అమెరికాలో విషాద‌క‌ర ఘ‌ట‌న‌! నీట మునిగి ఇద్ద‌రు తెలుగు చిన్నారుల మృత్యువాత‌! మీడియా స‌మాచారం ప్ర‌కారం!

Header Banner

అమెరికాలో విషాద‌క‌ర ఘ‌ట‌న‌! నీట మునిగి ఇద్ద‌రు తెలుగు చిన్నారుల మృత్యువాత‌! మీడియా స‌మాచారం ప్ర‌కారం!

  Tue Sep 10, 2024 09:00        U S A

అమెరికాలో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ స‌ర‌స్సులో మునిగి ఇద్ద‌రు తెలుగు చిన్నారులు మృత్యువాత ప‌డ్డారు. గ‌త శ‌నివారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళ్తే.. న్యూయార్క్ లాంగ్ ఐలాండ్‌లోని హోల్ట్స్‌విల్లేలోని ఓ అపార్ట్‌మెంట్‌లో డేవిడ్‌, సుధా గాలి అనే తెలుగు దంప‌తులు నివ‌సిస్తున్నారు. ఈ దంప‌తుల‌కు రూత్ ఎవాంజెలిన్ గాలి (4), సెలాహ్ గ్రేస్ గాలి (2) అనే ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. శ‌నివారం రోజు వారిద్ద‌రూ ఆడుకునేందుకు ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లారు. కానీ ఎంత‌సేప‌టికి ఆ చిన్నారులు తిరిగి ఇంటికి రాలేదు. దాంతో త‌ల్లి వారి కోసం ఇంటి చుట్టుప‌క్క‌లంతా వెతికింది. క‌నిపించ‌క‌పోవ‌డంతో త‌ప్పిపోయి ఉంటార‌ని భావించి వెంట‌నే 911కి కాల్ చేసి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చింది. 

ఇంకా చదవండి: అమెరికా మల్టీ మిలియన్ డాలర్ల నిఘా విమానం పై యమన్ హూతీల విజయం! అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై కూడా దాడులు! 50 నేల అడుగుల అంతరిక్షంలో!


ఆమె స‌మాచారం మేర‌కు పోలీసులు రెస్క్యూ సిబ్బందితో అక్క‌డికి చేరుకున్నారు. అనంత‌రం తెలుగు దంప‌తులు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ స‌మీప ప్రాంతాల‌లో వెతికారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు చిన్నారులు అపార్ట్‌మెంట్ స‌మీపంలోని స‌ర‌స్సులోని నీటిపై తేలియాడుతూ క‌నిపించారు. వెంట‌నే వారిని బ‌య‌ట‌కుతీసి ద‌గ్గ‌రిలోని స్టోనీబ్రూక్ యూనివ‌ర్సిటీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ వారిని ప‌రీక్షించిన వైద్యులు అప్ప‌టికే పిల్ల‌లు చనిపోయిన‌ట్లు నిర్ధారించారు. ఇద్ద‌రు కుమార్తెల‌ను పోగొట్టుకున్న త‌ల్లి సుధా గాలి గుండెల‌విసెలా రోదించడం అక్క‌డివారిని క‌లిచివేసింది. ఇక మీడియా స‌మాచారం ప్ర‌కారం చిన్నారుల తండ్రి డేవిడ్‌ వీసా స‌మ‌స్య కార‌ణంగా స్వ‌దేశంలోనే ఉన్న‌ట్లు తెలిసింది. అత్యవ‌స‌ర వీసాపై అమెరికా వెళ్లాల్సి ఉన్నా అది కుద‌ర‌క‌పోవ‌డంతో ప్ర‌స్తుతం ఇండియాలోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది. క్రిస్ట్‌ఫ‌ర్‌లైఫ్ చ‌ర్చ్ అనే నిధుల సేక‌ర‌ణ సంస్థ స‌మాచారం ప్ర‌కారం డేవిడ్‌ను ఎమ‌ర్జెన్సీ వీసాపై అమెరికాకు ర‌ప్పించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఆయ‌న యూఎస్ వెళ్లిన త‌ర్వాతే చిన్నారుల అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నార‌ని స‌మాచారం.

 

ఇంకా చదవండి: తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వీటి ధరలు భారీగా తగ్గింపు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రూ.2 లక్షలు తక్కువకే కొత్త కారు కొనేయండి! మళ్లీ మళ్లీ రాని భారీ ఆఫర్లు!

 

అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!

 

చంద్రబాబును అరెస్ట్ చేసి నేటికి ఏడాది! ఆరోజు ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు! మంత్రి ఫైర్!

 

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం! ఆ వ్యాపారవేత్తకు బెయిల్!

 

ఎమ్మెల్యే తృటిలో తప్పిన పెను ప్రమాదం! ఆలపాడు - కొల్లేటికోట రహదారి పూర్తిగా!

 

జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!

 

మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!

 

భార్య పేరు మీద ఇల్లు కొంటే ఇన్ని లాభాలా? భారీ మొత్తంలో డబ్బు మిగలడం ఖాయం! ఇక ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!

 

ఒమాన్: కేవలం 5 రియాల్ (₹1,000) కే 10 రోజుల టూరిస్ట్ వీసా! అతి తక్కువ విమాన మరియు హోటల్ ధరలు! భారతీయులకు ఒమాన్ ప్రభుత్వం భారీ ఆఫర్లు!

 

ఇక వరదలకు చెక్.. బుడమేరుకు రిటైనింగ్ వాల్ ప్రణాళిక! మంత్రుల కీలక వ్యాఖ్యలు!

 

స్టార్ హీరోలను మించి! ఏపీ, తెలంగాణాలకు రియల్ హీరో సోనూసూద్ భారీ విరాళం!

 

హైదరాబాదులోని అమెరికా కౌన్సిలేట్లో ఉద్యోగ అవకాశాలు! వెంటనే అప్లై చేసుకోండి ఇలా! జీతం ఎంతంటే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #USA #America #Dead #IndainDead #Bharatanatyam #Amarnath