సాంకేతిక లోపం కారణంగా ఇండిగో సర్వీసులకు భారీ షాక్! చెక్-ఇన్ సేవల్లో ఆలస్యం, ప్రయాణికుల ఆందోళనలో!

Header Banner

సాంకేతిక లోపం కారణంగా ఇండిగో సర్వీసులకు భారీ షాక్! చెక్-ఇన్ సేవల్లో ఆలస్యం, ప్రయాణికుల ఆందోళనలో!

  Sat Oct 05, 2024 15:49        Others

దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో దేశవ్యాప్తంగా సంస్థ కార్యకలాపాలు, విమాన సేవలపైనా ప్రభావం పడింది. ఎయిర్పోర్టుల్లో చెక్-ఇన్లు నెమ్మదిగా సాగుతున్నాయి. టికెట్ బుకింగ్లు సైతం అవ్వడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రధాన విమానాశ్రయాల్లో చెక్-ఇన్ కోసం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. తమకు ఎదురైన అసౌకర్యాన్ని సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోల రూపంలో షేర్ చేస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఈ సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. సాంకేతిక లోపంపై ఇండిగో 'ఎక్స్' వేదికగా స్పందించింది. ప్రయాణికుల అసౌకర్యంపై విచారం వ్యక్తంచేసింది. “మా నెట్వర్క్లు అన్నింటిలోనూ తాత్కాలికంగా వ్యవస్థలు నెమ్మదించాయి. మా వెబ్సైట్, బుకింగ్ సిస్టమ్పై ఈ ప్రభావం పడింది. దీని కారణంగా కస్టమర్ల వెయిట్ టైమ్ పెరగొచ్చు. ఎయిర్పోర్టుల్లో చెక్-ఇన్లు నెమ్మదిగా సాగుతుండటంతో రద్దీ పెరిగే అవకాశం ఉంది. ప్రయాణికులకు ఏ ఇబ్బంది కలగకుండా సేవలందించేందుకు మా ఎయిర్పోర్టు బృందం సిద్ధంగా ఉంది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి సేవలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాం. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తంచేస్తున్నాం” అని ఇండిగో పేర్కొంది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #indigo #flight #repair #todaynews #flashnews #latestupdate