ఖతార్ లో "రాజధాని ఫైల్స్" సినిమాకి భారీ స్పందన.. థియోటర్ ప్రాంగణాలలో అమరావతి పై చర్చ..

Header Banner

ఖతార్ లో "రాజధాని ఫైల్స్" సినిమాకి భారీ స్పందన.. థియోటర్ ప్రాంగణాలలో అమరావతి పై చర్చ..

  Sat Feb 17, 2024 19:53        Cinemas, Qatar

ఖతార్ రాజధాని, దోహాలో రాజధాని ఫైల్స్ సినిమా శుక్రవారం 12 :45 PM (ఆదేశ కాలమానం  ప్రకారం) కు ప్రధమ షో ప్రదర్శించబడింది. తెలుగు ప్రజలు కుటుంబసభ్యులతో సహా ఈసినిమా వీక్షించటానికి పోటీపడ్డారు. ఈచలనచిత్రం డైరెక్టర్ భాను శంకర్ సోదరి సైతం ప్రేక్షకులతో కలసి సినిమాను వీక్షించడం జరిగింది. సినిమా అనంతరం, ఆమెను ప్రేక్షకులు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చాలు అందజేశారు.

 

ఇంకా చదవండి:  ఒమన్: 150 కిలోల మాదకద్రవ్యాలు! 8 మంది ప్రవాసులు అరెస్ట్! కఠిన శిక్షలు తప్పవు!

 

 ఈసందర్భంగా పలువురు తమ స్పందన తెలియచేసారు.

రాజధాని ఫైల్స్ సినిమా, రాష్ట్రరాజధానిలో జరుగుతున్నా అరాచకాలను కళ్ళకు కట్టినట్లు చూపించటంలో director సఫలీకృతులయ్యారనీ, రాజధాని రైతులు తమభూములను రాష్ట్ర భవిశ్యత్తు కోసం త్యాగం చేశారు తప్పా, లభేపేక్షతో కాదనే సత్యాన్ని ఈసినిమా ద్యారా చూపించారని చెప్పుకొచ్చారు.. రాజధాని సమస్య 29 గ్రామాల వారికి, 28 వేల మంది రైతులదీ కాదనీ.. భావితరాలదనే అక్షర సత్యాన్ని విస్పష్టం చేశారనీ కొనియాడారు.

మరికొందరు స్పందిస్తూ.. అమరావతి రైతులు, నాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్రలో భాగంగా తమ స్వగ్రామం మీదుగా సాగేసమయంలో, వారికి ఒక పూట భాజనం పెట్టె అదృష్టం తమకు దక్కిందని నెమరువేసుకొన్నారు..

 

ఇంకా చదవండి:  జగన్ 100% మేనిఫెస్టో అమలు చేస్తే వందమంది ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నాడు? ఆంధ్రుడా ఆలోచించు

 

అందరికి అన్నం పెట్టె రైతు కన్నీరు..రాష్ట్రానికి మంచిదికాదని.. జై జవాన్.. జై కిసాన్ అని పెద్దలు మనకి దిశానిర్ధేశం చేసారని.. వారి త్యాగానికి అర్ధం ఉండాలన్న.. ముక్కుపచ్చలారులైన మన చిన్నారుల బౌష్యత్తు బాగుండాలన్నా.. అన్నిటికి ఒకటే సమాధానం అనీ.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అభిరుద్దికి పట్టం కట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని, అరాచక ప్రభుతాన్ని సాగనంపాలని పలువురు తెలియచేసారు..

 

ఇంకా చదవండి:  ఖతార్: ముంబై నుండి దోహా కు డైరెక్ట్ ఫ్లయిట్! మార్చి 28 నుండి! ఆకాశ ఎయిర్ లైన్స్!

