గురి చూసి కొట్టిన చంద్రబాబు! వైసీపీ లీడర్స్ లో వణుకు - ఆ భూములు రికార్డులు!

Header Banner

గురి చూసి కొట్టిన చంద్రబాబు! వైసీపీ లీడర్స్ లో వణుకు - ఆ భూములు రికార్డులు!

  Fri Aug 09, 2024 08:30        Politics

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 22ఏ కింద మార్పు చేసుకున్న భూముల రిజిస్ట్రేషన్ లు మూడు నెలలపాటు నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం నిర్ణయంతో పలు జిల్లాలోని వైసీపీ నాయకుల్లో వణుకు మొదలైందని తెలిసింది. ఇప్పటికే విక్రయాలు జరిగిన భూములపై విచారణ కమిటీ వేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, తిరుపతి, రేణిగుంట, గూడూరు, సుళూరుపేట పట్టణాల సమీపంలో ఉన్న వేల ఎకరాల భూముల విషయంలో గోల్ మాల్ జరిగిందని, ఆ భూముల వ్యవహారంలో చాలా గోల్ మాల్ జరిగిందని ఆ భూముల పత్రాలను పరిశీలించాలని నిర్ణయించారు. రిజిస్ట్రేషన్లు జరిగిన ఆ భూము అసలు హక్కుదారులు ఎవరు, కొనుగోలుదారులు ఎవరు అనే వివరాలు పరిశీలించి తరువాత నిర్ణయం తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. క్షేత్ర సాయి లో పర్యటించి ఫిజికల్ రికార్డ్స్, కంప్యూటర్ రికార్డులు, రిజిస్ట్రేషన్ జరిగిన తీరు పరిశీలించాలని చంద్రబాబు ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ జరిగిన ప్రాంతాల్లో భూముల అమ్మకాలు, మార్ట్ గేజ్, గిఫ్ట్ డీడ్ అయిన రిజిస్ట్రేషన్ భూముల పత్రాలను సంబందిత అధికారులు పరిశీలించాలని సిద్దం అయ్యారు.

 

ఇంకా చదవండి: ఎమ్మెల్సీ ఎన్నిక వేళ వైసీపీకి మరో షాకిచ్చిన గంటా! త్వరలో జరిగేది ఇదే! ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి?

 

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ రిజిస్టర్, తాసిల్దార్, మండల సర్వేయర్లు స్వయంగా వెళ్లి 22 ఏ భూముల వ్యవహారం గురించి అరా తీయాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అసైన్డ్, ఫ్రీ ఓల్డ్ భూములు వేల ఎకరాలు ఇప్పటికే క్రయ విక్రయాలు జరిగాయని, ఈ విక్రయాలు మొత్తం నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ప్రభుత్వ భూములు, పోరంబోకు భూములు, అసైన్డ్ భూములు, 22ఏ భూములు, వెసులుబాటు కల్పించిన భూములు రికార్డులు మొత్తం పరిశీలించడానికి సబ్ సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీ సిద్ధమైందని సమాచారం. అదేవిధంగా డిజిటల్ సంతకాల పైన అనేక అనుమానాలు ఉన్నాయని వెలుగు చూసింది. చట్ట విరుద్ధంగా జరిగిన రిజిస్ట్రేషన్ల విషయంపై బాధితులు డివిజన్ సాయి అధికారులకు ఫిర్యాదులు చేయవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇనాం భూములు పెద్ద ఎత్తున ఫ్రీ హోల్డ్ కింద చేర్చారని, చుక్కల భూములు పరిస్థితి ఇలాగే ఉందని వెలుగు చూసింది. సుమారు పదివేల ఎకరాల డాక్యుమెంట్ లపే పరిశీలించాలని సంబంధిత అధికారులు నిర్ణయించారని సమాచారం. ముఖ్యంగా వందలు, వేల కోట్ల రూపాయల విలువైన భూములు ఉండే తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు ఎవరెవరు చేతుల్లోకి వెళ్లాయి అంటూ కూటమి ప్రభుత్వం పూర్తి సమాచారం సేకరిస్తుందని తెలిసింది.

ఇంకా చదవండి: 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. వీరికి భారీ షాక్! అమలులో కొత్త ట్విస్ట్! ఎవరు అర్హులు?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

 

వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples