ఈ ఏడాది తొలగింపులు ఉంటాయంటున్న ప్రముఖ సంస్థలు.. ఈ ఏడాది జాబ్స్ కోల్పోయేది వీళ్లే!

Header Banner

ఈ ఏడాది తొలగింపులు ఉంటాయంటున్న ప్రముఖ సంస్థలు.. ఈ ఏడాది జాబ్స్ కోల్పోయేది వీళ్లే!

  Wed Jan 31, 2024 15:29        Employment, India

కొత్త ఏడాది మొదట్లోనే ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు తొలగింపులు ప్రకటించడం టెక్ రంగంలోని వారికి శరాఘాతంగా మారింది.

రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న బెంగ మొదలైంది.

గత కొన్ని వారాలుగా ఆల్ఫబెట్, అమెజాన్, సిటీగ్రూప్, ఈబే, మేసీస్, మైక్రోసాఫ్ట్, షెల్, స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్, వేఫెయిర్ వంటి అమెరికా కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులను తొలగించబోతున్నట్టు ప్రకటించాయి.

ఇక యునైటెడ్ పార్సెల్ సర్వీస్... 12 వేల మందిని తొలగిస్తామని మంగళవారం ప్రకటించింది. 

ఓవైపు టెక్ కంపెనీలు ఇలాంటి ప్రకటనలు చేస్తుంటే మార్కెట్లో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అమెరికాలో జాబ్ ఓపెనింగ్స్ మూడు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. వినియోగదారుల డిమాండ్ సూచీలు కూడా 2005 నాటి గరిష్ఠానికి చేరుకున్నాయి. 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

అత్యధిక ప్రభావం వీరిపైనే... ప్రస్తుతం జాబ్ మార్కెట్లో పరిస్థితులపై ఆర్థికవేత్తలు, రిక్రూటర్లు, కన్సల్టెంట్లు ఇతర పరిశీలకులు పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మధ్యస్థాయి మేనేజ్‌మెంట్‌లో ఉన్న ఉద్యోగులు, వర్క్ ఫ్రం హోం చేసేవారికే లేఆఫ్స్ ప్రమాదం ఎక్కువగా ఉందని స్పష్టం చేస్తున్నారు.

ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రయత్నాల్లో ఉన్న కంపెనీలు రిమోట్ వర్కర్లను టార్గెట్ చేయడంలో ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు.

కంపెనీకి ఓ ఉద్యోగి ఎంత ఆదాయం సమకూరుస్తున్నాడు? భవిష్యత్తులోనూ అతడు సంస్థకు ఉపయోగపడతాడా? అన్న కోణంలోంచే సంస్థలు లేఆఫ్స్ చేపడతాయని చెబుతున్నారు..

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Layoffs2024 #Google #Microsoft #ArtificialIntelligence #Employs #Jobs #RemoveMoreJobsForIT