అమరావతి రైల్వే లైన్ పనుల్లో వేగం.. మోడీ మార్క్! 450 హెక్టార్ల మేర భూసేకరణ!

Header Banner

అమరావతి రైల్వే లైన్ పనుల్లో వేగం.. మోడీ మార్క్! 450 హెక్టార్ల మేర భూసేకరణ!

  Thu Aug 08, 2024 17:08        Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు కేంద్రం కూడా దృఢ సంకల్పంతో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం అమరావతి నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని పార్లమెంటు సమావేశాలలోనే స్పష్టం చేసింది. ఇక ఇటీవల అమరావతి రైల్వే లైన్ కోసం కూడా రైల్వే శాఖ వేగంగా పనులను మొదలుపెట్టింది. మోడీ మార్క్ చూపిస్తుంది. ఈ లైన్ కు సంబంధించి భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన రైల్వే శాఖ రాజధాని అమరావతి వరకు రైల్వే లైన్ ఏర్పాటుకు సంబంధించి పనులు మొదలుపెట్టింది. గతంలో రాష్ట్రం వాటా ఇవ్వాలని, భూసేకరణ వ్యయం భరించాలని చెప్పిన రైల్వేశాఖ ఇప్పుడు పూర్తిగా తమ నిధులతోనే అమరావతికి రైల్వే లైన్ నిర్మాణానికి ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఎర్రుపాలెం అమరావతి నంబూరు మధ్య భూసేకరణకు ఇప్పుడు మరో ముందడుగు పడింది. ఏపీ రాజధాని అమరావతికి రైలు సౌకర్యం కల్పించేలా ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు నిర్మిస్తున్న 56.53 కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ లైన్ కు తెలంగాణ ప్రాంతంలో భూసేకరణ చేపట్టడం కోసం రైల్వే శాఖ కసరత్తును మొదలుపెట్టింది.

 

ఇంకా చదవండి: కుప్పం, పుంగనూరులో ఆ పనులు చెయ్యండి! ఎంతైనా పర్వాలేదు, చంద్రబాబు ఆర్డర్!

 

ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించేందుకు ఖమ్మం జిల్లా ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ను కాంపిటెంట్ అథారిటీగా నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. ఖమ్మం జిల్లాలోని రెండు మండలాల్లో రైల్వే లైను నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఈ అధికారి పర్యవేక్షించనున్నారు.2029 నాటికి రాజధాని అమరావతిని సుందరంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో మరో మూడేళ్లలోనే రాజధాని అమరావతికి రైల్వే లైన్ అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే శాఖ కూడా పనులను వేగవంతం చేసింది. ప్రస్తుత రాజధాని అమరావతికి రైల్వే లైన్ 450 హెక్టార్ల మేర భూసేకరణ..2600 కోట్ల రూపాయలు ఖర్చు.. ఈ రైల్వే లైన్ నిర్మాణం కోసం గుంటూరు, పల్నాడు, కృష్ణ, ఖమ్మం జిల్లాల పరిధిలోని 450 హెక్టార్ల మేర భూసేకరణ చేయనున్నారు. ఇక ఈ సింగల్ లైన్ నిర్మాణానికి భూసేకరణ కోసం 2600 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రాథమికంగా రైల్వే శాఖ అంచనా వేసింది. ఈ కొత్త రైల్వే లైన్ విజయవాడ హైదరాబాదు లైన్ లో ఎర్రుపాలెం దగ్గర మొదలై అమరావతి మీదుగా గుంటూరు, విజయవాడ లైన్ లోని నంబూరు దగ్గర కలుస్తుంది. మొత్తానికి అమరావతికి రైల్వే లైన్ పనుల్లో ముందడుగు పడడంతో రాజధాని ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి: 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. వీరికి భారీ షాక్! అమలులో కొత్త ట్విస్ట్! ఎవరు అర్హులు?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

 

వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance