ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి కాలరాత్రి సరిగ్గా నేటికీ సంవత్సరం! అన్యాయంగా అక్రమంగా దుష్టుడు చేసిన రాక్షస క్రీడ!

Header Banner

ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి కాలరాత్రి సరిగ్గా నేటికీ సంవత్సరం! అన్యాయంగా అక్రమంగా దుష్టుడు చేసిన రాక్షస క్రీడ!

  Mon Sep 09, 2024 17:52        Politics

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ అయి నేటికి సరిగ్గా ఏడాది. ప్రతిపక్ష నేతగా నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు శిబిరం వద్దకు చేరుకున్న సీఐడీ పోలీసులు ఆయనను బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బస్సులో బస చేసిన చంద్రబాబు నిద్రపోతుండగా ఉదయం ఆరు గంటలకే అక్కడికి చేరుకున్న పోలీసులు బస్సు నుంచి చంద్రబాబును బయటకు పిలిచి అరెస్ట్ చేశారు.

 

చంద్రబాబు నిలదీత.. నీళ్లు నమిలిన పోలీసులు..

ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారన్న ఆయన తరపు న్యాయవాదులకు పోలీసులు విచిత్రమైన సమాధానం చెప్పారు. కోర్టులో రిమాండ్ రిపోర్టు సమర్పించే సమయంలో అన్ని వివరాలు ఇస్తామని చెప్పడం అందరినీ విస్తుపోయేలా చేసింది. మరోవైపు, చంద్రబాబు కూడా పోలీసులను ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తన పేరు ఎక్కడుందో చూపించాలని నిలదీశారు. దీంతో పోలీసులు నీళ్లు నమిలారు. విజయవాడ వెళ్లే లోపు ఇస్తామని అప్పటి డీఐజీ రఘురామిరెడ్డి చంద్రబాబు తరపు న్యాయవాదులకు చెప్పారు.

 

ఇంకా చదవండి: ఎమ్మెల్యే తృటిలో తప్పిన పెను ప్రమాదం! ఆలపాడు - కొల్లేటికోట రహదారి పూర్తిగా!

 

14 రోజుల రిమాండ్..

మరోవైపు, పోలీసులపై తనకు నమ్మకం లేదని, ఎన్ఎస్‌జీ పర్యవేక్షణలోనే వస్తానని చంద్రబాబు భీష్మించుకోవడంతో అందుకు పోలీసులు అంగీకరించడంతో విజయవాడకు తరలించారు. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించడంతో వైద్య పరీక్షల అనంతరం ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. తమ వివాహ వార్షికోత్సవం రోజునే చంద్రబాబును జైలుకు తరలించడంతో ఆయన భార్య భువనేశ్వరి, కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

 

53 రోజులు జైలులోనే..

నిజానికి చంద్రబాబు రెండుమూడు రోజుల్లోనే బయటకు వచ్చేస్తారని అందరూ భావించారు. అయితే, 53 రోజుల వరకు ఆయన జైలులోనే ఉండాల్సి వచ్చింది. అధినేత జైలులో ఉన్నప్పటికీ టీడీపీ శ్రేణులు, నారా, నందమూరి కుటుంబ సభ్యులు ప్రజల్లోకి వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని చాటారు. రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్ట్ చేశారని నినదించారు. ఎన్నడూ బయటకు రాని భువనేశ్వరి సైతం ప్రజల్లోకి వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. బాబు అరెస్ట్‌పై ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చివరికి 53వ రోజున అంటే 31 అక్టోబర్ 2023న జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా రాజమండ్రి జైలు వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, నారా, నందమూరి కుటుంబ సభ్యులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.

 

నిండు చంద్రుడు, ప్రజలు ఒక వైపు..

నియంత జగన్ కుట్రలు మరో వైపు..

నిజాయితీకి నిలువెత్తు రూపమైన

చంద్రబాబు గారి అక్రమ నిర్బంధంపై తెలుగు జాతి ఒక్కటై ఉద్యమించింది. రాష్ట్ర ప్రగతి కోసం, తెలుగు ప్రజల కోసం పరితపించే చంద్రబాబు గారిని ఏడాది క్రితం తప్పుడు కేసులో అక్రమ అరెస్ట్ చేయడమే వైసీపీ సమాధికి జనం కట్టిన పునాది అయ్యింది.

తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులు అందరూ ఈరోజు ఈ ఫోటోను మీ మీ సామాజిక మాధ్యమాల ప్రొఫైల్ పిక్.. అలాగే వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోగలరు..

 

ఇంకా చదవండి: అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!

 

మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!

 

భార్య పేరు మీద ఇల్లు కొంటే ఇన్ని లాభాలా? భారీ మొత్తంలో డబ్బు మిగలడం ఖాయం! ఇక ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!

 

ఒమాన్: కేవలం 5 రియాల్ (₹1,000) కే 10 రోజుల టూరిస్ట్ వీసా! అతి తక్కువ విమాన మరియు హోటల్ ధరలు! భారతీయులకు ఒమాన్ ప్రభుత్వం భారీ ఆఫర్లు!

 

ఇక వరదలకు చెక్.. బుడమేరుకు రిటైనింగ్ వాల్ ప్రణాళిక! మంత్రుల కీలక వ్యాఖ్యలు!

 

స్టార్ హీరోలను మించి! ఏపీ, తెలంగాణాలకు రియల్ హీరో సోనూసూద్ భారీ విరాళం!

 

హైదరాబాదులోని అమెరికా కౌన్సిలేట్లో ఉద్యోగ అవకాశాలు! వెంటనే అప్లై చేసుకోండి ఇలా! జీతం ఎంతంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews