ట్యాక్స్ పేయర్స్‌కి గుడ్‌న్యూస్!! లక్ష వరకు పెండింగ్ ట్యాక్స్ మాఫీ!!

Header Banner

ట్యాక్స్ పేయర్స్‌కి గుడ్‌న్యూస్!! లక్ష వరకు పెండింగ్ ట్యాక్స్ మాఫీ!!

  Fri Feb 23, 2024 15:09        Business, Employment, India

ట్యాక్స్ పేయర్స్‌కి గుడ్‌న్యూస్.. రూ.1 లక్ష వరకు ట్యాక్స్ మాఫీ.. ITR పోర్టల్‌లో చెక్ చేసుకోండి!

Income Tax: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అదిరే శుభవార్త అందించింది కేంద్రం. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు సంబంధించి రూ.1 లక్ష వరకు పెండింగ్ ట్యాక్స్ డిమాండ్లను మాఫీ చేసినట్లు ప్రకటించింది. వెంటనే ఐటీఆర్ పోర్టల్‌లో చెక్ చేసుకోవచ్చని సూచించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Income Tax: పన్ను చెల్లింపుదారులకు అదిరే శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు రూ.1 లక్ష వరకు ట్యాక్స్ మాఫీ చేసింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ఫిబ్రవరి 13, 2024 నాటి ఆర్డర్ లో వెల్లడించింది. దీని ప్రకారం.. జనవరి 31, 2024 నాటికి బాకీ ఉన్న పాత పన్ను డిమాండ్లను చెల్లించడం, మాఫీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు సీబీడీటీ పేర్కొంది. గత నెల వరకు ఉన్న పాత ట్యాక్స్ డిమాండ్లు రూ.1 లక్ష వరకు మాఫీ అవుతున్నాయి. దీంతో చాలా రోజులుగా ఈ పెండింగ్ బకాయిల విషయంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించిందని చెప్పవచ్చు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఈ క్రమంలో పాత ట్యాక్స్ డిమాండ్లు ఉన్న వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు వెంటనే ఐటీఆర్ పోర్టల్‌లో చెక్ చేసుకోవాలని కోరింది సీబీడీటీ. అందుకు ITR పోర్టల్ లోకి వెళ్లిన తర్వాత రెస్పాన్స్ టూ ఔట్‌ స్టాండింగ్ డిమాండ్స్ ట్యాబ్‌లో స్టేటస్ తెలుస్తుంది. సీబీడీటీ ప్రకారం.. ఈ బకాయి పడ్డ పాత పన్నులు గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు మాఫీ అవుతున్నాయి. అయితే, అందులో కొన్ని రకాల పన్ను డిమాండ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆ జాబితాలో ఆదాయపు పన్ను చట్టం 1961, సంపద పన్ను చట్టం 1957, బహుమతి పన్ను చట్టం 1958 ప్రకారం ట్యాక్స్ డిమాండ్లు.. అలాగే ఐటీ యాక్ట్ 1961లోని పలు నిబంధనల ప్రకారం వడ్డీ, పెనాల్టీ, ఫీ, సెస్స్ లేదా సర్‌ఛార్జీలకు సంబంధించిన నోటీసులు ఈ పరిధిలోకి వస్తాయని తెలిపింది.

 

ఏంటి ఈ బ్యాంకుల్లో మీరు ఫిక్స్ డిపాజిట్ చేశారా? అయితే లాభం పోయినట్లే! ఈ బ్యాంకుల్లో ఫిక్స్ చేస్తే వడ్డీ??

 

మరోవైపు.. ఐటీ యాక్ట్ 1961లోని సెక్షన్ 220 (2) పాత పన్ను బకాయిలు చెల్లించడంలో ఆలస్యమైనప్పటికీ వాటిపై వడ్డీ లెక్కించాల్సిన అవసరం లేదని సీబీడీటీ తెలిపింది. ఈ ప్రాతిపదికనే ఓల్ట్ ట్యాక్స్ డిమాండ్ల గరిష్ఠ పరిమితి రూ.1 లక్షగా నిర్ధారించినట్లు తెలిపింది. సాధారణంగా పన్ను బకాయిలు ఉంటే నెలకు 1 శాతం మేర పెనాల్టీలు విధిస్తుంది ఐటీ శాఖ. కానీ, ఇప్పుడు వడ్డీ, పెనాల్టీలను సైతం మాఫీ చేస్తుండడం పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరటగా ఐటీ నిపుణులు చెబుతున్నారు. నెలకు 1 శాతం పెనాల్టీలు వేసినప్పుడు కొన్నిసార్లు ప్రిన్సిపల్ అమౌంట్ కన్నా ఎక్కువు అవుతుందని, అలాంటి సందర్భాల్లో పాత పన్నులు చెల్లించాల్సి రావచ్చని పేర్కొన్నారు.

 

ఐసీఐసీఐ బ్యాంక్ శుభవార్త! నేటి నుంచే అమలులోకి.. "డిపాజిట్లపై" వడ్డీ రేట్లు పెంపు.. ఆలస్యం ఎందుకు చూసుకోండి మరీ!

 

పాత డిమాండ్ల విషయానికి వస్తే.. గతంలో పన్ను ఉపశమనం కల్పించేందుకు కట్ ఆఫ్ తేదీలు ఉన్నాయి. జనవరి 31, 2024 నాటికి ఉన్న అన్ని చిన్న చిన్న ఆదాయపు పన్ను డిమాండ్లు మాఫీ చేశారు. ఐటీ యాక్ట్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఆర్థిక ఏడాది 2009-10 వరకు రూ.25000 మాఫీ చేసింది. అలాగే ఆర్థిక ఏడాది 2010-11 నుంచి ఆర్థిక ఏడాది 20214-15 వరకు రూ.10 వరకు మాఫీ అయ్యాయి. తమ స్టేటస్ చెక్ చేసుకునేందుకు ఐటీ పోర్టల్ లో రెస్పాన్స్ టూ ఔట్ స్టాండింగ్ డిమాండ్ ట్యాబ్ ద్వారా తెలుసుకోవచ్చని ఐటీ నిపుణులు సూచిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి:

పొరపాటున వీటిలో ఇన్వెస్ట్ చేసారా?? ఇంక మీ పిల్లల కలలు తీరినట్టే!!

 

ఐటీ సంస్థ యజమానులు జర భద్రం!!

 

దుబాయ్ లో బంగారం ధర చాలా తక్కువ! కారణం తెలుసా! మరీ అంత తేడానా?

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Pravasi #TaxPayers #Bussiness #Employees