ఎన్నిరోజులు అయ్యింది? ఇంతకాలం ఏం చేశారు? - సూటిగా అడిగిన చంద్రబాబు!

Header Banner

ఎన్నిరోజులు అయ్యింది? ఇంతకాలం ఏం చేశారు? - సూటిగా అడిగిన చంద్రబాబు!

  Thu Aug 08, 2024 09:30        Politics

మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్నిప్రమాదం కేసు దర్యాప్తును ప్రత్యేక టీమ్ పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనుచరుడు కోసం పోలీసులు నాలుగు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్నిప్రమాదం జరగడానికి, ఫైల్స్ కు మంటలు వ్యాపించడంలో వైసీసీ నాయకులు హస్తం ఉందని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు,వైసీపీ కార్యకర్తలు కలిసి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిప్పంటించారని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, తంబళ్లపల్లె, పీలేరు తదితర నియోజక వర్గాలకు చెందిన ప్రభుత్వ భూములు, సెక్షన్ 22 ఏ భూములు రికార్డులు చాలా వరకు ఖాళీ బూడిద అయ్యాయని అధికారులు ఆరోపిస్తున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఉద్యోగి గౌతమ్ తేజను పోలీసులు విచారిస్తున్నారు. ఆదివారం రోజు రాత్రి 11.23 గంటల సమయంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడంతో సీఎం చంద్రబాబు నాయుడు మదనపల్లె పోలీసులపై సీరియస్ అయ్యారు.

 

ఇంకా చదవండి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ! కీలక అంశాలపై చర్చ!

 

విద్యుత్ షార్ట్ సర్కూట్ వలన అగ్నిప్రమాదం జరగలేదని ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు తేల్చి చెప్పారు. పెట్రోల్, డీజల్ కారణంగా మంటలు వ్యాపించలేదని, గౌతమ్ తేజ్ కావాలనే కారు ఇంజిన్ ఆయిల్ తీసుకు వచ్చి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని బీరువాలో పెట్టాడని, ఇంజిన్ ఆయిల్ కారణంగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదం కేసు పై దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత పోలీసు అధికారులను ప్రశ్నించారని తెలిసింది. ఇదే విషయంపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమల రావును ప్రథమిక విచారణ నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని సమాచారం. ఇప్పటికే ప్రత్యేక టీమ్ పోలీసులు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవ రెడ్డి కోసం గాలిస్తున్నారు. మాధవ రెడ్డి ఢిల్లీలో తలదాచుకున్నాడని అనుమానం రావడంతో అక్కడికి ఓ టీమ్ పోలీసులు వెళ్లారని తెలిసింది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసు అగ్ని ప్రమాదం కేసు త్వరలో చేధిస్తామని ప్రత్యేక టీమ్ పోలీసులు అంటున్నారు. సీఐడీ అధికారులు కూడా పలు కోణాల్లో ఈ కేసు దర్యాప్తు చేస్తుండటంతో ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్లు తప్పించుకోవడం సాధ్యం కాదని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.

ఇంకా చదవండి: 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. వీరికి భారీ షాక్! అమలులో కొత్త ట్విస్ట్! ఎవరు అర్హులు?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

 

వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance