కొత్తగా యూఎస్ కాన్సులేట్ లో తాపీమేస్త్రి ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలిస్తే అవాక్ అవుతారు!

Header Banner

కొత్తగా యూఎస్ కాన్సులేట్ లో తాపీమేస్త్రి ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలిస్తే అవాక్ అవుతారు!

  Sun Feb 04, 2024 12:08        Employment, India

హైదరబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో తాపీమేస్త్రీ ఉద్యోగం భర్తీ కోసం ప్రకటన ఇవ్వటం జరిగింది. తాపీమేస్త్రీ ఉద్యోగానికి ప్రకటనే ఆశ్చర్యం కలిగిస్తే అందులో పేర్కొన్న జీతం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. హైదరాబాద్‌ కాన్సుల్ జనరల్‌ కార్యాలయంలో తాపీమేస్త్రీ ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదలైంది. వార్షిక వేతనం రూ.4,47,348గా పేర్కొన్నారు. నెల జీతం లెక్కలో చూస్తే రూ.37,279గా తాపీమేస్త్రీ వేతనాన్ని నిర్ణయించారు.

 

 

వేతనంతో పాటు అదనపు ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి. ఈ ఉద్యోగాన్ని ఫుల్‌టైమ్‌ జాబ్‌గా పేర్కొన్నారు. ఎవరైనా ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అమెరికా కాన్సుల్‌ వర్గాలు ప్రకటించాయి. అమెరికా కాన్సుల్‌లో శాశ్వత ఉద్యోగంగా పేర్కొన్నారు. ప్రొబేషనరీ పీరియడ్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధి వారానికి 40గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

 

ధృవపత్రాల ధృవీకరణ, బ్యాక్‌ గ్రౌండ్ వెరిఫికేషన్‌ తర్వాత కనీసం 4 నుంచి 8వారాల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది.విధుల్లో భాగంగా కొత్త గోడలు నిర్మించడం, కాంక్రీట్‌ సహా తాపీ పనులు చేయాల్సి ఉంటుంది. కనీసం రెండేళ్ల వృత్తి అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కాంక్రీట్‌ మిక్చర్‌లలో రకాలు, రకరకాల ఇటుకలతో నిర్మాణం, ఫ్లోరింగ్ పనులు, మార్బుల్ ఫ్లోరింగ్‌, హాలో బ్రిక్స్, రాతి కట్టడాల నిర్మాణంలో అనుభవం ఉండాలి. దీంతో పాటు రకరకాల పనులకు మెటీరియల్ అంచనాలు రూపొందించగలగాలి.

 

తాపీమేస్త్రీ ఉద్యోగానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఫిబ్రవరి 25లోగా సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి కనీసం 8వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లీష్‌ అర్థం చేసుకోవాలి. లెవల్ 1 ఇంగ్లీష్ నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. తెలుగు, హిందీ భాషల్లో లెవల్‌ 3 వరకు నైపుణ్యాన్ని పరిశీలిస్తారు. ఉద్యోగానికి ఎంపికైన అభ‌్యర్థులు మెడికల్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Tapimestri #TapimestriJobs #TapimestriJobsInHyderabad #HyderabadJobs #Tapimestri #WorkersInTapimestri