యాత్ర తరంగణి 2: దేవాలయాలు ఎన్ని రకాలు, వాటి నిర్మాణాలు ఎలా ఉంటాయి, ఉపయోగాలు ఏమిటి...

Header Banner

యాత్ర తరంగణి 2: దేవాలయాలు ఎన్ని రకాలు, వాటి నిర్మాణాలు ఎలా ఉంటాయి, ఉపయోగాలు ఏమిటి...

  Wed Dec 13, 2023 10:02        Devotional, యాత్రా తరంగిణి

దేవాలయాలు - రకాలు

భారత దేశం అంటేనే హిందూ దేవాలయాలకు పెట్టింది పేరు. ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన, ప్రసిద్ది చెందిన ఆలయాలను భారత దేశంలో చూడొచ్చు. కేవలం హిందూ మతంలో మాత్రమే కాదు అన్ని మతాలలోను ఇవి పవిత్రమైన ప్రదేశాలుగా భావింపబడుతాయి. శ్రీ వైఖానస శాస్త్రం ప్రకారం భక్తజనుల సౌకర్యార్థం భగవంతుడు అర్చారూపియై భూలోకానికి వచ్చాడు. ప్రతి దేవాలయంలోను ద్వారపాలకులు, పరివార దేవతలు, ప్రాకార దేవతలు ఆయా స్థానాలలో ఆవాహన చేయబడి ఉంటారు.

చారిత్రకంగా దేవాలయాలు చాలా ప్రాధాన్యత కలిగివున్న ప్రదేశాలు. క్రీ.శ.1వ శతాబ్ది నాటి నుంచి నిర్మింపబడిన అనేక దేవాలయాలు దక్షిణ భారతదేశంలో కనిపిస్తూంటాయి. ఈ దేవాలయాలు హిందూయుగపు చరిత్రను అవగాహన కలిగి, చరిత్రకారులు ఆలయాల గురించి చరిత్ర రాసేందుకు ఉపయోగపడుతున్నాయి. ఇక ఈ దేవాలయాలు ఎన్నిరకాలుగా ఉంటాయి. దేవాలయ నిర్మాణం ఎలా ఉంటుంది తెలుసుకుందాం.
ఆలయాలు అయిదు విధాలుగా ఉంటాయి..

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితం గా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

1. స్వయంవ్యక్త స్థలాలు - భగవంతుడే స్వయంగా అవతరించినవి.
2. దివ్య స్థలాలు - దేవతలచే ప్రతిష్ఠ చేయబడినవి.
3. సిద్ధ స్థలాలు - మహర్షులు, తపస్సుచేసి సిద్ధి పొందిన స్వాములు ప్రతిష్ఠించినవి.
4. పౌరాణ స్థలాలు - పురాణములలో చెప్పబడి ప్రసిద్ధిగాంచినవి.
5. మానుష స్థలాలు - రాజుల చేత, భక్తుల చేత ప్రతిష్ఠ చేయబడినవి.

దేవాలయాలలో గాలి గోపురం, ప్రధాన ద్వారం, వైకుంఠ ద్వారం, ధ్వజ స్తంభం, గర్భగుడి, ద్వారపాలకులు, వంటశాల మొదలైన విభాగాలుంటాయి.

రచయిత : కాపెర్ల పవన్ కుమార్, 9908300831

యాత్రా తరంగిణి -పరిచయం

యాత్రా తరంగిణి 1

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 



   andhrapravasi, YatraTarangini, Devotional, TemplesOfIndia, IndianTemples, TruthBehindTemples, TypesOfTemples, TempleConstruction, TempleVisits, HolyTemples, Spirtuality