 

 యువకులు మాట్లాడుతూ.. ఈనెల 12 న ఒక G.O చూశామని.. అది MLA , MLC మరియు గ్రూప్ 1 , 2 & 3 ఉద్యోగుల నివాస సముదాయాల కోసమై బ్యాంక్స్ ఇచ్చిన లోన్ రీ పేమెంట్ కోరికని  తమకు తెలిసిందనీ, CRDA , రాష్ట్రప్రభుత్వ హామీతో రెండు వేలకోట్ల లోన్ తీసుకోని ఆయా భవనాలను నిర్మించే క్రమంలో ప్రభుత్వం మారిందని, గడిచిన 5 ఏళ్లగా

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

90 % పైబడి నిర్మాణం పూర్తయిన భవనాలను అమరావతి పై ఉన్నద్వేషంతో పాడుపెట్టారని.. బ్యాంకుల వత్తిడితో, గత 3 మాసాలనుంచి, అవి వాడుకలో ఉన్నాయని తప్పుడు GO ఇచ్చి తప్పుదారి పట్టించారని విమర్శించారు.. ఆ భవనాలు పూర్తిచేసి, ఉద్యోగులకు ఇచ్చివుంటే నెలకు 78 కోట్ల చొప్పున, ఏడాదికి, షుమారు 1000 కోట్ల CRDA కు HRA రూపంలో వచ్చి ఉండేదని, 2 years లో అప్పు తీరి ఏడాదికి 1000 కోట్లు రాష్ట్రప్రభుత్వా ఖజానాకు ఆదాయం వచ్చిఉండేది.. ఈదుష్ట పరిణామాలు  రాష్ట్రప్రభుత్వానికి తెలిసే, వారి కనుసన్నలలో జరుగుతున్నాయనీ,  ఇంతటి అమానుషమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని కొందరు విమర్శించారు. ఇకనైనా ప్రజలు రాష్ట్రానికి జరుగుతున్నా అన్యాయాలకు తమ ఓటు ద్యారా అడ్డుకట్ట వేయాలని అభిలషించారు..

 

ఇంకా చదవండి:  అనంతపురం: పోలీసుల ఓవర్ యాక్షన్ కు చెక్!! ఎస్పీ ప్రకటన??

 

 చివరిగా.. ఈసినిమాలో రాజధాని రైతులు అనుభవిస్తున్న యదార్ధ వ్యధలను కళ్ళకు కట్టినట్టు చిత్రీకరరణ చేశారనీ, రైతులకు నైతిక మద్దతుగా, తమవంతు బాధ్యతగా, నిర్మాత కంఠంనేని రవిశంకర్, డైరెక్టర్ భాను.. ఇంతటి సాహసం చేయటం శ్లీఘనీయమని తెలిపారు. ఏరువాక పాటకు నటి అద్భుతంగా నృత్య ప్రదర్శన చేశారనీ.. నటుడు వినోద్ కుమార్, నటి వాణి విశ్వనాథ్ అద్భుతంగా నాటించారని.. వారికి శుభాకాంక్షలు తెలియచేసారు.

తెలుగు ప్రజలు ఈసినిమా తప్పనిసరిగా వీక్షించాలని.. ప్రపంచవ్యాప్తంగా ఆదరించి, సినిమా నిర్మాత, డైరెక్టర్ కు సపోర్ట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు అయిన దేశాలు! భారత్ ర్యాంక్ ఎంతో తెలుసా?

 

మంగళగిరి నియోజకవర్గంలో నేతన్నలు కష్టాలు తెలుసుకుంటున్న నారా బ్రాహ్మణి !!

 

ఆస్ట్రేలియాలో వరదల్లో చిక్కుకుని భారత యువతి దుర్మరణం! క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో ఘటన

 

న్యూజెర్సీ రాష్ట్రంలోని జెర్సీ నగరంలోగల భవనంలో ఘటన! అమెరికాలో భారతీయులున్న భవనంలో అగ్నిప్రమాదం!

 

108MP కెమెరా, 8GB ర్యామ్‌ Honor స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం! ఈ బ్యాంక్‌ కార్డుపై రూ.3000 తగ్గింపు! ఫ్రీ గిఫ్ట్

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #RajadhaniFiles #MovieInQatar #RajadhaniFilesInQatar #MovieCelebrations #RajadhaniFilesMovieCelebrationInQatar #MovieTalk #QatarNews #TollywoodMovieInQatar