సామాన్యులకు రూ.25 లక్షలు! చంద్రబాబు అదిరే గుడ్ న్యూస్, కీలక ప్రకటన?

Header Banner

సామాన్యులకు రూ.25 లక్షలు! చంద్రబాబు అదిరే గుడ్ న్యూస్, కీలక ప్రకటన?

  Thu Aug 08, 2024 09:00        Politics

పేదలకు అదిగే గుడ్ న్యూస్. ఏపీ సర్కార్ కిర్రాక్ తీపికబురు తీసుకువచ్చింది. దీని వల్ల చాలా మందికి ఊటర లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ప్రభుత్వం ఏ తీపికబురు అందించింది? ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? వంటి అంశాలు తెలుసుకుందాం. ఉచిత ఆరోగ్య సేవలపై మంత్రి కీలక ప్రకటన చేశారు. ఎన్టీఆర్‌ వైద్య సేవతో పాటు కేంద్ర వైద్య పథకాలను కూడా జోడించి బీమా పద్ధతిలో రూ.25 లక్షల వరకు వైద్యసేవలు పొందే విధానాన్ని తీసువస్తామని వివరించారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని ప్రకటించనున్నారని తెలిపారు. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. మంగళవారం పోతేపల్లి జ్యుయలరీ పార్క్‌లో మానవతా స్వచ్ఛంద సంస్థ, ఒక మీడియా సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 100 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తుందని, ఇందులో భాగంగా మచిలీపట్నంలో బైపాస్‌ రోడ్డులో అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటికే ఏపీలో ఆరోగ్య శ్రీ ట్రస్టుకు గతంలో ఉన్న ‘నందమూరి తారక రామారావు వైద్య సేవ’ పేరును ప్రభుత్వం పునరుద్ధరించింది.

 

ఇంకా చదవండి: సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగింపు! కేబినెట్ నిర్ణయం, భూమి యజమానుల ఆందోళన!

 

గతంలో ఈ పేరును వైసీపీ అధికారంలోకి వచ్చాక ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’గా మార్చింది. ఆరోగ్యశ్రీ అనునది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు చెందిన ఒక ప్రజారోగ్య కార్యక్రమం. ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. 2014లో ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ నందమూరి తారకరామారావు ఆరోగ్య సేవగా పేరు మార్చింది. ఈ ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య బీమా పథంకంగా గుర్తింపు పొందింది. ఈ పథకం కింద అర్హులైన పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలందిస్తారు (వైద్య సేవలందించడంతో పాటు రవాణా, భోజన, వసతి సదుపాయాలను కల్పిస్తారు). ఈ పథకం ద్వారా 2014 సెప్టెంబరు నాటికి 26 లక్షల మంది పేద రోగులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేశారు. అయితే.. ఈ పథకం కింద 1038 పైగా జబ్బులకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించబడుతున్నాయి. ప్రభుత్వం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేదవారికి ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేస్తుంది. ఈ కార్డుల ద్వారా ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదై ఉచిత వైద్య సేవలను పొందవచ్చు.


ఇంకా చదవండి: 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. వీరికి భారీ షాక్! అమలులో కొత్త ట్విస్ట్! ఎవరు అర్హులు?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

 

వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance