రాష్ట్ర భవిష్యత్తుకోసమే మూడుపార్టీల పొత్తు -లోకేష్

Header Banner

రాష్ట్ర భవిష్యత్తుకోసమే మూడుపార్టీల పొత్తు -లోకేష్

  Sun Mar 24, 2024 09:18        Politics

మైనారిటీలను కంటికిరెప్పలా కాపాడుకుంటాం!
మంగళగిరి ఎన్నికల ప్రచారసభలో నారా లోకేష్
మంగళగిరి: రాష్ట్ర భవిష్యత్తు కోసమే టిడిపి-జనసేన-బిజెపిలు పొత్తు, కుల, మతాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలన్నదే టిడిపి లక్ష్యం, పొత్తుపై వైసిపి నేతలు మైనార్టీలను రెచ్చగొడుతున్నారు, వారి దుష్ప్రచారాలను నమ్మవద్దు, మైనారిటీలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్డీఏ లో ఉన్నప్పుడు 2014-19 మధ్య టీడీపీ పాలనలో ఏనాడూ మైనార్టీలపై దాడులు జరగలేదు, ప్రజలు అప్రమత్తంగా ఉండి టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై వైకాపా దుష్ప్రచారాన్ని నమ్మవద్దని పిలుపునిచ్చారు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం మెల్లంపూడి రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. వైకాపా పాలనలో మైనార్టీలపై ఇదివరకెన్నడూ లేనివిధంగా దాడులు పెరిగాయి. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

 

పలమనేరులో మిస్బా ఆత్మహత్యకు కారణం వైసీపీ. నర్సరావుపేటలో వక్ఫ్ భూముల కోసం పోరాడిన ఇబ్రహీంను దారుణంగా చంపారు. స్వార్థ రాజకీయాల కోసం బాబాయిని చంపి... నారాసుర రక్తచరిత్ర అని ప్రచారం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. నేడు సొంత చెల్లే నిజం చెప్పింది. గత ఎన్నికల్లో అండగా నిలచిన సొంత తల్లిని, చెల్లిని బయటకు గెంటేశారు. మైనార్టీలను రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసింది టీడీపీ. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుచేస్తాం. ప్రతి మైనార్టీ సోదరుడిని మా గుండెల్లో పెట్టుకుంటాం. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. ఇప్పటివరకు 12 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇప్పటి పరిస్థితుల్లో కేంద్ర సహకారం లేనిదే రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి ఉండదు. వెనుకబడిన జిల్లాలకు నిధులు, విభజన హామీలు నెరవేరాలంటే కేంద్ర సహకారం అవసరం. ప్రజలకు అన్నీ వివరించేందుకు టీడీపీ-బీజేపీ-జనసేన మరో 3,4 సభలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సభల్లో వారి వైఖరిని కూడా ప్రజలకు స్పష్టం చేస్తారని లోకేష్ చెప్పారు.

 

ప్రభుత్వ దాష్టీకానికి కడప జిల్లాలోని చేనేత కుటుంబం బలైంది -చంద్రబాబు 

 

మెల్లెంపూడి వాసులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తెస్తూ...గ్రామంలో మైనార్టీల కోసం ఈద్గా ఏర్పాటుచేయాలి. ఇసుక ధరలు తగ్గించాలని, ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. తాగునీరు, డ్రైనేజీ, ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి, రేవేంద్రపాడు వంతెన నిర్మించాలని కోరారు. యువనేత స్పందిస్తూ... అధికారంలోకి వచ్చాక భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి, వారికి అండగా నిలుస్తాం, ఇసుక ధరలు తగ్గిస్తాం. మెల్లంపూడిలో ఈద్గా ఏర్పాటుచేస్తాం. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తాం. ఇళ్ల పట్టాలతో పాటు ఇళ్లు నిర్మించి ఇస్తాం. రేవేంద్రపాడు వంతెన పూర్తిచేస్తాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తాం. కౌలు రైతులను అన్నివిధాల ఆదుకుంటాం. వారికి కూడా ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ చెప్పారు.

 

ఇవి కూడా చదవండి:

ఇసుక తవ్వకాలపై నివేదికలు కోరుతూ కలెక్టర్లకు కీలక ఆదేశాలు!! మూడు రోజులే టైం!! 

 

ఇదేనా ఏపీలో వైసీపీ అభివృద్ధి మంత్రం!! నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి 

 

దేశమంతా మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేసి చూపిస్తా!! రచ్చబండ సభల్లో లోకేష్ భరోసా!! 

 

పురంధేశ్వరి రాజీనామా లేఖ!! నిజమా ?? 

 

ఈడీ కస్టడీలోకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ !! 

 

నేటికీ జమ కాని ఆసరా డబ్బులు!! ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారు? ఆచంట సునీత 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants #Politics #TDP #YCP #YCPparty #AndhraPradesh #APPolitics #JSP #TDPJSPTogether #Elections