సామాజిక మాధ్యమాల్లో ఉచిత ఇసుకపై అసత్య ప్రచారం! సీఎం చంద్రబాబు ఆగ్రహం, కఠిన చర్యలకు ఆదేశాలు!

Header Banner

సామాజిక మాధ్యమాల్లో ఉచిత ఇసుకపై అసత్య ప్రచారం! సీఎం చంద్రబాబు ఆగ్రహం, కఠిన చర్యలకు ఆదేశాలు!

  Sat Oct 05, 2024 19:33        Politics

ఉచిత ఇసుకపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన చర్యలకు వెనుకాడవద్దని గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనాకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా జరుగుతున్న ప్రచారంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజలను తప్పుదారి పట్టించేలా సాగుతున్న సామాజిక మాధ్యమ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని మీనాను ఆదేశించారు. ఉద్దేశ పూర్వకంగా ఉచిత ఇసుకపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తేలా దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం ధ్వజమెత్తారు. కలెక్టర్లు, ఎస్పీలకు తగిన ఆదేశాలు జారీ చేసి, ఈ తరహా వ్యవహారాల పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రభుత్వం నిజాయితీగా అమలు చేస్తున్న ఇసుక విధానంపై జిల్లా స్థాయిలో నిజానిజాలు వెలికితీసి, బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని గనులశాఖ ముఖ్యకార్యదర్శికి సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #CM #freesand #sand #CBN #TDP #warnings #fakenews #socialmedia #todaynews #flashnews #latestupdate