కుప్పం, పుంగనూరులో ఆ పనులు చెయ్యండి! ఎంతైనా పర్వాలేదు, చంద్రబాబు ఆర్డర్!

Header Banner

కుప్పం, పుంగనూరులో ఆ పనులు చెయ్యండి! ఎంతైనా పర్వాలేదు, చంద్రబాబు ఆర్డర్!

  Fri Aug 09, 2024 07:30        Politics

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన సొంత జిల్లా చిత్తూరు పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి పరిధిలోని కుప్పం, పుంగనూరు బ్రాంచ్ కాలువలకు సాగు నీరు రావడం లేదు. నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులు పనులు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ఆరు సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వగా అందులో హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కూడా ఉంది. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే పుంగనూరు బ్రాంచ్ కాలువకు త్వరలోనే సాగు నీరు అందుతుందని తెలిసింది. 2014- 19 మధ్యకాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో హంద్రీ నీవా ప్రాజెక్టు పనులు వేగవంతం చేశారు. కర్నూలు జిల్లా నుండి ఉమ్మడి చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతాలైన తంబళ్లపల్లె, మదననల్లె, పుంగనూరు, పలమనేరు ప్రాంతాలకు సాగునీరు అందించడానికి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం హంద్రీ నీవా ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామకుప్పం వరకు కొంత నీళ్లు తీసుకు వచ్చిన వైసీపీ ప్రభుత్వం హడావిడి చేసి సైలెంట్ అయిపోయింది. ఇప్పటికే పుంగనూరు బ్రాంచ్ కాలంలో ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయని సంబంధిత అధికారులు కూటమి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

 

ఇంకా చదవండి: ఎమ్మెల్సీ ఎన్నిక వేళ వైసీపీకి మరో షాకిచ్చిన గంటా! త్వరలో జరిగేది ఇదే! ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి?

 

ఇక తంబళ్లపల్లె నియోజకవర్గం లో బ్రాంచ్ కాలువ పలుచోట్ల పూర్తిగా దెబ్బతినిందని అధికారులు కూటమి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు ఈ పనులు త్వరగా పూర్తి చేయాలంటే దాదాపు రూ. వంద కోట్లకు పైగా ఖర్చు అవుతుందని సంబంధిత అధికారులు చంద్రబాబు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. హంద్రీనీవా ప్రాజెక్టు పనులకు ప్రాజెక్టు పనులు పూర్తి అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పుంగనూరు, నియోజకవర్గాల్లో దాదాపు 37 వేల ఎకరాలకు ఆయకట్టు నీరు అందుతుందని అధికారులు అంటున్నారు. ఇక కుప్పం బ్రాంచ్ కాలువ పనులు పూర్తి చెయ్యడానికి చర్యలు తీసుకుంటున్నారు. కుప్పం, గుడిపల్లె, శాంతిపురం మండలాల్లో పనులు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు అంటున్నారు. కుప్పంలో కాలువ పనులకు భూములు ఇచ్చిన రైతులకు రూ. 17 కోట్లు బకాయిలు ఇవ్వాలని, హంద్రీ నీవా కాలువు పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు సుమారు రూ. 29 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు కూటమి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. హంద్రీ నీవా ప్రాజెక్టు పనులు పూర్తయి అయితే 110 చెరువులకు సాగు నీరు అందుతుంది. పుంగనూరు కుప్పం బ్రాంచ్ కాలవ పనులు పూర్తి అయితే కృష్ణా జలాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వస్తాయని, సుమారు 43 వేల ఎకరాలకు సాగునీరు నాలుగు లక్షల మందికి తాగునీరు అందుబాటులోకి వస్తుందని, కాలువ పనులు వేగవంతం చెయ్యాలని సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది.

ఇంకా చదవండి: 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. వీరికి భారీ షాక్! అమలులో కొత్త ట్విస్ట్! ఎవరు అర్హులు?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

 

వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance