రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

Header Banner

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

  Mon Nov 11, 2024 11:31        Politics

అసెంబ్లీలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ రూపొందించడం జరిగింది. గత ప్రభుత్వంలో రాష్ట్ర ఆదాయానికి గండి పడింది. రాష్ట్ర వనరుల మళ్లింపు, దుర్వినియోగం జరిగాయి. గత ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసం జరిగింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. రాష్ట్ర ప్రగతి పునర్నిర్మాణం నేటి తరం చేతుల్లో ఉంది. సరళ ప్రభుత్వం.. ప్రభావంత పాలనే మా ప్రభుత్వ లక్ష్యం. 2019 తర్వాతి పరిణామాలు రాష్ట్ర చరిత్రలో చీకటి రోజులు. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్‍కు 2024 ఒక మైలురాయి. మూడు రాజధానుల పేరిట రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. గత ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేసింది. దేశం రేపు చేసే ఆలోచన.. చంద్రబాబు ముందుగానే ఆలోచించారు అని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గత ప్రభుత్వంపై మండిపడ్డారు. 

 

ఇంకా చదవండిలోన్ ఈఎంఐ చెల్లించలేని వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్! ఇలా చేస్తే ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండి: APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!  

 

ఇక ఏపీ వార్షిక బడ్జెట్ 2024-25 విషయానికి వస్తే రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు. మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు. రెవెన్యూ లోటు రూ.34,743. ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు. జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం. జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు అంచనా 2.12 శాతం. ఉన్నత విద్య రూ.2,326 కోట్లు. ఆరోగ్య రంగం రూ.18,421 కోట్లు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రూ.16,739 కోట్లు. పట్టణాభివృద్ధి రూ.11,490 కోట్లు. గృహ నిర్మాణం రూ.4,012 కోట్లు. జలవనరులు రూ.16,705 కోట్లు. పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు. ఇంధనరంగం రూ.8,207 కోట్లు. రోడ్లు, భవనాలు రూ.9,554 కోట్లు. యువజన, పర్యాటక, సాంస్కృతికశాఖ రూ.322 కోట్లు. పోలీసు శాఖ రూ.8,495 కోట్లు. పర్యావరణం, అటవీశాఖ రూ.687 కోట్లు. ఎస్సీ సంక్షేమం రూ.18,497 కోట్లు. ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు. బీసీ సంక్షేమం రూ.39,007 కోట్లు. మైనార్టీ సంక్షేమం రూ.4,376 కోట్లు. మహిళ, శిశుసంక్షేమం రూ.4,285 కోట్లు. నైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1215 కోట్లు కేటాయించడం జరిగింది. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?

 

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!

 

వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రిజగన్ పై గాటు విమర్శలు!

 

ఇక నుంచి అలా చేయను... లోకేశ్పవన్పేరు పేరునా అందరికీ సారీ చెప్పిన శ్రీరెడ్డి! నాకు ఎలాగూ భవిష్యత్ లేదు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరిఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP