భారీ శుభవార్త.. ఏపీలో కొత్త పెన్షన్లు జారీ.. దరఖాస్తు తేదీ ఇదే! అస్సలు మిస్ అవకండి!

Header Banner

భారీ శుభవార్త.. ఏపీలో కొత్త పెన్షన్లు జారీ.. దరఖాస్తు తేదీ ఇదే! అస్సలు మిస్ అవకండి!

  Sat Nov 16, 2024 07:00        Politics

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మొదటి నుంచి పెన్షన్ దారులకు అనుకూలంగానే వ్యవహరిస్తోంది. అసలు అధికారంలోకి వచ్చింది 2024 జూన్‌ 12న అయితే.. ఏప్రిల్ 2024 నుంచి పెంచిన పెన్షన్ల బకాయిలను ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదే. అప్పటి నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పెన్షన్ దారుల విషయంలో అనుకూలంగానే ఉంటున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం NTR భరోసా పెన్షన్ కింద లబ్దిదారులు మొత్తం 64,14,174 మంది ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం ప్రతి నెలా పెన్షన్ ఇస్తోంది. వీరిలో 28 రకాల వారు ఉన్నారు. అంటే.. వృద్ధులు, దివ్యాంగులు, తలసేమియా బాధితులు.. ఇచా చాలా రకాల వారు పెన్షన్లను పొందుతున్నారు. ఐతే.. కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. వారికి ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చేసింది. అర్హులైన పెన్షన్‌దారులంతా.. 2024 డిసెంబర్ మొదటి వారం నుంచి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని మంత్రి కొండవల్లి శ్రీనివాస్ తెలిపారు. అందువల్ల కొత్తగా పెన్షన్ కోరుకునేవారు.. డిసెంబర్ 1 తర్వాత గ్రామ లేదా వార్డ్ సచివాలయానికి వెళ్లి, పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలి. ఐతే.. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇంకా గైడ్‌లైన్స్ రిలీజ్ చెయ్యలేదు. అవి వచ్చిన తర్వాతే.. ఎవరు అప్లై చేసుకోవాలో తెలుస్తుంది. విధి విధానాలను రెండు వారాల్లో ప్రభుత్వం రిలీజ్ చేస్తుందని తెలిసింది.

 

ఇంకా చదవండి: కడప ఎస్పీ విద్యాసాగర్ ను కలిసిన వివేకా కుమార్తె డాక్టర్ సునీత! హోంమంత్రి అనితను కలిసిన సమయంలో!

 

వాటితోపాటూ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా ప్రభుత్వం వివరాలు ఇస్తుంది. ఆన్‌లైన్‌లో, మీ సేవా కేంద్రంలో కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అప్పుడు ఇంట్లోనే ఉండి.. మొబైల్ ద్వారా కూడా కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మరో ప్రయోజనం కూడా ఉంది. డిసెంబర్‌లో ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే.. జనవరి 1న ఇచ్చే పెన్షనర్ల జాబితాలో వారి పేరును చేర్చే అవకాశం ఉంటుంది. ఐతే.. జనవరిలో ఎవరైనా ఆ పెన్షన్ మిస్సయితే.. దాన్ని ఫిబ్రవరిలో ఇచ్చే పెన్షన్‌తో కలిపి ఒకేసారి తీసుకోవచ్చు. ఇలా 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చని సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పారు. అందువల్ల ఎవరికైనా పెన్షన్ మనీ రాకపోతే, వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తమకు పెన్షన్ రాలేదని సచివాలయంలో సమాచారం ఇస్తే సరిపోతుంది. తర్వాతి నెలలో రాని పెన్షన్ కూడా కలిపి ఇస్తారు.


ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!

 

ఏపీకి ప్రధాని మోదీ శుభవార్త - రూ 80 వేల కోట్ల పెట్టుబడులు! ఆ ప్రాజెక్ట్ ఇక వేగవంతం - 48వేల మందికి ఉపాధి!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?

 

నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!

 

ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?

 

నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!

 

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!

 

వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!

 

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews