దేశంలో ఎక్కడలేని వైసీపీ రాచరిక పాలన... ఆ నలుగురు సామంత రాజులే కీలకం

Header Banner

దేశంలో ఎక్కడలేని వైసీపీ రాచరిక పాలన... ఆ నలుగురు సామంత రాజులే కీలకం

  Tue Jan 30, 2024 16:23        Exclusives

ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలన రాచరిక వ్యవస్థను మించి జరుగుతుంది.

తెలుగుదేశం పార్టీ ఏర్పడక ముందు ముఖ్యమంత్రులు రాజధానికే పరిమితమై శాసనసభ్యులు అభిప్రాయాలను తీసుకొని పాలన సాగించేవారు.

తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనసభ్యులు కాదు ముఖ్యమంత్రి కూడా ప్రజల మధ్యనే ఉండాలన్నట్లుగా పాలన ప్రారంభమైంది.

ఈయమ పాలనలో గడచిన ఐదు సంవత్సరాలలో కనీసం ఐదు సార్లు కలిసిన శాసనసభ్యులు ఐదు శాతం కూడా లేరు.

ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార సభ తర్వాత శాసనసభ్యులకు ముఖ్యమంత్రిగా ఈయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి.

రాష్ట్రంలో నాలుగు ప్రాంతాలకు నలుగురు సామంత రాజుల నియమించి వారితోనే శాసనసభ్యులు మాట్లాడే పరిస్థితి.

శాసనసభ్యులు అందరితో కొన్ని సమావేశాలు జరిగిన వాటిలో ముఖ్యమంత్రి చెప్పినది వినడం తప్ప శాసనసభ్యుల అభిప్రాయాలకు అవకాశం లేదు.

రాష్ట్రంలో ఏ నియోజకవర్గ శాసనసభ్యుడు అయినా తన నియోజకవర్గంలో సమస్యల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లడానికి అవకాశం లేదు.

గడపగడపకు శాసనసభ్యులు తిరగండి ప్రజల ఇళ్లకు, సెల్ఫోన్లకు స్టిక్కర్లు అంటించండి బటన్ నొక్కడం ద్వారా ప్రజలకు ఇచ్చిన డబ్బు విషయం చెప్పండి అంటూ ఆదేశాలు మాత్రమే ఇచ్చేవారు.

నియోజకవర్గంలో ఇతర సమస్యలు వేటి గురించి ముఖ్యమంత్రిగాని ఆయన నియమించిన సామంత రాజులు గాని పట్టించుకున్న దాఖలాలు లేవు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

శాసనసభ్యులుగా నియోజకవర్గంలో వారికంటూ ఒక గుర్తింపు వచ్చే అభివృద్ధి శిలాఫలకం కూడా లేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యేలుగా ప్రజలలో మీ గ్రాఫ్ పడిపోయిందని కొత్తవారిని పెట్టడం ఏమిటో అర్థం కాని పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఈయన పాలనలో ఎమ్మెల్యేలే కాదు మంత్రులకు కూడా ఇదే పరిస్థితి.

రాష్ట్రంలో ఏ మంత్రికి కూడా తన శాఖలో జరుగుతున్న విషయాలు తెలియని పరిస్థితి.

రాష్ట్ర మంత్రులతో క్యాబినెట్ సమావేశం జరిగిన సమావేశం వివరాలు బహిర్గతం కావు.

ఈయన ఐదేళ్ల పాలనలో ఒక్క మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయని ఘనత ఆయనకే దక్కుతుంది.

సొంత పత్రిక ఛానల్ నడుపుతున్న విలేకరుల సమావేశంలో విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక ఒక్కసారి కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయలేదు.

ఐదేళ్లలో నాలుగైదు సార్లు రికార్డెడ్ వీడియోను మీడియాకు విడుదల చేయడం తప్ప ముఖ్య మంత్రి స్వయంగా మీడియా సమావేశంలో పాల్గొనలేదు.

ప్రభుత్వ నిర్ణయాలు గాని వివిధ మంత్రత్వ శాఖలలో జరుగుతున్న విషయాలపై కానీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వివరించేవారు.

మీడియా సమావేశాన్ని ముఖ్యమంత్రి కాదు రాష్ట్రంలో మంత్రులు కూడా ఫేస్ చేయలేని పరిస్థితి.

ప్రజాస్వామ్యంలో ప్రజల నుండి ఎన్నుకోబడిన శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి పాలనలో డమ్మీలుగా మారడంతో ప్రజలలో వారికి గ్రాఫ్ ఎందుకు ఉంటుంది.

ఈ పరిస్థితులలో వచ్చే ఎన్నికలలో కొత్తవారు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన ప్రభుత్వ పనితీరు ఆధారంగానే గెలుపు ఓటములు ఉంటాయి తప్ప అభ్యర్థులను బట్టి వైసీపీలో గెలుపు ఓటములు ఉండవు.

ప్రజలతో అనునిత్యం సత్సంబంధాలు కలిగి ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండే వ్యక్తులకే పార్టీలతో సంబంధం లేకుండా విజయావకాశాలు ఉంటాయి.

ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులైన శాసనసభ్యులను ప్రజలకు దూరం చేసి పాలన సాగించిన ఈయన ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #Andhrapravasi #Pravasi #YCP #ycpcheeppolitics #ycpcriminalpolitics #byebyejagan #apelection2024 #failedcmjagan #kodikatti #MLA