యూఏఈ: వడగళ్ల తో భారీ వర్షాలు! తుక్కుతుక్కు అయిన వందలాది కార్లు! ఓనర్లు లబోదిబో!

Header Banner

యూఏఈ: వడగళ్ల తో భారీ వర్షాలు! తుక్కుతుక్కు అయిన వందలాది కార్లు! ఓనర్లు లబోదిబో!

  Tue Feb 13, 2024 13:23        Environment, U A E

యూఏఈ: అల్ ఐన్లో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షంలా కురిసిన వడగళ్ళుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మునుపెన్నడూ ఇలాంటి వడగళ్ల వాన చూడలేదని గార్డెన్ సిటీలో నివసించే రోజీ తెలిపారు. గత 40 ఏళ్లుగా అల్ ఐన్ లో నివసిస్తున్న లిజేష్ ప్రేమ్లాల్ అనే భారతీయుడు తీవ్రమైన వడగళ్ల వాన వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. "మునుపు ఎన్నడూ నేను చూడని అత్యంత భారీ వడగళ్ల వాన ఇది. నేను నా పాఠశాల విద్యను ఇక్కడే పూర్తి చేశాను. ఇంత పెద్ద తుఫానును ఎప్పుడూ చూడలేదు." అని పేర్కొన్నారు. తన కారు పైకప్పులు మరియు కిటికీలు వడగళ్ళ కారణంగా దెబ్బ తిన్నాయని చెప్పారు. అల్ ఐన్ లోని ఇండియన్ సోషల్ సెంటర్ మాజీ ప్రెసిడెంట్, ఇప్పుడు ఆటోమొబైల్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్న ముబారక్ ముస్తఫా మాట్లాడుతూ "నేను ఇక్కడ 26 సంవత్సరాల నుంచి ఉంటున్నా ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు" అన్నారు. దురదృష్టవశాత్తు తన కారు సైడ్ మిర్రర్ లు మరియు వెనుక కిటికీలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఒక్క అల్ ఐన్ జాహిలీలో 500-600 కార్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అనేక ప్రాంతాలలో భవనాలు దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా పలు పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయని అల్ ఐన్ లోని పాఠశాలల యూనియన్ లీడర్ జాహిద్ సరోష్ వెల్లడించారు.

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #UAE #UAENews #UAEupdates #UAECountry #Gulf #GulfNews #GulfCountries #Sharjah #SharjahUpdates #Abudhabi #Dubai #GulfUpdates #DubaiNews #DubaiUpdates