"రాజధాని ఫైల్స్" చిత్రం ఈరోజే గ్రాండ్ రిలీజ్.. ఇందులో రాజకీయం లేదు ఇది ప్రజల సినిమా
Thu Feb 15, 2024 11:48 Cinemas'రాజధాని ఫైల్స్' చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల కన్నీటి గాథను కళ్ళకి కట్టినట్టు చూపించారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది రాజకీయ సినిమా కాదని, రైతుల సినిమా అని అంటున్నారు.శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై కంఠంనేని రవిశంకర్ నిర్మించిన చిత్రం 'రాజధాని ఫైల్స్'.
ఇంకా చదవండి: శ్రీకాళహస్తి నియోజకర్గంలో వైసీపీకి షాక్!!
భాను దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు(ఫిబ్రవరి 15న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తెలుగునాట పలు చోట్ల బుధవారం సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. మొదటి షో నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. రాజధాని రైతులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం 'రాజధాని ఫైల్స్' సినిమా చూడటానికి థియేటర్ల బాట పడుతున్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయని, తెలుగువారంతా ఈ చిత్రాన్ని ఖచ్చితంగా చూడాలని చెబుతున్నారు. ఇందులో రైతుల సమస్య గురించి చెప్పడమే కాకుండా, దానికి సినిమాలో పరిష్కారం చూపించడం అద్భుతమని కొనియాడుతున్నారు. తెలుగు సినిమా చరిత్రలోనే ఇలాంటి క్లైమాక్స్ రాలేదని, ఈ సినిమా క్లైమాక్స్ లో చూపించిన పరిష్కారం.. నిజ జీవితంలో జరిగితే రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందని అంటున్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టీమిండియా కెప్టెన్సీపై చర్చ.. క్లారిటీ ఇచ్చిన జై షా! ఏంటి నిజమా తనేనా?
నేడు మోదీ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం.. గల్ఫ్ దేశాల్లో తొలి హిందూ దేవాలయం!
జనసేనకు గుర్తుపై ఏపీ హైకోర్టులో విచారణ!! టెన్షన్లో పిటీషనర్!!
భువనేశ్వరి స్పీచ్ కు చేనేతలు షాక్!! పద్మవర్షిణి పట్టుచీర ఒక్కటి చాలు!!
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
#AndhraPravasi #NewMovie #TeluguMovie #RajadhaniFiles #RajadhaniFilesMovie #TodayRealse #RajadhaniFileMovieRealesToday
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.