సహాయానికి మారుపేరు నారా భువనేశ్వరి! లక్షల కుటుంబాలకు చేయూత ఎన్టీఆర్ ట్రస్ట్! ఇన్ని పనులు చేస్తుందా!

Header Banner

సహాయానికి మారుపేరు నారా భువనేశ్వరి! లక్షల కుటుంబాలకు చేయూత ఎన్టీఆర్ ట్రస్ట్! ఇన్ని పనులు చేస్తుందా!

  Thu Feb 15, 2024 20:23        Exclusives

రాజకీయాలంటే వైయస్ ఫ్యామిలీ వ్యాపారంగా మార్చి వేసింది.

వైయస్ రాజశేఖర్ రెడ్డి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అధికారం చేపట్టిన నాటినుండి వైసీపీ అధినాయకుడు ప్రజల సంపదను దోచుకోవడం మొదలెట్టారు.

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు దండుకున్న ఈయన అధికారం చేపడితే రాష్ట్ర సంపద దోపిడీకి అడ్డు అదుపు ఉండదని భావించారు.

తండ్రి లేని బిడ్డను అన్నాడు, తప్పుడు కేసులతో జైలుకు పంపించారు అన్నాడు, అన్న నిరపరాధి అంటూ చెల్లెలు షర్మిల పాదయాత్ర చేశారు, తల్లి విజయమ్మ నా కొడుకుని ముఖ్యమంత్రి చేయమని ప్రాధాయపడ్డారు.

భర్త ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కానీ అంతకు ముందు కానీ విజయమ్మ ప్రజలకు సాయం చేసిన వార్త నేను ఇప్పటి వరకు మన కళ్ళతో చూడలేదు, చెవులతో వినలేదు..

వైసిపి నాయకుడి పిట్టలదొర వాగ్దానాలు! లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోపిడి!     

అంటే ప్రజలకు ఈవిడ చేసింది ఏమీ లేదు.. అయినా కూడా సీఎంలు అవ్వడం నా కుటుంబ హక్కు కాబట్టి మీరంతా నా భర్తకు, నా పిల్లలకు ఓట్లు వేసి గెలిపించండి అని సెంటిమెంట్ తో ఓట్లు అడిగింది..

ఇంకోపక్క భువనేశ్వరి గారు.. ఆమె గురించి ఈ 18ఏళ్లలో వార్తల్లో చూసింది చాలా చాలా తక్కువ..

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సతీ సమేతంగా గుడులలో పట్టు వస్త్రాలు సమర్పించాలి కాబట్టి ఆ సమయంలో భువనేశ్వరని చూడటం తప్ప రాజకీయాల్లో ఆమెను ఎప్పుడూ చూడలేదు..

ఇక ప్రజలకు భువనేశ్వరి చేసిన సేవా కార్యక్రమాల అన్నీ ఇన్నీ కావు..

26ఏళ్ల క్రితం అంటే తన తండ్రి మరణించిన తర్వాత తండ్రి పేరుతో "NTR మెమోరియల్ ట్రస్ట్" ను భువనేశ్వరి స్థాపించారు..

ఆ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేదలకు భువనేశ్వరి సాయం అందించారు..

విద్యార్థులతో కలిసి సందడి చేసిన నారా భువనేశ్వరి!! టెక్నాలజీ గురించి దిశానిర్దేశం!!

 కృష్ణాజిల్లా చల్లపల్లిలో NTR మోడల్ స్కూల్ ను స్థాపించి అందులో వేలమంది అనాధ పిల్లలను ఉచితంగా చదిస్తున్నారు..

ప్రతిభ కలిగిన విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా స్కాలర్ షిప్స్ అందిస్తూ 4,193 మంది పేద విద్యార్థులను 3.44కోట్ల ఆర్థిక సాయం అందించారు..

బాలికల విద్యను ప్రోత్సహించాలని ప్రతి ఏటా 50మంది ప్రతిభ కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి ఇప్పటివరకు 1.93కోట్లు స్కాలర్ షిప్ రూపంలో అందించారు..

NTR మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 1,617మంది విద్యార్థులను కాలేజీలలో చదివిస్తున్నారు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ స్థాపించి 7,345 యువతీ యువకులకు శిక్షణ ఇప్పించి వారిలో 2,500 మందికి ఉద్యోగాలు ఇప్పించారు..

జాబ్ మేళాలు నిర్వహించి మరో 4,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించారు..

గత 26సంవత్సరాలలో 11,372 ఆరోగ్య శిబిరాలు నిర్వహించి 19,07,443 మంది ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు..

రక్త నిధి కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 83,582 యూనిట్ల రక్తాన్ని సేకరించి అందులో 20,045 యూనిట్ల రక్తాన్ని తలసేమియా వ్యాధి బాధితులకు 55,048 యూనిట్ల రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యవసర సేవల నిమిత్తం అందించారు..

ప్రజలకు సురక్షిత మంచినీరు అందించాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 క్లస్టర్ మోడల్ ఆర్వో ప్లాంట్లను, 42ఇండివిడ్యువల్ ప్లాంట్లను నెలకొల్పి తాగు నీరు అందిస్తున్నారు..

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

NTR మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రకృత్తి విపత్తులు సంభవించిన సమయాల్లో ఇప్పటివరకు 20లక్షల మందికి సాయం అందించారు..

2013లో ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చినప్పుడు 500మంది తెలుగు వారిని ప్రత్యేక విమానాల ద్వారా రాష్ట్రానికి చేర్చారు..


2014లో హుదుడ్ తుఫాన్ వచ్చినప్పుడు 50,000మంది బాధితులకు మందులు, ఆహారం, మజ్జిగ, పాలు, త్రాగునీరు అందించారు..


2016లో హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు 10బస్తీలలోని 5,000మంది పేదలకు సాయం అందించారు..

ఎన్నికల వేళ రాష్ట్రంలో అలజడలు సృష్టించడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు? అప్రమత్తంగా లేకుంటే?


2009లో కర్నూల్, మహబూబ్ నగర్ లో వరదలు వచ్చినప్పుడు 54వైద్య బృందాల ద్వారా శిబిరాలు నిర్వహించి 15కోట్ల విలువైన మందులు, వస్త్రాలు, దుప్పట్లను వరద బాధితులకు పంపిణీ చేశారు..


2021లో చిత్తూరు నెల్లూరులలో భారీ వరదలు వచ్చి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినప్పుడు 50వేల మందికి పైగా వరద బాధితులకు ఆహారం, పాలు, త్రాగు నీరు, దుప్పట్లు, నిత్యావసర సరకులు అందించారు..

అంతేకాకుండా వరదల్లో మరణించిన 48మంది కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున 48లక్షలు సాయం చేశారు..


కరోనా సమయంలో 1,500 మంది కరోనా రోగులకు ఉచితంగా వైద్యం అందించారు.. 2లక్షల మాస్కులు అందించారు.. 29లక్షల విలువైన మందులు పంపిణీ చేశారు.

1.35కోట్లతో ఏపీ, తెలంగాణలో 3 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు..

ప్రజారోగ్య సంరక్షణలో భాగంగా అధిక బరువు, కొలెస్టరాల్, డయాబెటీస్, రక్తపోటు నియంత్రణకై న్యూట్రిపుల్ యాప్ ద్వారా న్యూట్రిషనిస్టుల ద్వారా డైట్ ప్లాన్లను, ఆరోగ్య సలహాలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది..

పేద మధ్య తరగతి ప్రజలకు ఉచిత వైద్యం అందించాలని NTR ట్రస్ట్ సంజీవని పేరుతో ఏపీలోని అనేక ప్రాంతాల్లో ఉచిత ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చెయ్యడం జరుగుతుంది..

గుడివాడ స్వతంత్రానికి పోరాడుతున్న! వెనిగండ్ల రాము

భువనేశ్వరి ఇవి కాక ఎన్నో గుప్త దాన ధర్మములు.
మరి తండ్రి పేరుతో స్థాపించిన ట్రస్ట్ ద్వారా ఇన్ని లక్షల మందికి సేవ చేస్తూ కూడా ఒక రాజకీయ నాయకుడి భార్య అయ్యుండీ, ఒక రాజకీయ నాయకుడికి తల్లి అయ్యుండి కూడా తన ఒక్కగానొక్క కొడుకు మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినా కూడా నా కొడుక్కి ఓటు వెయ్యండి అని అడగలేదు.

40ఏళ్లుగా భర్త రాజకీయాల్లో ఉన్నా కూడా నా భర్తకి ఓటు వెయ్యండి అని ఎప్పుడూ అడగలేదు..

కానీ ఏ తప్పూ చెయ్యని తన భర్తను అకారణంగా, అన్యాయంగా జైల్లో పెడితే తప్పనిసరి పరిస్థితుల్లో నిజం గెలవాలి అని ప్రజల ముందుకు వస్తే వైసిపి పేటీఎం కుక్కలు మొరుగుతున్నాయి.

ప్రజలకు పైసా విదల్చకుండా ప్రజాసంపదను దోపిడీ చేసిన వైఎస్ కుటుంబానికి రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఉందా!

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తన సంపదలో కొంత భాగాన్ని ప్రజల అభివృద్ధికి వినియోగిస్తున్న చంద్రబాబు కుటుంబానికి ఓట్లు అడిగే హక్కు ఉందా!

ప్రతి అంధ్రుడు ఆలోచించాలి.

చంద్రబాబును కలిసిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు! ముహూర్తం ఖరారు?

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group


   #NTRTrust #NaraBhuvaneswari ##2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh