కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్! కుటుంబంలో 18 ఏళ్లు నిండిన వారికి శుభవార్త.. రూ.లక్షకు రూ.2 లక్షలు లాభం!Don't Miss

Header Banner

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్! కుటుంబంలో 18 ఏళ్లు నిండిన వారికి శుభవార్త.. రూ.లక్షకు రూ.2 లక్షలు లాభం!Don't Miss

  Fri Nov 01, 2024 07:00        Politics

కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం వివిధ రకాల సేవింగ్ స్కీమ్స్ అందుబాటులోకి తెచ్చింది. అన్ని వర్గాల ప్రజల అవసరాల కోసం పొదుపు పథకాలను ప్రారంభించింది. అయితే వీటిలో ఒక స్మాల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌ చాలామందిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఇది నిర్దిష్ట కాలంలో పెట్టిన పెట్టుబడిని డబుల్ చేస్తుంది. అదే కిసాన్ వికాస్ పత్ర (Kisan Vikas Patra) పథకం. ఈ పథకంలో మినిమమ్‌ డిపాజిట్ చాలా తక్కువ. ఎవరైనా ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇండియా పోస్ట్ (India Post) ఈ పథకాన్ని 1988లో ప్రారంభించింది. ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టేలా ప్రజలను ప్రోత్సహించేందుకే ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ స్కీమ్ ఇన్వెస్టర్లకు భారీ రాబడిని అందిస్తుంది. పెట్టుబడిదారులు రెండింతల లాభాలు అందుకోవచ్చు. స్కీమ్ ఫీచర్లు .. ఈ పథకంలో కనీసం రూ.1,000 అయినా పెట్టుబడి పెట్టాలి. దీనికి ఒక అప్పర్ లిమిట్ అంటూ ఏమీ లేదు. ఎంత డబ్బులైనా ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. KVP లాక్-ఇన్ పీరియడ్ 30 నెలలు లేదా 2 ఏళ్ల 6 నెలలు. ఈ అకౌంట్ 115 నెలల లేదా 9 ఏళ్ల 7 నెలల తర్వాత మెచ్యూర్ అవుతుంది. ముందే విత్‌డ్రా చేయడానికి అనుమతించరు.

 

ఇంకా చదవండి: మద్యం ధరల స్థిరీకరణకు త్వరలో టెండర్ కమిటీ! నూతన పాలసీపై మంత్రి కీలక ప్రకటన!

 

ఒకవేళ మనీ తీసుకుంటే పెనాల్టీలు పడతాయి లేదా వడ్డీ రేట్లు తగ్గుతాయి. రూల్స్ ఇవే..  కిసాన్ వికాస్ పాత్ర పథకంలో ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు తప్పనిసరిగా పాన్ కార్డు వివరాలు అందించాలి. KVPలో రూ.50,000కు నుంచి ఇన్వెస్ట్‌మెంట్ చేసే ఈ రూల్ ఫాలో అవ్వాలి. రూ.10,00,000 లేదా అంతకన్నా ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేస్తుంటే, శాలరీ స్లిప్, ఐటీఆర్ కాపీలు వంటి ఇన్‌కమ్ ప్రూఫ్ చూపించాలి. దేశంలోని ఆర్థిక వ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకత కోసం ఈ నియమం తీసుకొచ్చారు. కిసాన్ వికాస్ పత్ర పథకంలో పెట్టిన డబ్బు మీద ప్రతి సంవత్సరం 7.5 శాతం వడ్డీ వస్తుంది. 9 ఏళ్ల 7 నెలల తర్వాత పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుంది. ఉదాహరణకు, ఇప్పుడు ఈ పథకంలో రూ.5 లక్షలు పెడితే, 9 ఏళ్ల 7 నెలల తర్వాత రూ.10 లక్షలు వస్తాయి. అదేవిధంగా, రూ.25 లక్షలు పెడితే, రూ.50 లక్షలు అవుతాయి. ఈ స్కీమ్ లో 18 సంవత్సరాలు నిండిన భారతీయులు మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు. పెద్దవారు తమ పిల్లల పేరు మీద కూడా ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే హిందూ అవిభక్త కుటుంబాలు (HUFs) లేదా విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు (NRIs) ఈ పథకంలో పాల్గొనలేరు. ఇంకా, అకౌంట్ హోల్డర్ తమ ఐడెంటిటీ ప్రూవ్ చేసేందుకు ఆధార్ నంబర్‌ను సమర్పించడం కూడా తప్పనిసరి. ఈ స్కీమ్‌లో జంటగా కలిపి ఇన్వెస్ట్ చేస్తే ఇద్దరికీ ఒకే సర్టిఫికెట్ ఇస్తారు.  

 

ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?

 

ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?

 

పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!

 

మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?

 

ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!

 

గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!

 

విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!

 

ఈ-చలాన్‌ పేరుతో కొత్త స్కామ్‌! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!

 

పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై మరో కీలక అప్‌డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu