వైసీపీ ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్న అధికారులు ఇకనైనా మేల్కొంటే మంచిది... లేదంటే??

Header Banner

వైసీపీ ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్న అధికారులు ఇకనైనా మేల్కొంటే మంచిది... లేదంటే??

  Fri Feb 02, 2024 16:52        Exclusives

ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలో వైసీపీ అధినాయకుడి అక్రమాలకు అంతులేకుండా పోయింది.

ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా ఉన్న ఐఏఎస్ లు, ఆర్డిఓ లాగిన్ లు వైకాపా నేతలు తీసుకుని అదేచ్ఛగా దొంగ ఓట్లను నమోదు చేయించడం రాష్ట్రంలో కలకలం రేపుతుంది.

రాజ్యాంగబద్ధంగా ఐఏఎస్ స్థాయి అధికారులు వ్యవహరించవలసిన తీరును వైకాపా ప్రభుత్వంలో పూర్తిగా భ్రష్టు పట్టించారు.

ఏ ఎన్నికలలో అయినా గెలుపు ఓటములను రెండు నుంచి నాలుగు శాతం ఓట్లు నిర్ణయిస్తాయి.

ఈ లెక్కలను గ్రహించిన ఈయన ప్రభుత్వం 10 శాతానికి పైగా దొంగ ఓట్లను చేర్పించి ఎన్నికలలో గెలవాలని నిర్దేశించుకున్నారు.

దీనికై రాష్ట్రంలో పలు ప్రాంతాలలో వైకాపాకు చెందిన పలువురు క్రిమినల్ ఆలోచన కలిగిన వ్యక్తులను నియమించుకున్నారు.

ఈయన సంక్షేమ పథకాలు, వాగ్దానాలతో ప్రజలను మభ్య పెట్టడం ఒక కోణం అయితే అక్రమ మార్గాలు వెతకడం రెండవ కోణం.

రాయలసీమ జిల్లాలాలు ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు కావడంతో ఆ ప్రాంతంలో గెలుపు కోసం ఉన్న అన్ని అడ్డదారులను ఈయన ప్రభుత్వం తొక్కుతోంది.

కోస్తా జిల్లాలలో ఫ్యాక్షనిజం విస్తరింప చేయడానికి చేసిన ప్రయత్నాలు కొంతవరకు ఫలించాయనే చెప్పవచ్చు.

ప్రతిపక్ష పార్టీలకు చెందిన మద్దతు దారుల ఓట్లను గంపగుత్తగా ఫారం 7 ఇచ్చి తొలగిస్తున్నారు.

అధికారులు కూడా ఫారం 7పై పూర్తిస్థాయి విచారణ జరపకుండా అధికార పార్టీ నేతలు చెప్పిందే తడువుగా ఆ ఓట్లను తొలగించి చేస్తున్నారు.

విద్య,ఉద్యోగం,ఉపాధి కొరకు ఇతర ప్రాంతాలలో ఉంటూ తమ స్వగ్రామాలలో ఓటు హక్కు కలిగి ఉన్న లక్షలాదిమంది తెలుగుదేశం, జనసేన పార్టీల మద్దతుదారుల ఓట్లను గంపగుత్తగా తొలగిస్తున్నారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదులు అందాయి.

తిరుపతి ఉప ఎన్నికలలో జరిగిన ఓటర్ లిస్ట్ లోని అవకతవకలపై కూడా విచారణ చేసిన చీఫ్ ఎలక్షన్ కమిషన్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ ను సస్పెండ్ చేశారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఓటర్ జాబితాలో అవకతవకలకు పాల్పపడితే ఎటువంటి అధికారికైనా శిక్షలు తప్పవు అని చెప్పడానికి జిల్లా కలెక్టర్ ను సస్పెండ్ చేయడమే ఒక సంకేతంగా ఇతర అధికారులు భావించాలి.

చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం లేని పరిస్థితులలో ఎన్నికల కమిషన్కు ఆయా నియోజకవర్గాల్లో జరిగిన అక్రమాలను తెలియచేసిన వారు శిక్షలు నుండి తప్పించుకోగలరు.

ఎప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దొంగ ఓట్ల చేర్పింపులు, ఉన్న ఓట్లను తొలగింపులు ఒక దంధాగా అధికార వైసిపి నేతలు నిర్వహిస్తున్నారు.

అధికార పార్టీకి తాబేదారులుగా మారిన ఎంతో మంది అధికారులు ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు కొమ్ము కాస్తున్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు కొమ్ముకాసిన ఎంతోమంది ఐఏఎస్ లు జైళ్ల పాలైన సంగతి విధితమే.

అయినా ఐఏఎస్, ఐపిఎస్ స్థాయి అధికారులలో ఎక్కడ మార్పు కనిపించడం లేదు.

ఐఏఎస్, ఐపీఎస్ హోదాల కంటే రాజకీయ హోదాయే పవర్ఫుల్ అన్న ధోరణికి వచ్చి భవిష్యత్తు రాజకీయాలకు అధికార పార్టీ చెప్పిన అక్రమాలకు సహకరించి కొంతమంది అధికారులు పునాదులు వేసుకుంటున్నారు.

ప్రజలలో ప్రభుత్వం పట్ల పెరిగిన వ్యతిరేకత దృష్ట్యా ప్రభుత్వం ఎన్ని పిల్లి మొగ్గలు వేసిన వచ్చే ఎన్నికలలో విజయం సాధించడం కష్టం అన్నది జగమెరిగిన సత్యం.

అయినా ఈయన ప్రభుత్వం సాధ్యమైనంత వరకు గెలుపు కోసం ఉన్న ఎన్ని అడ్డదారులైన తొక్కుతోంది.

ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రతిపక్షాలు ఎండగడుతూ ఈయన ప్రభుత్వాన్ని రోడ్డుకీడ్చడమే పనిగా పనిచేస్తున్నారు.

జరగబోయే ఎన్నికల కురుక్షేత్రం అధికార పార్టీ అరాచకాలకు ప్రజలు పడే బాధలకు మధ్య జరిగే యుద్ధంగా ప్రతిపక్షాలు ప్రజల ముందుకు వెళుతున్నాయి.

ప్రభుత్వ అరాచక పాలనకు రాబోయే ఎన్నికలలో ప్రజలు చరమగీతం పాడడం తథ్యం.

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Pravasi #2024JaganNoMore #TDP #janasena #tdpjsptogether #TeluguDesamParty #jagancheeppolitics #jagancriminalpolitics #paytmbatch #IAS #IPS #officersinap