యూఏఈ: పిల్లలు ఉన్న చోట ధూమపానం చేస్తే! మీ జేబులు ఖాళీ అవ్వక తప్పదు! భారీ జరిమానాలు!

Header Banner

యూఏఈ: పిల్లలు ఉన్న చోట ధూమపానం చేస్తే! మీ జేబులు ఖాళీ అవ్వక తప్పదు! భారీ జరిమానాలు!

  Tue Feb 20, 2024 12:11        U A E, Gulf News

యూఏఈ: యఏఈలోని నివాసితులలో ధూమపానం అలవాటు అధికం అవుతుంది. ఇ-సిగరెట్లు మరియు వేప్ ల రాకతో ధూమపానం చేసేవారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు పొగాకు సంబంధిత ఉత్పత్తులను కొనుగోలు చేయడం మరియు వాటిని ఉపయోగించడం సులభం అయింది. యూఏఈలోని నిపుణుల ప్రకారం ధూమపానం చేయని వ్యక్తులు కూడా ధూమపానం చేసే వ్యక్తులతో సమానమైన ఆరోగ్య ప్రభావాలను ఎదుర్కుంటారు. ఇది పిల్లలకు కూడా వర్తిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం పొగాకు వల్ల ప్రతి సంవత్సరం 80 లక్షలు కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇందులో పొగతాగే అలవాటు లేని 13 లక్షల మంది పొగతాగేవారి పొగకు బలవుతున్నారు. యూఏఈలో పిల్లల చుట్టూ ధూమపానాన్ని ఎదుర్కోవడానికి కఠినమైన చట్టాలను ఏర్పాటు చేసింది. అలాగే మైనర్లకు పొగాకు ఉత్పత్తులను అమ్మటంపై నిషేధం ఉంది. దేశంలో బాలల హక్కులను స్థాపించే వడీమా చట్టం ప్రకారం పిల్లల సమక్షంలో ధూమపానం చేయడంపై నిషేధం ఉంది. ఆర్టికల్ 21 ప్రకారం, 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల సమక్షంలో ఏదైనా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రవాణా మార్గాలలో ధూమపానం చేయడం ఖచ్చితంగా నేరం అవుతుంది. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కనీసం 5,000 దిర్హామ్ లు జరిమానా విధిస్తారు. పిల్లలకు పొగాకు ఉత్పత్తులను విక్రయించడానికి ప్రయత్నించే వ్యక్తులకు కనీసం 3 నెలల జైలు శిక్ష లేదా Dh15,000 వరకూ జరిమానా విధించబడుతుంది అని అధికారులు తెలిపారు.

మరి కొన్ని ఆసక్తికరమైన UAE వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

అనంతలోకాలకు మార్గాలు... అనకాపల్లి రహదారులు! - నారా లోకేష్ 

గన్నవరం విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్ కు అంతరాయం!! 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై వివరణ ఇచ్చిన ఎన్నికల సంఘం!! వైరల్ గా ఫేక్ న్యూస్!! 

నేడు (20-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!! 

కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయండి!! లోకేష్ కు విజ్ఞప్తి!! 

నేటి నుంచి కుప్పంలో నారా భువనేశ్వరి "నిజం గెలవాలి" పర్యటన 

అనకాపల్లి శంఖారావం సభలో లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు!! మంత్రి అమర్నాథ్ కు కోడిగుడ్డు!! 

చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడిన జడ్జి లీలావతి! గుంటూరులో డయేరియా మరణాలు అధికం!  

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #UAE #UAENews #UAEupdates #UAECountry #Gulf #GulfNews #GulfCountries #Sharjah #SharjahUpdates #Abudhabi #Dubai #GulfUpdates #DubaiNews #DubaiUpdates