మానిఫెస్టో లో పేర్కొన్న గల్ఫ్ కార్మికుల సంక్షేమం అమలు చెయ్యాలి! రేవంత్ కు తెలంగాణా గల్ఫ్ కార్మికుల లేఖ..
Sat Mar 02, 2024 20:43 India, Politicsటిపిసిసి ఎన్నికల మ్యానిఫెస్టో 2023 (అభయ హస్తం) లో ఈ క్రింద పేర్కొన్న విధంగా 'గల్ఫ్ కార్మికుల సంక్షేమం మరియు ఎన్నారైల సంక్షేమం' కోసం వాగ్దానం చేయబడింది.
◉ ఎన్నారైలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం.
◉ గల్ఫ్ కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారం కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం.
◉ మరణించిన గల్ఫ్ కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు.
◉ విదేశాలలో వున్న వలస కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేస్తాం.
సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), ఒమన్, బహ్రెయిన్, ఖతార్, కువైట్ వంటి ఆరు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) దేశాలలో దాదాపు 15 లక్షల మంది తెలంగాణ వలసదారులు నివసిస్తున్నారు మరియు పని చేస్తున్నారు. ప్రతి తెలంగాణా వలసదారు స్వరాష్ట్రంలోని వారి కుటుంబ సభ్యులలో కనీసం ముగ్గురిని ప్రభావితం చేయగలుగుతారు. ఈ విధంగా మొత్తం 45 లక్షల మంది వ్యక్తులు ప్రభావితం అవుతారు.
టిపిసిసి ఎన్నారై విభాగానికి చెందిన ఆరుగురు సభ్యుల ప్రతినిధి బృందం 2024 జనవరి 26 నుండి 28 వరకు యూఏఈ దేశంలోని దుబాయి, అబుదాబిలను సందర్శించింది. ఈ ప్రతినిధి బృందానికి టిపిసిసి ఎన్నారై సెల్ చైర్మన్, ఐఎఫ్ఎస్ (రిటైర్డ్) అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్ నాయకత్వం వహించారు. ప్రతినిధి బృందంలో సింగిరెడ్డి నరేష్ రెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, జేజాల సైదయ్య బాబు, స్వదేశ్ పరికిపండ్ల, మంద భీంరెడ్డి ఉన్నారు. కేరళ ప్రవాసీ కాంగ్రెస్ కార్యకర్తలతో టీపీసీసీ ప్రతినిధి బృందం సమావేశమైంది. మైగ్రెంట్ ఫోరమ్ ఇన్ ఆసియా నిర్వహించిన 'గల్ఫ్ దేశాలలో భారతీయ వలస కార్మికుల పరిస్థితి' అనే అంశంపై జరిగిన ఒక సమావేశానికి కూడా వారు హాజరయ్యారు. అంతకుముందు టిపిసిసి ప్రతినిధి బృందం యుఎఇ పర్యటన సందర్భంగా దుబాయి, అబుదాబి లోని లేబర్ క్యాంపులను సందర్శించింది.
ఖతార్ లో ఎన్నికల శంఖారావం సభ.. భారీగా హాజరైన ప్రవాసులు..
పరిశీలనలు:
- 14 ఫిబ్రవరి 2024న అబుదాబిలో బాప్స్ హిందూ దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు. 13న అబుదాబిలో జరిగిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. గల్ఫ్ దేశాలలో భారతీయ వలస కార్మికులకు సామాజిక భద్రత గురించి భారత ప్రభుత్వం పెద్దగా ఏమీ చేయలేదు.
- తెలంగాణ ముఖ్యమంత్రి మరియు టిపిసిసి అధ్యక్షుడి హోదాలో మీరు మార్చి నెలలో దుబాయిలో బహిరంగ సభలో ప్రసంగించవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
- గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టాలి.
గల్ఫ్ గ్యారంటీలు: రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వాగ్దానాలపై గల్ఫ్ కార్మికులు ఆశలు పెట్టుకున్నారు. 16 నెలల క్రితం... భారత్ జోడో యాత్ర 60వ రోజున నవంబర్ 6, 2022న మెదక్ జిల్లా నిజాంపేట సమీపంలో గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యులు రాహుల్ గాంధీ గారితో కలిసి తమ బాధలను చెప్పుకున్నారు. ఐదేళ్ల క్రితం... 2018 నవంబర్ 29న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో ఇద్దరు 'గల్ఫ్ వితంతువులు' తమ పిల్లలతో కలిసి రాహుల్ గాంధీని కలిసి తమ బాధలను పంచుకున్నారు. పైన పేర్కొన్న నలుగురు ‘గల్ఫ్ వితంతువులకు’ పథకం ప్రారంభోత్సవ చిహ్నంగా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ఇది రాహుల్ గాంధీ గారి వాగ్దానాలకు గౌరవం.
గల్ఫ్ దేశాల్లో మరణించిన వారికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా కోసం జి.ఓ జారీ చేయండి.
ఇట్లు
మీ విధేయులు
టి. జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ +91 94400 71330
డా. బిఎం వినోద్ కుమార్, చైర్మన్, టిపిసిసి ఎన్నారై సెల్. +91 77319 3013
సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గల్ఫ్ కన్వీనర్, టిపిసిసి ఎన్నారై సెల్. +91 90104 44111
మంద భీంరెడ్డి, కన్వీనర్, టిపిసిసి ఎన్నారై సెల్. +91 98494 22622 mbreddy.hyd@gmail.com
గుండేటి గణేష్, అధ్యక్షులు, ఇండియన్ సోషల్ క్లబ్, ఓమాన్. తెలంగాణ విభాగం. +968 9949 0190
సిస్టర్ లిజీ జోసెఫ్, అధ్యక్షులు, నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ +91 94416 75817
తేది: 02.03.2024
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!
న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!
అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!
వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Telangana #government #Politics #gulf #Education #RevanthReddy #WelfareofGulfworkers
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.