విదేశాలకు వెళ్లేవారికి ఇకపై ఇది తప్పనిసరి! కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో! ఖఠినంగా వ్యవహరించాలిసిందే!

Header Banner

విదేశాలకు వెళ్లేవారికి ఇకపై ఇది తప్పనిసరి! కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో! ఖఠినంగా వ్యవహరించాలిసిందే!

  Thu Aug 08, 2024 10:24        Gulf News, Politics

తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ అనుబంధ సంస్థ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టాంకాం) సంస్థ హైదరాబాద్ లోని మాసాబ్ టాంక్ మల్లేపల్లి ఐటీఐ ఆవరణలో గల్ఫ్ తదితర దేశాలకు వెళ్లేవారికి ఒకరోజు ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ (పిడిఓటి) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. 

 

ప్రవాసి సంఘాల ప్రతినిధుల బృందం మంగళవారం మాజీ ఐఎఫ్ఎస్ అధికారి, మాజీ ఇండియన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్ నాయకత్వంలో వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి, తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి, కువైట్ ఎన్నారై కల్యాణి చొప్పల, అబుదాబి ఎన్నారై ప్రియా సింగిరెడ్డి లు 'టాంకాం' ను సందర్శించారు. 'టాంకాం' జనరల్ మేనేజర్ కె. నాగభారతి, మేనేజర్ ఎస్. షబ్న, ఐటీఐ ట్రేనింగ్ ఆఫీసర్ ఎం.బి. క్రిష్ణ యాదవ్ లు 'టాంకాం' కార్యకలాపాలు, శిక్షణ గురించి ప్రతినిధి బృందానికి వివరించారు. 

 

ఇంకా చదవండి: సామాన్యులకు రూ.25 లక్షలు! చంద్రబాబు అదిరే గుడ్ న్యూస్, కీలక ప్రకటన?

 

ప్రవాసీ కౌశల్‌ వికాస్‌ యోజన పథకంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నైపుణ్య అభివృద్ధి పారిశ్రామిక మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నారు. సురక్షితమైన, చట్టబద్దమైన వలసలకు మార్గాల గురించి విషయ పరిజ్ఞానం, అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేయడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఆయా దేశాల సంస్కృతి, భాష, ఆచార వ్యవహారాలు, స్థానిక నియమాలు, నిబంధనలు తెలియజేస్తూ వలస వెళ్లే కార్మికుల విశిష్ట నైపుణ్యాలు (సాఫ్ట్‌ స్కిల్స్‌) పెంపొందించుట ఈ శిక్షణ ఉద్దేశమని ట్రైనర్ బిఎల్ సురేంద్రనాథ్ తెలుపారు. 

 

రిక్రూట్మెంటు నుండి గల్ఫ్‌లో ఉద్యోగంలో చేరేంత వరకు వివిధ దశల్లో ఎలా మెలగాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ శిక్షణలో తెలుపుతున్నారు. గల్ఫ్‌ దేశాలలో చట్టాలు, వాటిని అతిక్రమిస్తే వారు వేసే శిక్షలను తెలుపుతున్నారు. ఇంతే కాకుండా ఏ రంగంలో పని చేస్తే ఎంత జీతం వస్తుంది, దానిని ఎలా ఖర్చు పెట్టుకోవాలి, పొదుపు చేసిన డబ్బును కుటుంబ సభ్యులకు ఎలా చేరవేయాలి తదితర విషయలను వివరిస్తున్నారు. 

 

ఇంకా చదవండి: 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. వీరికి భారీ షాక్! అమలులో కొత్త ట్విస్ట్! ఎవరు అర్హులు?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

 

వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jobs #GulfNews #GulfJobs #NRIs