యాత్ర తరంగణి 3: దేవాలయం లోపల పాటించవలసిన కనీస నియమ నిబంధనలు

Header Banner

యాత్ర తరంగణి 3: దేవాలయం లోపల పాటించవలసిన కనీస నియమ నిబంధనలు

  Wed Dec 20, 2023 16:29        Devotional, యాత్రా తరంగిణి

దేవాలయ నియమావళి | కాపెర్ల పవన్ కుమార్

ఆగమ శాస్త్రంలో దేవాలయాలలో అర్చకులు, భక్తులు, అధికారులు ఏ విధముగా వ్యవహరించకూడదో వివరించబడింది.

 

  1. ఆలయం లోపల వాహనం మీదగానీ, పాదరక్షలతో గాని తిరగకూడదు.
  2. ఆలయానికి ప్రదక్షిణము చేసి, తరువాత లోనికి ప్రవేశించాలి.
  3. ఆలయంలోనికి తలపాగా ధరించిగాని, చేతితో ఆయుధం పట్టుకొనిగాని ప్రవేశించరాదు.
  4. ఆలయంలోకి ఉత్తచేతులతోగాని, తిలకం ధరించకుండా గాని, తాంబూల చర్వణం చేస్తూగాని, ఆహారాదులు తింటూ గానీ ప్రవేశించకూడదు.
  5. ఆలయ ప్రాంగణంలో మల, మూత్ర విసర్జన చేయరాదు.
  6. ఆలయంలో కాళ్ళు చాపుకొని కూర్చోడం, కొన్ని ఆలయాల్లో నిద్రపోవటం చేయరాదు.
  7. ఆలయంలో ఏ ప్రాణికైనా దుఃఖం కలిగించే ఏ హింసనూ చేయరాదు.
  8. ఆలయంలో ఎప్పుడూ గొడవలు కానీ, వివాదాలు గానీ పెట్టుకోకూడదు.
  9. ఆలయంలో అహంకారంతో, గర్వంతో, అధికార దర్పంతో ఉండరాదు.
  10. ఆలయంలో దేవుని ఎదుట పరస్తుతిని, పర నిందను కూడా చేయరాదు.
  11. ఆలయంలో దేవుని ఎదుట పృష్ఠభాగం చూపిస్తూ కూర్చోకూడదు.
  12. అధికార గర్వంతో అకాలంలో ఆలయం ప్రవేశించి అకాల సేవలను చేయరాదు.
  13. ఒక చేతితో ప్రణామం చేయరాదు.
  14. ఆలయాలలో ఇతరులకు నమస్కరించడం చేయరాదు.
  15. భగవంతుని ఎదుట అందరూ సమానులే అని భావించాలి.

రచన: కాపెర్ల పవన్ కుమార్

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

యాత్రా తరంగిణి - దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి? దర్శనం చేసుకునే సమయం లో చేయవలసినది ఏమిటి? ప్రముఖ దేవాలయాల ప్రాముఖ్యత, విశిష్టత, విశేషాలు... వారం వారం మీకోసం...

 

యాత్ర తరంగణి 2: దేవాలయాలు ఎన్ని రకాలు, వాటి నిర్మాణాలు ఎలా ఉంటాయి, ఉపయోగాలు ఏమిటి...

 

యాత్రా తరంగిణి 1 -గుడి లో సాష్టాంగ నమస్కారం, ప్రదక్షిణం తప్పనిసరా...

 

 


   andhrapravasi, YatraTarangini, Devotional, TemplesOfIndia, IndianTemples, TruthBehindTemples, TypesOfTemples, TempleConstruction, TempleVisits, HolyTemples, Spirtuality