డీఎంకేతో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన కమల్! గుడ్ న్యూస్ తో మిమ్మల్ని కలుస్తా!

Header Banner

డీఎంకేతో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన కమల్! గుడ్ న్యూస్ తో మిమ్మల్ని కలుస్తా!

  Mon Feb 19, 2024 15:29        Cinemas, Politics

రానున్న లోక్ సభ ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీతో పొత్తుపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ కీలక ప్రకటన చేశారు. డీఎంకేతో పొత్తుకు సంబంధించి రెండు రోజుల్లో ప్రకటన చేస్తానని చెప్పారు. చెన్నై ఎయిర్ పోర్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలు తమకు ఒక మంచి అవకాశమని... ఎన్నికలకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మరో రెండు రోజుల్లో గుడ్ న్యూస్ తో మిమ్మల్ని కలుస్తానని కమల్ అన్నారు. 

 

ఇంకా చదవండి:  లాస్ ఏంజెల్స్ నగరంలో చిరంజీవికి సన్మాన కార్యక్రమం! అమెరికాలో కోలాహలం చేసిన మెగా ఫాన్స్!



డీఎంకే, ఎంఎన్ఎం పార్టీల పొత్తుపై గత సెప్టెంబర్ లోనే తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ హింట్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఎంఎన్ఎంతో పొత్తుపై పార్టీ నేతలు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మరోవైపు, సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఉదయనిధికి కమల్ మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికలు, 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఓటమిపాలయింది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేడు (19-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!!

 

'ఢిల్లీ ఛలో' కార్యక్రమాన్ని నిలిపివేసిన రైతులు!!

 

సౌదీ: రికార్డ్ స్థాయిలో వెల్లివిరుస్తున్న టూరిస్టులు! ఎన్నో ఆకర్షణలు, ఆఫర్లు! UN నివేదిక ప్రకారం!

 

మీడియాపై జగన్ ఫ్యాక్షన్ దాడి!! ఖండించిన నారా లోకేష్

 

ఆరోసారి ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్! సమన్లు చట్ట వ్యతిరేకం!

 

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #KamalHaasan #MNM #DMK #Kollywood #Politics #LokSabha #MNMParties