస్డడీలో హింసించిన వ్యవహారంలో గుంటూరు పోలీసుల విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ సీఎం జగన్ తో పాటు మాజీ సీఐడీ బాస్ పీవీ సునీల్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ సీతారామాంజనేయులుపై రఘురామ ఫిర్యాదు చేశారరు. దీనిపై ఎట్టకేలకు విచారణ ప్రారంభించారు. అప్పట్లో సీఐడీ కస్టడీలో రఘురామపై పోలీసులు దాడికి దిగారు. దీన్ని ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా నిర్ఘారించింది. అనంతరం ఆయనకు బెయిల్ కూడా లభించింది. కానీ తనపై అప్పట్లో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ రఘురామ గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

ఇంకా చదవండి: ఉద్యోగ బదిలీలకు మరో 15 రోజుల గడువు పొడిగింపు! శాఖలలో గందరగోళం, నిబంధనల రూపకల్పనలో సవాళ్లు!

 

ఈ వ్యవహారంలో అప్పటి సీఎం జగన్ తో పాటు ఇద్దరు ఐపీఎస్ అధికారుల పాత్రపై ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు వీరిని విచారణకు రావాలని నోటీసులు జారీ చేయబోతున్నారు. ఇప్పటికే రఘురామపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి సీఐడీ డీఎస్పీ విజయ్ పాల్ కు సాక్ష్యాధారాలు ఇవ్వాలంటూ పోలీసులు నోటీసులు పంపారు. అప్పట్లో రఘురామను హైదరాబాద్ లో అరెస్టు చేయడం దగ్గరి నుంచి ఆయనపై కస్టడీలో జరిగిన దాడి వరకూ ప్రతీ అంశంలోనూ ఎవరెవరి పాత్ర ఉందో నిర్ధారించేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా నిందితుల విచారణ త్వరలో ప్రారంభం కానుంది. మాజీ సీఎం అయిన వైఎస్ జగన్ పై కూటమి ప్రభుత్వంలో నమోదైన తొలి కేసు కూడా ఇదే కావడంతో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.

ఇంకా చదవండి: రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆస్ట్రేలియా: 24/7 అందుబాటులోకి రానున్న కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం! సిడ్నీ వాసులకు అన్ని సౌకర్యాలతో అన్ని ప్రాంతాలకి! మొదటి ఎయిర్ వేస్ ఏది అంటే!

 

ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే! నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!

 

ఏపీని హడలెత్తిస్తున్న మంకీఫాక్స్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

మీకు రేషన్ కార్డు ఉందా? ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! త్వరలో ప్రభుత్వ రాజముద్రతో!

 

జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసే రాజ్యసభ ఎంపీ! కారణం?

 

వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!

 

వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!

 

అది ఎన్నారైల కోసమేనా? అన్ని దేవదాయ ట్రస్ట్ బోర్డులలో అదనంగా మరో ఇద్దరికి అవకాశం! ఆధ్యాత్మిక పర్యటకాభివృద్ధి కోసం కమిటీ!

 

సైకో ప్రభుత్వం మూసేసిన జీవో అయ్యారు వెబ్సైటు పునరుద్ధరణ! ఇకపై అన్ని జీవోలు ఆ సైట్లో చూసుకోవచ్చు! పారదర్శక పాలనకు చంద్రబాబు పెట్టింది పేరు!

 

విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples