పది పాస్ అయితే చాలు.. నెలకు రూ.20 వేలు పొందొచ్చు, ఎలా అంటే! రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో!

Header Banner

పది పాస్ అయితే చాలు.. నెలకు రూ.20 వేలు పొందొచ్చు, ఎలా అంటే! రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో!

  Mon Oct 07, 2024 08:00        Employment

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదవ తరగతి మొదలకొని ఆపై చదువులు చదివి.. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలో నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా కేంద్రంలోని స్థానిక బిర్లాగేట్ పోస్టాఫీస్ ఎదురుగా ఉన్న న్యాక్ శిక్షణ కేంద్రంలో ఈ నెల 8వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రతినిధి ఎల్.ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్, అనంత ప్రాజెక్ట్స్ అండ్ టెక్నికల్ సర్వీస్ ప్రైవేటు లిమిటెడ్, పేరాస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయి.

 

ఇంకా చదవండి: సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమీక్ష! రైల్వే, వరద నిధులపై చర్చ!

 

దీనికోసం పదవ తరగతి నుంచి B.Sc, ఏదైనా డిగ్రీ పీజీ చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపింది. 08-10-2024 వ తేదీ ఉదయం 09:00 గంటల నుండి ఈ ఉద్యోగమేళా జరగనుంది. ఉద్యోగ మేళాను జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని.. జిల్లా ఉపాధికల్పనా అధికారి పి. దీప్తి తెలిపారు. ఈ ఉద్యోగం మేళాలో ఎంపికైన వారికి.. ఉద్యోగి అర్హతను బట్టి జీతం పదివేల రూపాయలు నుంచి 20వేల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకురావాలని సూచించారు. ఇక అభ్యర్థులు కేవలం ఫార్మల్ డ్రెస్ రావాల్సి ఉంటుందని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9676141731, 9059290821 నంబర్లకు సంప్రదించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీఐఐసీ, మారిటైం బోర్డు నూతన ఛైర్మన్లను అభినందించిన హోంమంత్రి! రూ.2,350 కోట్ల పెట్టుబడులు, 4,300 మందికి ఉపాధి!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. 3 ఉచిత సిలిండర్ల కోసం వెంటనే ఇది చెయ్యండి! Don't miss..!

 

ఏపీ రైతులకు మరో శుభవార్త.. మంచి నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు! కొన్ని జిల్లాల్లో 100 కిలోమీటర్లకు పైగా!

 

ఇసుక విధానంపై సోషల్ మీడియాలో ప్రచారం! చంద్రబాబు వార్నింగ్! ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా!

 

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

 

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Jobs #Unemployment #AndhraPradesh #APPolitics #APNews #Kakinada