ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

Header Banner

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

  Tue Oct 01, 2024 07:00        Politics

సీఎం చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే పెన్షన్ మొత్తాన్ని రూ.4000 వేలకు పెంపు, అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించింది. దసరా, దీపావళి కానుకగా మరో రెండు పథకాలను ప్రారంభించబోతోంది. ఎన్నికల సమయంలో కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారు అనుకున్నట్లుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో దసరా కానుకగా రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఉన్న మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యంపై స్టడీ చేయడానికి కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అధ్యయనం పూర్తి చేసినట్లు సమాచారం. దీనిపై అధికారులు ప్రభుత్వానికి ఓ నివేదికను కూడా అందించినట్లు సమాచారం.

 

ఇంకా చదవండి: దుర్గమ్మ ఆశీర్వాదంతో నారా కుటుంబానికి శరన్నవరాత్రి ఆహ్వానం! వేద పండితుల ఆశీర్వాదాలు!

 

అయితే ప్రభుత్వం దీనిపై మరింత లోతుగా అధ్యయన చేస్తున్నట్లు సంబంధిత వర్గాల నుంచి తెలుస్తోంది. రాష్ట్రంలోని మహిళలకు ఏఏ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలనే దానిపై ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దాని కోసం ఆర్టీసీకి అయ్యే ఖర్చును అంచనా వేసి దాన్ని ప్రభుత్వమే భరించేలా ఏర్పాటు చేస్తోందట. కూటమి ప్రభుత్వం ఇది వరకే 3 గ్యాస్ సిలిండర్స్ పంపిణీ పథకాన్ని దీపావళి నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరో రెండు నుంచి మూడు రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఓ ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 42 లక్షల మందిని ప్రతి రోజూ 11,500 ఆర్టీసీ బస్సులు గమ్యస్థానాలు చేరుస్తున్నాయి. ఇందులో మహిళలు 40 శాతం వరకు ఉంటారని ఓ అంచనా వేస్తున్నారు. ఈ పథకం అమలులోకి వస్తే వారికి ఆయా బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్య కల్పించనుంది ప్రభుత్వం. ప్రస్తుతం ఆర్టీసీకీ రోజుకి రూ.13 నుంచి 16 కోట్ల వరకు ఆదాయం వస్తోంది.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు!

 

ఆంధ్రాలో అమెరికా వీసా అప్లికేషన్ కౌన్సిలేట్ సెంటర్! స్టూడెంట్స్, వ్యాపారస్తులకు తొలగనున్న ఇబ్బందులు! ఎప్పుడు మొదలవుతుంది అంటే!

 

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో రాష్ట్ర మంత్రి భేటీ! పలు అంశాలపై చర్చ!

 

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త! రికార్డు స్థాయిలో వీసా అపాయింట్మెంట్లు జారీకి ఆమోదం! స్టూడెంట్స్, వ్యాపారస్తులు, తల్లిదండ్రులు ఫుల్ ఖుషి!

 

దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం! అసలు జరిగింది అంటే!

 

మందు బాబులకు షాక్.. రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్! ఈ ఏడాది ఓనం మద్యం విక్రయాలు!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. ఇలా చేస్తే, 3 ఉచిత సిలిండర్లు రావు! ఆయా జిల్లాల్లో ఎంతమంది లబ్దిదారులు!

 

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance